Flight Ticket Offers | మీరు విమాన ప్రయాణం చేయాలని భావిస్తున్నారా? పండుగకు ఊరెళ్లేందుకు రెడీ అవుతున్నారా? అయితే గుడ్ న్యూస్. ఎందుకని అనుకుంటున్నారా? మీకోసం అదిరిపోయే ఆఫర్ (Offer) ఒకటి అందుబాటులో ఉంది. తక్కువ ధరకే విమాన టికెట్ పొందొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? ప్రముఖ ఎయిర్‌లైన్స్ విస్తారా తాజాగా టికెట్ (Ticket) ధరల డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రయాణికులు తక్కువ ధరకే విమాన టికెట్ సొంతం చేసుకోవచ్చు.
టాటా గ్రూప్‌నకు చెందిన విస్తారా ఎయిర్‌లైన్స్ తాజాగా 8వ వార్షికోత్సవ సేల్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా కంపెనీ ప్రయాణికులకు టికెట్లపై స్పెషల్ ఆఫర్లు అందుబాటులో ఉంచింది. దేశీ, విదేశీ నెట్‌వర్క్‌లోకి విమానాలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. అందువల్ల విమాన ప్రయాణం చేయాలని భావిస్తున్న వారు ఈ ఆఫర్‌ను సొంతం చేసుకోవచ్చు. తక్కువ ధరలోనే ఫ్లైట్ టికెట్లను బుక్ చేసుకునే వెసులుబాటు పొందొచ్చు.
రూ.2 వేలు, రూ.500, రూ.200, రూ.100 నోట్లపై రాస్తే చెల్లవా? కేంద్రం ఏమంటోందంటే..
ట్విట్టర్ వేదికగా విస్తారా ఎయిర్‌లైన్స్ ఈ విషయాన్నివెల్లడించింది. వన్‌వే టికెట్ ధర రూ. 1899 నుంచి ప్రారంభం అవుతోందని తెలిపింది. ఎకానమి క్లాస్‌కు ఈ రేటు వర్తిస్తుంది. అలాగే ప్రీమియం ఎకానమి అయితే టికెట్ రేటు రూ. 2699 నుంచి ప్రారంభం అవుతోంది. ఇంకా బిజినెస్ ఎకానమి క్లాస్ అయితే టికెట్ ధర రూ. 6,999 నుంచి ప్రారంభం అవుతుంది.
ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ.25,000 డిస్కౌంట్.. కొత్త ఏడాది కళ్లుచెదిరే ఆఫర్!
Join us as we mark 8 glorious years of soaring through the skies with our Anniversary Sale! Enjoy special fares when flying with us. Also get flat 23% off on seat selection and excess baggage. Book Now: https://t.co/MJpP6xhF0v. T&C Apply pic.twitter.com/tdIMMAFDEw
— Vistara (@airvistara) January 7, 2023
అదే ఇంటర్నేషన్ విమాన ప్రయాణం విషయానికి వస్తే.. దీని రేటు రూ. 13,299 నుంచి ప్రారంభం అవుతోంది. ఎకానమి క్లాస్‌క ఈ రేటు వర్తిస్తుంది. ఢిల్లీ నుంచి ఖాట్మాండ్‌కు ఈ రేటు ఉంటుంది. అలాగే ప్రీమియం ఎకానమి క్లాస్ అయితే టికెట్ రేటు రూ. 16,799 నుంచి ఉంది. ఢిల్టీ ఖాట్మాండ్‌కే ఈ రేటు ఉంటుంది. అలాగే బిజినెస్ క్లాస్ అయితే రేటు రూ. 43,699 నుంచి ప్రారంభం అవుతోంది. ఢిల్లీ ఖాట్మాండ్, ముంబై ఖాట్మాండ్ రూట్లలో ఈ రేటు ఉంది.
అంతేకాకుండా విస్తారా ఇతర డిస్కౌంట్ ఆఫర్లు కూడా తీసుకువచ్చింది. పెయిడ్ సీట్స్ కొనుగోలు, ఎక్స్చెస్ బ్యాగేట్ వంటి వాటిపై 23 శాతం తగ్గింపు అందిస్తోంది. జనవరి 12 వరకు ఈ టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఇందులో భాగంగా టికెట్లు బుక్ చేసుకున్న వారు జనవరి 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు జర్నీ చేయొచ్చు. కంపెనీ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఈ టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్లు పొందొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Flight tickets, Latest offers, Money, Vistara Airlines