హోమ్ /వార్తలు /బిజినెస్ /

Penny Stock: ఒక్క షేరు కొంటే 10 షేర్లు ఉచితం.. డబ్బే డబ్బు!

Penny Stock: ఒక్క షేరు కొంటే 10 షేర్లు ఉచితం.. డబ్బే డబ్బు!

Penny Stock: ఒక్క షేరు కొంటే 10 షేర్లు ఉచితం.. డబ్బే డబ్బు!

Penny Stock: ఒక్క షేరు కొంటే 10 షేర్లు ఉచితం.. డబ్బే డబ్బు!

Multibagger Stock | స్టాక్ మార్కెట్‌లో ఒక షేరు అదరగొడుతోంది. భారీ రాబడిని ఇచ్చింది. మల్టీ బ్యాగర్ షేరుగా అవతరించింది. ఈ నెలలో ఒక షేరుకు పది షేర్లు ఉచితంగా లభించనున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Multibagger Share | స్టాక్ మార్కెట్లో ఒక షేరు దుమ్మురేపుతోంది. వరుసగా అప్పర్ సర్క్యూట్ తాకుతూ భారీ లాభాలు అందిస్తోంది. ఇంతకీ అది ఏ షేరు? ఎందుకని ప్రతి రోజూ అప్పర్ సర్క్యూట్ తాకుతూ వస్తోంది? అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. వివాంజా బయోసైన్సెస్ అనే కంపెనీ షేర్లు పరుగులు పెడుతున్నాయి. ఈ స్టాక్ దలాల్ స్ట్రీట్‌లో (Stocks) అదిరే రాబడిని (Money) అందిస్తోంది. ఈ షేరు కోవిడ్ 19 ప్రతికూల పరిస్థితుల్లో కూడా భారీ లాభాలు అర్జించి పెట్టింది. ఏకంగా 1500 శాతం మేర పెరిగింది.

వివాంజా బయోసైన్సెస్ షేరు ధర గత మూడేళ్ల కాలంలో ఏకంగా రూ. 12.45 నుంచి రూ. 197.95 స్థాయికి ర్యాలీ చేసింది. అంటే ఈ పెన్నీ స్టాక్ ఈ కాలంలో మల్టీ బ్యాగర్ స్టాక్‌గా అవతరించిందని చెప్పుకోవచ్చు. ఈ షేరు ర్యాలీ ఇంతటితో అయిపోలేదు. మార్చి 6 నుంచి చూస్తే.. ఈ స్మాల్ క్యాప్ షేరు అప్పర్ సర్క్యూట్ తాకుతూ వస్తోంది. 5 శాతం మేర పెరుగుతూనే వచ్చింది. బీఎస్‌ఈ వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం చూస్తే.. ఈ ఆరు సెషన్లలో ఈ షేరు ఏకంగా రూ. 147.85 నుంచి రూ. 197.95 స్థాయికి పెరిగింది. అంటే దాదాపు 35 శాతం మేర ర్యాలీ చేసిందని చెప్పుకోవచ్చు.

ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. రేషన్ కార్డు ఉంటే చాలు

కంపెనీ ఇటీవలనే స్టాక్ స్ల్పిట్‌ను ప్రకటించింది. ఒక్క షేరును 10 షేర్లుగా విభజించనుంది. అంటే ఒక్క షేరు ఉన్న వారికి పది షేర్లు ఉచితంగా లభిస్తాయని చెప్పుకోవచ్చు. కంపెనీ ఈ విషయాన్ని బీఎస్‌ఈకి కూడా తెలియజేసింది. ఈ క్రమంలోనే షేరు ధర గత నెల రోజుల కాలంలో ఏకంగా 24 శాతం మేర పైకి చేరింది. కాగా కంపెనీ స్టాక్ స్ల్పిట్ రికార్డ్ డేట్ మార్చి 24గా ఉంది. అంటే ఆ తర్వాత షేరు ధర స్ల్పిట్‌కు అనుగుణంగా పడిపోతుంది.

ఓలా అదిరిపోయే ఆఫర్.. ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్న వారికి ఉచితంగానే..

ఇకపోతే స్టాక్ మార్కెట్‌లో భారీ రిస్క్ ఉంటుంది. అందువల్ల డబ్బులు దాచుకోవాలని భావించే వారు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. లేదంటే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కొన్ని సందర్బాల్లో పెట్టిన డబ్బులు కూడా వెనక్కి తిరిగి రాకపోవచ్చు. అందువల్ల రిస్క్ తీసుకోవడానికి ఇష్ట పడే వారు మాత్రమే స్టాక్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వడం ఉత్తమం. లేదంటే మాత్రం నష్టపోవాల్సి రావొచ్చు. అందుకే డబ్బులు పెట్టడానికి ముందుగా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ నిపుణుల సలహాలు తీసుకోండి.

First published:

Tags: Money, Multibagger stock, Share Market Update, Stock Market

ఉత్తమ కథలు