Home /News /business /

VISTA EQUITY PARTNERS TO PICK UP STAKE IN JIO PLATFORMS FOR RS 11367 CR MK

Reliance Jio-Vista Deal: రిలయన్స్ జియోలో వాటాలు దక్కించుకోనున్న విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్...

మే 8, 2020. రిలయన్స్ జియోలో 2.32 శాతం వాటా కోసం రూ.11367  కోట్లు చెల్లించిన విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్.

మే 8, 2020. రిలయన్స్ జియోలో 2.32 శాతం వాటా కోసం రూ.11367 కోట్లు చెల్లించిన విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్.

రిలయన్స్ జియోలో ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఫోకస్డ్ ఫండ్ గా పేరొందిన విస్టా సుమారు రూ. రూ.11,367 కోట్ల విలువైన వాటాలను దక్కించుకోనుంది.

    రిలయన్స్ జియో మరో సంచలనం సృష్టించింది. యూఎస్ బేస్డ్ ఈక్విటీ సంస్థ విస్టా ఈక్విటీ పార్ట్ నర్స్, జియో ప్లాట్‌ఫార్మ్స్‌లో 2.3 శాతం వాటాలను దక్కించుకునేందుకు సిద్ధంగా ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఫోకస్డ్ ఫండ్ గా పేరొందిన విస్టా సుమారు రూ.11,367 కోట్ల విలువైన వాటాలను దక్కించుకోనుంది. ఈ మేరకు గడిచిన వారంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తో ఒప్పందం కుదుర్చుకున్న మూడో అతిపెద్ద వ్యాపార భాగస్వామ్యం కావడం ఇదే కావడం విశేషం. ఇదిలా ఉంటే ఏప్రిల్ లో మొదట రిలయన్స్ జియో, ఫేస్ బుక్ డీల్ కుదిరింది. రిలయన్స్ జియోలో 9.99 శాతం వాటాను ఫేస్ బుక్ కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ సుమారు రూ.43,574 కోట్లు. ఆ తర్వాత ప్రముఖ అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్ జియో ప్లాట్‌పామ్స్‌లో 1 శాతం వాటా తీసుకుంది. ఈ వాటా విలువ రూ.5,655 కోట్లు.

    ఇక విస్టా విషయానికి వస్తే ఈ సంస్థ ప్రారంభ దశ నుంచి అత్యాధునిక టెక్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన ట్రాక్ రికార్డ్ ఉంది. గడిచిన 10 సంవత్సరాల కంపెనీ చరిత్రలో పెట్టుబడులన్నీ చాలా లాభదాయకంగా ఉన్నాయి. కాగా భారతదేశంలో విస్టా పెడుతున్న మొట్టమొదటి పెట్టుబడి డీల్ ఇదే కావడం విశేషం. ఈ డీల్ ద్వారా ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన టెక్నాలజీ ఎంటర్ ప్రైజ్ సంస్థగా రిలయన్స్ జియో నిలించిందడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. విస్టా పెట్టుబడి ద్వారా జియో నిర్వహణ నాణ్యతపై వ్యాపార వర్గాల్లో నమ్మకం పెరిగింది.

    విస్టా పెట్టుబడి ద్వారా జియో నెక్ట్స్ జనరేషన్ సాఫ్ట్‌వేర్, ప్లాట్‌ఫాంగా నిలిచింది. అంతేకాదు కోవిడ్ -19 ఇంత స్థాయిలో వ్యాప్తి చెందుతున్నప్పటికీ , జియో సాంకేతిక సామర్థ్యాలకు, వ్యాపార నమూనా సామర్థ్యానికి ఈ డీల్ ఒక నిదర్శనం అనే చెప్పుకోవచ్చు.

    రిలయన్స్ జియో ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా భారతీయ మార్కెట్లపై లోతైన అవగాహన పెంచడలో ముఖ్య భూమిక పోషించే అవకాశం ఉంది. అంతేకాదు జియో నిరంతర ఆకర్షణ ద్వారా కోవిడ్ అనంతరం వెల్లివిరిసే వేగవంతమైన డిజిటలైజేషన్ అవకాశాలను అందిపుచ్చుకోవడంతో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలైన AI,బ్లాక్‌చెయిన్, AR / VR బిగ్ డేటా వంటి సాధనాలను భారతీయులకు పరిచయం చేయడంలో దాని సామర్థ్యాలను ఈ డీల్ నొక్కిచెబుతోంది.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Reliance Jio

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు