VIRAT KOHLI PROMOTED DIGIT INSURANCE MAY FLOAT ITS IPO SOON ALL YOU NEED TO KNOW DETAILS HERE GH VB
Digit Insurance: విరాట్ కోహ్లీ ప్రమోట్ చేస్తున్న డిజిట్ ఇన్సూరెన్స్ త్వరలోనే ఐపీఓకి.. ఆ వివరాలిలా..
విరాట్ కోహ్లి
టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) డిజిట్ ఇన్సూరెన్స్ (Digit Insurance) కంపెనీలో భారీ ఎత్తున ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు.
టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) డిజిట్ ఇన్సూరెన్స్ (Digit Insurance) కంపెనీలో భారీ ఎత్తున ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ బీమా కంపెనీ త్వరలోనే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ లేదా ఐపీఓ (IPO)ని ప్రారంభించాలని యోచిస్తున్నట్లు ఓ నివేదిక పేర్కొంది. కెనడియన్ బిలియనీర్ ప్రేమ్ వాట్సా (Prem Watsa)కి చెందిన ఫెయిర్‌ఫాక్స్ గ్రూప్ ఈ భారతీయ బీమా సంస్థను ప్రమోట్ చేస్తోంది. నివేదిక ప్రకారం, 2022 ప్రారంభం నుంచి మార్కెట్లు అస్థిరంగా ఉన్నప్పటికీ, డిజిట్ ఇన్సూరెన్స్ ఐపీఓ దాని ప్రారంభ వాటా విక్రయం ద్వారా 500 మిలియన్ డాలర్లను సేకరించడానికి ప్రణాళికలు రచిస్తోంది. కంపెనీ ఈ ఏడాది చివర్లో తన ఐపీఓ ముసాయిదా పత్రాల (Draft Papers)ను దాఖలు చేస్తుందని తెలుస్తోంది. డిజిట్ ఇన్సూరెన్స్ ఐపీఓ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
జనవరిలో లిస్ట్ అయ్యే అవకాశం
డిజిట్ ఇన్సూరెన్స్ ఐపీఓ కచ్చితమైన తేదీలు తెలియనప్పటికీ.. కంపెనీ తన డ్రాఫ్ట్ డాక్యుమెంట్లను ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీకి ఫైల్ చేసి, వచ్చే ఏడాది జనవరి నాటికి లిస్ట్ చేయాలని యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. డిజిట్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, కమేష్ గోయల్‌కు ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో చాలా అనుభవం ఉంది. అతను జర్మనీకి చెందిన అలయన్జ్తో కలిసి పని చేశారు. అలయన్జ్ భారతీయ జాయింట్ వెంచర్‌కు నాయకత్వం కూడా వహించారు.
నివేదిక ప్రకారం, డిజిట్ కంపెనీ మోర్గాన్ స్టాన్లీ, ఇండియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఐసీఐసీఐ సెక్యూరిటీలను ఈ డీల్‌కు బుక్రన్నర్లుగా నియమించింది. అయితే, ఐపీఓ గురించి మాట్లాడటానికి కంపెనీల ప్రతినిధులు ఎవరూ అంగీకరించలేదు. "30% వాటాతో అతిపెద్ద వాటాదారు అయిన ఫెయిర్‌ఫాక్స్‌తో పాటు కొత్త షేర్లను అందించడం ద్వారా డబ్బును సేకరించాలని డిజిట్ యోచిస్తోంది," అని నివేదిక పేర్కొంది. సెబీ నిబంధనల ప్రకారం, ఐపీఓకి రావాలంటే ఒక కంపెనీ స్టార్ట్ చేసి కనీసం ఐదేళ్లు పూర్తి కావాలి. అయితే డిజిట్ కంపెనీ ఐపీఓకి రాకముందే ఐదేళ్లను పూర్తి చేసుకుంటుంది. డిజిట్ ఐపీఓ జనవరిలో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.
గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం 62 శాతం పెరిగి దాదాపు 675 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ సంస్థ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో 11 శాతం పెరుగుదలను అధిగమించింది. డిజిట్ ఇన్సూరెన్స్ 2020/21లో 309 మిలియన్ డాలర్ల ఆదాయంపై 7.8 మిలియన్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. సులభతరమైన క్లెయిమ్ సెటిల్మెంట్ల వంటి మెరుగైన కస్టమర్ ఎక్స్పీరియన్స్ అందిస్తూ సాధారణ బీమా మార్కెట్లో డిజిట్ వ్యాపారం చేయాలని డిజిట్ చూస్తోంది. గత నెల నాటికి కంపెనీ విలువ దాదాపు 4 బిలియన్ డాలర్లకు ఎగబాకింది. ఈ ఇన్సూరెన్స్ కంపెనీ ఇప్పటివరకు ఫెయిర్‌ఫాక్స్‌తో పాటు సెక్వోయా క్యాపిటల్, A91 పార్ట్నర్స్, ఫేరింగ్ క్యాపిటల్ నుంచి 400 మిలియన్ డాలర్లకు పైగా సేకరించింది.
కొన్ని నెలలుగా భారతీయ స్టాక్ మార్కెట్లు చాలా అస్థిరంగా (Volatile) ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే డిజిట్ ఇన్సూరెన్స్ ఐపీఓ ప్లాన్ చేస్తుండటం పెద్ద సాహసమే అని చెప్పొచ్చు. ఈ నెల ప్రారంభంలో, భారతదేశపు అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ ఐపీఓ టార్గెట్ వ్యాల్యూ సేకరించలేకపోయిన విషయం తెలిసిందే . మరి డిజిట్ ఇన్సూరెన్స్ లక్ష్యంగా పెట్టుకున్న డబ్బులను సేకరించగలదా అనేది తెలియాల్సి ఉంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.