Vijay Mallya Arrest: త్వరలో స్వదేశానికి విజయ్ మాల్యా... బ్రిటన్ కోర్టులో చుక్కెదురు...

ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యా భారత్ రప్పించే ప్రయత్నాలు కొలిక్కి వచ్చాయి. మాల్యా భారతీయ న్యాయస్థానాలకు జవాబుదారీగా ఉండేందుకు సిద్ధంగా ఉండాలని బ్రిటన్ హై కోర్టు సంచలన వ్యాఖ్య చేసింది.

news18-telugu
Updated: April 8, 2019, 5:01 PM IST
Vijay Mallya Arrest: త్వరలో స్వదేశానికి విజయ్ మాల్యా... బ్రిటన్ కోర్టులో చుక్కెదురు...
విజయ్ మాల్యా (ఫైల్ ఫోటో )
news18-telugu
Updated: April 8, 2019, 5:01 PM IST
ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు మార్గం సుగమం అవుతోంది. తనను భారత్‌కు అప్పగించే చర్యలను అడ్డుకోవాలని దాఖలు చేసిన పిటీషన్‌ను బ్రిటన్ హైకోర్టు తోసిపుచ్చింది. అంతే కాదు త్వరలోనే కేసుకు సంబంధించిన హియరింగ్‌ను కూడా వెలువడనుంది. దీంతో మాల్యా భారత్‌కు రప్పించే ప్రయత్నాలు మరో అడుగు దూరంలో నిలిచాయి. వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ హై కోర్టును ఈ నిర్ణయం తీసుకుంది. అంతే కాదు చీఫ్ మేజిస్ట్రేట్ ఎమ్మా అర్బుత్‌నాట్ వ్యాఖ్యానిస్తూ...విజయ్ మాల్యా భారత న్యాయస్థానాలకు జవాబుదారీగా ఉండాలని సూచించింది. అతను చేసిన ఆర్థిక అవకతవకలకు భారతీయ న్యాయస్థానాల పరిధిలోనే విచారణ కొనసాగాలని సూచించింది.

ఇదిలా ఉంటే మొత్తం 9000 కోట్లకు పైగా బ్యాంకులకు బకాయీలు పడటంతో కింగ్ పిషర్ అధినేత విజయ్ మాల్యా స్వదేశం విడిచి, లండన్ లో తలదాచుకుంటున్నాడు. ఇటీవలే వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ అరెస్టు అనంతరం, విజయ్ మాల్యాపైనే అందరి చూపు నెలకొని ఉంది.



First published: April 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...