Vistara Airlines | విస్తారా ఎయిర్‌లైన్స్ ఏడో యానివర్సరీ సేల్ (7th anniversary sale) ప్రకటించింది. కేవలం రూ.977 నుంచి ఫ్లైట్ టికెట్ ఆఫర్ అదిస్తోంది. హైదరాబాద్ నుంచి తక్కువ ధరకే ఫ్లైట్ టికెట్స్ అందుబాటులో ఉన్నాయి.
ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేస్తున్నారా? కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం తగ్గిన తర్వాత ఫ్యామిలీ ట్రిప్ వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. విస్తారా ఎయిర్‌లైన్స్ (Vistara Airlines) ఏడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 48 గంటల సేల్ ప్రకటించింది. ఈ సేల్‌లో కేవలం రూ.977 నుంచే ఫ్లైట్ టికెట్లను ఆఫర్ చేస్తోంది. ఈ సేల్ 2022 జనవరి 7 అర్థరాత్రి వరకు కొనసాగుతుంది. 2022 జనవరి 21 నుంచి 2022 సెప్టెంబర్ 30 మధ్య ప్రయాణించాలనుకునేవారు ఈ ఆఫర్ పొందొచ్చు. అంటే జనవరి 21 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునేవారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. కేవలం రూ.977 నుంచే ఫ్లైట్ టికెట్స్ పొందొచ్చు.
ఇక ఇప్పటికే ఇండిగో ఎయిర్‌లైన్స్, స్పైస్‌జెట్ కేవలం రూ.1122 ధరకే ఫ్లైట్ టికెట్స్ అందించిన సంగతి తెలిసిందే. ఈ సేల్ ఇటీవల ముగిసింది. ఇప్పుడు విస్తారా ఎయిర్‌లైన్స్ ఆఫర్ ప్రకటించింది. విస్తారా ఎయిర్‌లైన్స్ ప్రకటించిన ఆఫర్లో జమ్మూ నుంచి శ్రీనగర్‌కు రూ.977 ధరకే ఫ్లైట్ టికెట్ ఉంది. హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు, ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు ఫ్లైట్ ఛార్జీలు వేర్వేరుగా ఉన్నాయి. విస్తారా ఎయిర్‌లైన్స్ వెబ్సైట్లో ఉన్న వివరాల ప్రకారం ఆఫర్లో ఈ ఛార్జీలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.
హైదరాబాద్ నుంచి విస్తారా ఎయిర్‌లైన్స్ ఆఫర్ వివరాలు
బెంగళూరు నుంచి హైదరాబాద్- రూ.1,781
హైదరాబాద్ నుంచి బెంగళూరు- రూ.1,785
ఢిల్లీ నుంచి హైదరాబాద్- రూ.2,410
హైదరాబాద్ నుంచి ఢిల్లీ- రూ.2,588
హైదరాబాద్ నుంచి చండీగఢ్- రూ.4,206
చండీగఢ్ నుంచి హైదరాబాద్ రూ.4,111
ముంబై నుంచి హైదరాబాద్- రూ.2,171
హైదరాబాద్ నుంచి ముంబై- రూ.2,371
పైన ఇచ్చిన ఛార్జీలు ఎకనమీ క్లాస్ ఫేర్ మాత్రమే. ప్రీమియం ఎకనమీ క్లాస్, బిజినెస్ క్లాస్ ఫేర్ ఎక్కువగా ఉంటుంది. ప్రీమియం ఎకనమీ క్లాస్ టికెట్ ధర రూ.2,677 నుంచి, బిజినెస్ క్లాస్ ధర రూ.9,777 నుంచి ప్రారంభమవుతుంది. 2022 జనవరి 7 లోపు టికెట్లు బుక్ చేసేవారికే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఆఫర్లో ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేముందు నియమనిబంధనలు తెలుసుకోవాలి.
విస్తారా ఎయిర్‌లైన్స్ వెబ్సైట్, ఆండ్రాయిడ్ యాప్, ఐఓఎస్ యాప్, విస్తారా ఎయిర్పోర్ట్ టికెట్ ఆఫీస్, ఎయిర్‌లైన్ కాల్ సెంటర్, ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీ, ఇతర ట్రావెల్ ఏజెంట్ల దగ్గర ఆఫర్లో విస్తారా ఎయిర్‌లైన్స్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఆఫర్లో కేవలం లిమిటెడ్ సీట్లు మాత్రమే ఉంటాయి కాబట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్ధతిలో ముందు బుక్ చేసేవారికే తక్కువ ధరకు టికెట్లు లభిస్తాయి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.