Home /News /business /

VISTADOME TRAIN AVAILABLE FOR SOUTH CENTRAL RAILWAY PASSENGERS FOR FIRST TIME IN SECUNDERABAD PUNE ROUTE KNOW CHARGES AND TIMINGS SS

Vistadome Train: సికింద్రాబాద్ నుంచి అద్దాల రైలు... ఛార్జీలు, టైమింగ్స్ తెలుసుకోండి

Vistadome Train: సికింద్రాబాద్ నుంచి అద్దాల రైలు... ఛార్జీలు, టైమింగ్స్ తెలుసుకోండి
(ప్రతీకాత్మక చిత్రం)

Vistadome Train: సికింద్రాబాద్ నుంచి అద్దాల రైలు... ఛార్జీలు, టైమింగ్స్ తెలుసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

Vistadome Train | సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అద్దాల రైలు అందుబాటులోకి వచ్చింది. విస్టాడోమ్ కోచ్ (Vistadome Coach) ఉన్న రైలు ఛార్జీలు, టైమింగ్స్, రూట్ వివరాలు తెలుసుకోండి.

సికింద్రాబాద్ నుంచి వెళ్లే రైల్వే ప్రయాణికులకు శుభవార్త. సికింద్రాబాద్ నుంచి అద్దాల రైలు అందుబాటులోకి వచ్చింది. భారతీయ రైల్వే నడుపుతున్న అద్దాల రైళ్లకు క్రేజ్ ఎక్కువ. విస్టాడోమ్ కోచ్‌లతో (Vistadome Coach) ఈ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. సికింద్రాబాద్-పూణె రూట్‌లో తిరిగే శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ రైళ్లకు విస్టాడోమ్ కోచ్‌లు (Vistadome Coach) అందుబాటులోకి వచ్చాయి. సెంట్రల్ రైల్వే ఈ రైళ్లను అద్దాల బోగీలతో నడుపుతోంది. ఇప్పటికే పశ్చిమ కనుమల్లో ముంబై-గోవా, ముంబై-పూణె రూట్లలో విస్టాడోమ్ ట్రైన్ అందుబాటులో ఉంది. తాజాగా పూణె-సికింద్రాబాద్ శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అద్దాల బోగీలను అమర్చింది రైల్వే.

సికింద్రాబాద్-పూణె రూట్‌లో ప్రయాణించేవారు అద్దాల రైలు నుంచి వికారాబాద్‌లోని అనంతగిరి హిల్స్, ఉజ్జయిని బ్యాక్ వాటర్స్, భిగ్వాన్ సమీపంలోని డ్యామ్‌తో పాటు ప్రకృతి అందాలను వీక్షిస్తూ ప్రయాణం చేయొచ్చు. ఈ రైలు బోగీ మొత్తం అద్దాలతో ఉంటుంది బయటి వాతావరణాన్ని ప్రయాణికులు చూసేందుకు వీలుంటుంది. రైలు నెంబర్ 12025 పూణె-సికింద్రాబాద్ శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ ఉదయం 6 గంటలకు పూణెలో బయల్దేరి అదేరోజు మధ్యాహ్నం 2.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఇక రైలు నెంబర్ 12026 సికింద్రాబాద్-పూణె శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 2.45 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి అదేరోజు రాత్రి 11.10 గంటలకు పూణె చేరుకుంటుంది.

IRCTC South India Tour: విశాఖపట్నం నుంచి 6 రోజులు సౌత్ ఇండియా టూర్... ప్యాకేజీ వివరాలు ఇవే

సికింద్రాబాద్-పూణె రూట్‌లో నడిచే శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ రైలు బేగంపేట్, వికారాబాద్ జంక్షన్, తాండూర్, వాడి, కలబుర్గి, సోలాపూర్ జంక్షన్లలో ఆగుతుంది. ఈ రెండు రైళ్లు మంగళవారం అందుబాటులో ఉండవు. ఛార్జీల వివరాలు చూస్తే విస్టాడోమ్ ఏసీ టికెట్ ధర రూ.2,495, ఏసీ చైర్ కార్ టికెట్ ధర రూ.2,110, ఎగ్జిక్యూటీవ్ చైర్ కార్ టికెట్ ధర రూ.1,935.

భారతీయ రైల్వే రైళ్లకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న విస్టాడోమ్ కోచ్‌లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సుమారు 50 రైళ్లకు విస్టాడోమ్ కోచ్‌లు అందుబాటులోకి వచ్చాయి. అయితే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ రైళ్లు లేవు. సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ రూట్‌లో విస్టాడోమ్ ట్రైన్ నడుపుతుండటం విశేషం. అరకు వెళ్లే ప్రయాణికులకు విశాఖపట్నం నుంచి అద్దాల బోగీ అందుబాటులో ఉంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే విశాఖపట్నం-కిరండూల్ రూట్‌లో నడిచే ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అద్దాల బోగీలను అమర్చింది. అద్దాల బోగీలో ప్రయాణించేందుకు రైల్వే ప్రయాణికులు పోటీపడుతుంటారు. ముఖ్యంగా పర్యాటకులు ఈ రైలు ఎక్కేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.

SBI Loan: గుడ్ న్యూస్... ప్రాసెసింగ్ ఫీజ్ లేకుండా ఎస్‌బీఐ నుంచి రుణాలు



విస్టాడోమ్ కోచ్ అత్యాధునిక సదుపాయాలు, ఫీచర్స్ ఉంటాయి. పుష్‌బ్యాక్ సీట్స్, ఆటోమెటిక్ స్లైడింగ్ కంపార్ట్‌మెంట్ డోర్స్, రొటేటబుల్ సీట్స్, సీసీటీవీ కెమెరాలు, ఎల్ఈడీ డిస్‌ప్లే, ఓవెన్, రిఫ్రిజిరేటర్, మినీ ప్యాంట్రీ, స్టీల్ లగేజ్ షెల్ఫ్, మొబైల్ ఛార్జింగ్ సాకెట్, బయో టాయిలెట్స్, జీపీఎస్ బేస్డ్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ లాంటి ఫీచర్స్ ఉంటాయి.
Published by:Santhosh Kumar S
First published:

Tags: India Railways, Railways, Secunderabad railway station, South Central Railways

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు