తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express) నేటి నుంచి పరుగులు పెట్టనుంది. ఉదయం 10.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నుంచి ఢిల్లీ నుంచి వర్చువల్ గా ఈ ట్రైన్స్ ను ప్రారంభించనున్నారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనన్నారు. ఇందు కోసం సికింద్రాబాద్ స్టేషన్ కు ఇప్పటికే వందే భారత్ ట్రైన్ చేరుకుంది. దేశంలో ఇప్పటికే ఏడు వందే భారత్ ట్రైన్ లు ప్రారంభం కాగా.. అత్యధిక దూరం ప్రయాణించే ట్రైన్ గా నేడు ప్రారంభించనున్న సికింద్రాబాద్-విశాఖ ట్రైన్ నిలవనుంది. ఈ ట్రైన్ 698.5 కి.మీ ప్రయాణించనుంది.
మొత్తం టికెట్లు అంటే?
ఈ ట్రైన్ లో మొత్తం 1128 టికెట్లు ఉంటాయి. ఇందులో రెగ్యులర్ బుకింగ్ లో 806, తత్కాల్ బుకింగ్ లో 322 టికెట్లు అందుబాటులో ఉంచుతారు. అంటే మొత్తం 28.5 శాతం టికెట్లను తత్కాల్ లో అందుబాటులో ఉంచింది ఇండియన్ రైల్వే.
ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యం:
ఈ ట్రైన్లో ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. మోట్రో రైల్ మాదిరగా స్లైడింగ్ తలుపులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో రైలు సిబ్బందిగా మాట్లాడేందుకు అలారం బటన్ ఏర్పాటు చేశారు. ఈ ట్రైన్లో ఉండే స్పెషల్ అట్రాక్షన్ సీట్లు. సీట్లు 180 డిగ్రీల కోణంలో తిరుగుతాయి. దీంతో ప్రయాణికులు కిటికీలో నుంచి ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు.
Gift of Makar Sankranti to the people of Telangana & Andhra Pradesh! The next-gen #VandeBharat Express will provide world class travelling experience to the people of Andhra Pradesh & Telangana.#RailInfra4Telangana#RailInfra4AndhraPradesh pic.twitter.com/810IbAOjWn
— Ministry of Railways (@RailMinIndia) January 15, 2023
ఈ ట్రైన్ కు సంబంధించిన టికెట్ ధరలను పరిశీలిస్తే.. (సికింద్రాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు)
S.No | ప్రాంతాలు | చైర్ కార్ | ఎగ్జిక్యూటీవ్ చైర్ కార్ |
1. | సికింద్రాబాద్-వరంగల్ | రూ.520 | రూ.1005 |
2. | సికింద్రాబాద్-ఖమ్మం | రూ.750 | రూ.1460 |
3. | సికింద్రాబాద్-విజయవాడ | రూ.905 | రూ.1775 |
4. | సికింద్రాబాద్-రాజమండ్రి | రూ.1365 | రూ.2485 |
5. | సికింద్రాబాద్-విశాఖపట్నం | రూ.1665 | రూ.3120 |
రేపటి నుంచి పూర్తి స్థాయిలో..
ఈ ట్రైన్ ఈ రోజు ప్రారంభించినా.. రేపటి నుంచే ప్రయాణికులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. ఇందుకు సంబంధించిన రిజర్వేషన్ ను రైల్వే నిన్న ఉదయం ప్రారంభించింది. అయితే.. ప్రయాణించిన కొద్ది సేపట్లోనే టికెట్లు అన్నీ బుక్ అయిపోవడం విశేషం. సాయంత్రానికి వెయిటింగ్ లిస్ట్ కనిపించింది. టికెట్ బుక్ చేసుకోవడానికి చాలా మంది ప్రయత్నించడంతో కొద్ది సేపు సర్వర్ మొరాయించింది. చాలా తక్కువ సమయంలో ఎక్కువ దూరాన్ని ప్రయాణించగలగడంతో రానున్న రోజుల్లో ఈ ట్రైన్ కు మరింత ఆదరణ లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Vande Bharat Train