విశాఖపట్నం నౌకాశ్రయంలో 4095 కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టడంతో పాటు, మూడేళ్లలో నౌకాశ్రయ సామర్థ్యంను 141.64 మిలియన్ టన్నులకు వృద్ధి చేయనున్నట్లు రాజ్యసభ సభ్యుడు పరిమల్ నత్వానీ ప్రశ్నకు కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వశాఖ సమాధానం తెలిపింది. విశాఖపట్నం నౌకాశ్రయ విస్తరణ మరియు ఆధునీకరణ కోసం 4095 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టడంతో పాటుగా నౌకాశ్రయ సామర్థ్యంను ప్రస్తుతమున్న 126.89 మిలియన్ టన్నుల నుంచి 141.64 మిలియన్ టన్నులకు 2023 ఆర్థిక సంవత్సరం నాటికి వృద్ధి చేయనున్నారు. ఈ అంశంపై పార్లమెంట్ సభ్యుడు (రాజ్యసభ) పరిమల్ నత్వానీ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా సెప్టెంబర్ 14,2020వ తేదీన రాజ్యసభలో భారత ప్రభుత్వ షిప్పింగ్ శాఖా మంత్రి మన్సుఖ్ మాండవీయ వివరాలను అందించారు.
కేంద్ర మంత్రి వెల్లడించిన దాని ప్రకారం విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ (వీపీటీ) ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రణాళికలను రూపొందించింది. ఛానెల్స్ మరియు బెర్త్‌లను మరింత లోతుగా మార్చడం ద్వారా అంతర్గత వనరుల నుంచి సైతం నిధులను సమకూర్చుకోవడంతో పాటుగా ప్రైవేట్ రంగం నుంచి పెట్టుబడులను ఆహ్వానించడానికి ప్రయత్నాలను చేస్తుందని మంత్రి వెల్లడించారు. వీపీటీ ప్రస్తుత సామర్థ్యం 126.89 మిలియన్ టన్నులు. ప్రస్తుత సామర్థ్యం విస్తరణ ప్రాజెక్టులు పూర్తవడంతో వీపీటీ సామర్థ్యం 141.64 మిలియన్ టన్నులకు 2023 ఆర్థిక సంవత్సరానికి చేరుకోనుందని మంత్రి వెల్లడించారు.
అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నౌకాశ్రయంలో బెర్త్‌ల ఆధునీకరణ , సామర్ధ్య విస్తరణకు సంబంధించి భారతప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గురించిన వివరాలను వెల్లడించాల్సిందిగా ఎంపీ నత్వానీ కోరారు. నత్వాని ప్రశ్నకు అనుబంధంగా కేంద్ర మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం మొత్తం 12 ప్రాజెక్టులలో 3086 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనున్నామని తెలిపారు. వీటిలో అతిపెద్ద పెట్టుబడి అయినటువంటి 633.11 కోట్ల రూపాయల ప్రాజెక్టు ఇప్పటికే నిర్మాణంలో ఉందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న కంటెయినర్ టర్మినల్‌కు అదనంగా 9.50 ఎంఎంటీఏను జోడించడం ద్వారా విస్తరించే ప్రాజెక్ట్ అది. ఇతర భారీ ప్రాజెక్టులలో ఇనుప ఖనిజ నిర్వహణ కోసం ఔటర్ హార్బర్ ప్రాంతంలో ప్రస్తుత యాంత్రిక సదుపాయాన్ని ఆధునీకరించడంతో పాటుగా అదనంగా 16.20 ఎంఎంటీఏ సామర్థ్యం జోడించడం కూడా ఉంది. ఈ ప్రాజెక్టులలో మూడవ అతి పెద్ద పెట్టుబడిగా 444.10 కోట్ల రూపాయలను బొగ్గు నిర్వహణ సదుపాయాలను యాంత్రీకరించడం మరియు ఔటర్ హార్బర్‌లో జీసీబీ ఆధునీకరించడం ద్వారా 2,00,000 డీడబ్ల్యుటీ వెస్సల్స్‌కు విస్తరించడం ఉన్నాయి. మరో 9 ప్రాజెక్టులలో మొత్తంమ్మీద 1009 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనున్నారు. కనెక్టివిటీ మరియు లాజిస్టిక్స్‌కు సంబంధించిన ప్రాజెక్టులివి. ఇక్కడ అతిపెద్ద పెట్టుబడిగా 372కోట్ల రూపాయల Ms కాంకర్‌కు చెందిన మల్టీ మోడల్ లాజిస్టిక్స్ హబ్ రెండవ దశ అభివృద్ధి నిలుస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ysrcp