విస్తారా ఎయిర్‌లైన్స్ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.1,099 ఫ్లైట్ టికెట్స్ అమ్ముతోంది. కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ ప్రభావం తగ్గడంతో ఇప్పుడిప్పుడే జనం బయటకు వస్తున్నారు. దీంతో విస్తారా ఎయిర్‌లైన్స్ 48 గంటల మాన్‌సూన్ సేల్ ఆఫర్ ప్రకటించింది. ఈ సేల్ జూన్ 24న మొదలైంది. జూన్ 25 అర్ధరాత్రి సేల్ ముగుస్తుంది. ఎకానమీ, ప్రీమియం ఎకానమి, బిజినెస్ క్లాస్ టికెట్లపై డిస్కౌంట్స్ ప్రకటించింది. సెకండ్ వేవ్ కారణంగా ఇన్నాళ్లూ ప్రయాణాలకు దూరంగా ఉన్నవారిని సంతోషంగా రప్పించేందుకు ఈ ఆఫర్ ప్రకటించినట్టు విస్తారా సీఓఓ వినోద్ ఖన్నా తెలిపారు. కరోనా వైరస్ ప్రభావం తగ్గడంతో డిమాండ్ నెమ్మదిగా పెరుగుతోందని అన్నారు.
Mi 11 Lite: కాసేపట్లో ఎంఐ 11 లైట్ ప్రీ-ఆర్డర్ సేల్... రూ.3,000 డిస్కౌంట్
PF Aadhaar Link: పీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ తప్పనిసరి... ఈ స్టెప్స్ ఫాలో అవండి
Have travel plans? We’ve got you covered with our Monsoon Sale! Book a cabin of your choice at discounted fares starting at INR 1099 all-in for travel between 01-Aug-21 and 12-Oct-21. Hurry! https://t.co/EaZx6ptP1M#AirlineIndiaTrusts pic.twitter.com/4gWeekKWM8
— Vistara (@airvistara) June 25, 2021
ప్రయాణికులు జూన్ 25 అర్థరాత్రి 11.59 గంటల వరకు డిస్కౌంట్ ధరలకే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఆగస్ట్ 1 నుంచి అక్టోబర్ 12 మధ్య జర్నీ ప్లాన్ చేసుకునేవారికే డిస్కౌంట్ ధరలకు ఫ్లైట్ టికెట్స్ లభిస్తాయి. విస్తారా వెబ్‌సైట్, మొబైల్ యాప్స్, విస్తారా ఎయిర్‌పోర్ట్ టికెట్ ఆఫీస్, ఎయిర్‌లైన్ కాల్ సెంటర్, ట్రావెల్ ఏజెంట్ల ద్వారా టికెట్లు బుక్ చేయొచ్చు. మొదట బుక్ చేసుకున్నవారికే తక్కువ ధరకు టికెట్లు దొరికే అవకాశాలు ఎక్కువ. ఇక విస్తారా వెబ్‌సైట్‌లో టికెట్ ధరలు చూస్తే కేవలం ఢిల్లీ నుంచి చండీగఢ్‌కు మాత్రమే రూ.1,099 ధరకు ఫ్లైట్ టికెట్ ఉంది.
PM Kisan Scheme: రైతులకు శుభవార్త... పీఎం కిసాన్ డబ్బుల్ని ఇలా కూడా చెక్ చేయొచ్చు
Motorola Rugged Mobile: ఈ స్మార్ట్‌ఫోన్‌ను నీళ్లల్లో నానబెట్టి, సబ్బుతో కడిగేయొచ్చు
బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు రూ.1,449, ముంబై నుంచి హైదరాబాద్‌కు రూ.1,999, ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు రూ.1,949, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు రూ.1,599, హైదరాబాద్ నుంచి ముంబైకి రూ.2,199, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి రూ.2,149 టికెట్ ధరలు ఉన్నాయి. ఇవన్నీ ఎకానమీ టికెట్‌పై డిస్కౌంట్ ధరలు. విస్తారా ఎయిర్‌లైన్స్ 48 గంటల మాన్‌సూన్ సేల్ ముగియగానే ధరలు మారతాయి. డిస్కౌంట్ ధరలకు టికెట్లు బుక్ చేసుకునేముందు ప్రయాణికులు ఆఫర్‌కు సంబంధించిన నియమనిబంధనలన్నీ చదవాలి. ఆగస్ట్ 1 నుంచి అక్టోబర్ 12 మధ్య ప్రయాణించాలనుకునేవారికే ఈ డిస్కౌంట్ ధరలు వర్తిస్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Flight, Flight Offers, Flight tickets