VIRAL VIDEO INDIAN RAILWAYS SHARED VIDEO OF PASSENGER WHO FELL ON THE PLATFORM WHILE BOARDING A MOVING TRAIN NS
Viral Video: అదృష్టం అంటే ఇతనిదే.. ఒక్క సెకన్ లేట్ అయినా ముక్కలయ్యేవాడు.. వైరల్ వీడియో
ఫొటో: ట్విట్టర్
కదులుతున్న ట్రైన్ ఎక్కడానికి ప్రయత్నించి కింద పడబోయిన ఓ ప్రయాణికుడికి సంబంధించిన ఓ వీడియోను ఇండియన్ రైల్వే (Indian Railways) తాజాగా షేర్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
విశ్వాసమో.. అతి విశ్వాసమో తెలియదు కానీ అనేక మంది కదిలే బస్సులు, ట్రైన్లను ఎక్కడం మరియు దిగడం చేస్తూ ఉంటారు. ఇలా చేస్తూ అనేక మంది ప్రాణాల మీదకు తెచ్చుకున్న వార్తలు ఎన్నో నిత్యం వినిపిస్తూ ఉన్నా కూడా.. ఆ సహసాలు మాత్రం మానరు. తాజాగా ఇలాంటి మరో ఘటన ముంబై (Mumbai) మహానగరంలో మరొకటి చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను రైల్వే మంత్రిత్వ శాఖ (Railway Ministry) తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసింది. ఓ ప్రయాణికుడు వేగంగా వెళ్తున్న ఓ ట్రైన్ ను ఎక్కేందుకు ప్రయత్నించాడు. అయితే, ఈ సమయంలో అతను పట్టు కోల్పోయి.. కింద పడ్డాడు. దీంతో కొన్ని సెకండ్ల పాటు ట్రైన్ అతడిని తాకుతూ వెళ్లింది.
Swift action by RPF constable Chandan Thakur at Dadar Station, Mumbai saved a precious life of a passenger who fell on the platform while boarding a moving train.
— Ministry of Railways (@RailMinIndia) May 19, 2022
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు తమ కామెంట్ల ద్వారా ఆర్పీఎఫ్ సిబ్బందిని అభినందిస్తున్నారు. మరి కొందరు ప్రయాణికులు మాత్రం రైలు ప్రారంభం కాగానే మూసుకుపోయేలా అటోమేటిక్ డోర్లను ఏర్పాటు చేస్తే ఇలాంటి ప్రమాదాలు తగ్గుతాయని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.