హోమ్ /వార్తలు /బిజినెస్ /

Vistara: ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పిన విస్తారా.. విమానంలో ఫ్రీ వైఫై

Vistara: ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పిన విస్తారా.. విమానంలో ఫ్రీ వైఫై

దీనిపై ఎయిర్ పోర్టు అధారిటీ ఆఫ్ ఇండియా, తెలంగాణ మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయి. దీని వల్ల ఇటు రాష్ట్రం, అటు కేంద్రం ఇద్దరికీ ఆదాయం పెంచుకునేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

దీనిపై ఎయిర్ పోర్టు అధారిటీ ఆఫ్ ఇండియా, తెలంగాణ మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయి. దీని వల్ల ఇటు రాష్ట్రం, అటు కేంద్రం ఇద్దరికీ ఆదాయం పెంచుకునేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

ప్రారంభ ఆఫర్ కింద కొన్ని రోజుల పాటు ఉచితంగా వైఫై సదుపాయం ఉంటుంది. ఆ తర్వాత చార్జీలు వసూలు చేస్తారు. త్వరలోనే టారిఫ్ వివరాలను వెల్లడిస్తారు.

  కోవిడ్ సంక్షోభం నుంచి అన్ని రంగాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. కరోనా దెబ్బకు తీవ్రంగా నష్టపోయిన వాటిలో విమానరంగం కూడా ఒకటి. లాక్‌డౌన్ సమయంలో అంతర్జాతీయంతో పాటు దేశీయ విమానాలు కూడా నిలిచిపోవడంతో భారీగా నష్టాలు వచ్చాయి. కొన్ని కంపెనీలు ఉద్యోగాల నుంచి సిబ్బందిని తొలగించాయి. మరికొన్ని సంస్థలు జీతాల్లో కోతలు పెట్టాయి. ఐతే ఇప్పుడిప్పుడే విమానయాన రంగం కోలుకుంటున్న నేపథ్యంలో ప్రయాణికులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి ఎయిర్ లైన్స్ సంస్థలు. ఈ క్రమంలోనే విమాన ప్రయాణికులకు విస్తారా సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై అంతర్జాతీయ విమానాల్లో వైఫై సదుపాయం అందుబాటులో ఉంటుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

  సెప్టెంబరు 18 నుంచి ఢిల్లీ-లండన్ మధ్య విస్తారా విమాన సేవలు మొదలయ్యాయి. నిన్న Boeing 787-9 విమానంలో వైఫై సేవలను ప్రారంభించారు. ప్రారంభ ఆఫర్ కింద కొన్ని రోజుల పాటు ఉచితంగానే వైఫై సేవలు అందిస్తామని విస్తారా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వినోద్ కన్నన్ తెలిపారు. త్వరలోనే ఎయిర్ బస్ A321neo విమానాల్లోనూ ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఆన్ బోర్డు వైఫై సేవలు అందిస్తున్న తొలి దేశీయ విమానయాన సంస్థ విస్తారేనని ఆయన అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాలకు అత్యద్భుత విమానయాన అనుభూతిని ప్రయాణికులకు కలగజేస్తామని ఆయన తెలిపారు. ప్రారంభ ఆఫర్ కింద కొన్ని రోజుల పాటు ఉచితంగా వైఫై సదుపాయం ఉంటుంది. ఆ తర్వాత చార్జీలు వసూలు చేస్తారు. త్వరలోనే టారిఫ్ వివరాలను వెల్లడిస్తారు. కాగా, స్కైట్రాక్స్, ట్రిప్ఆడ్వైజర్‌లో అత్యధిక రేటింగ్‌తో తొలి స్థానంలో నిలిచింది విస్తారా. అంతేకాదు బెస్ట్ ఎయిర్‌లైన్ సంస్థగా ఎన్నో అవార్డులు అందుకుంది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Airlines

  ఉత్తమ కథలు