VIJAY MALLYA MAY FINALLY BE DEPORTED TO INDIA DUE TO PM MODI PRESSURE MK
మోదీ దెబ్బకు విజయ్ మాల్యాకు చుక్కలే...త్వరలో అరెస్ట్ చేసి భారత్ కు తెచ్చే చాన్స్...
విజయ్ మాల్యా (ఫైల్)
Vijay Mallya | విజయ్ మాల్యాను అప్పగించాలంటే మరికొన్ని లీగల్ సమస్యలున్నాయని బ్రిటిష్ హైకమిషన్ తెలిపింది. బ్రిటన్ చట్టాల ప్రకారం.. పలు సమస్యలు పరిష్కారమయ్యేవరకు మాల్యా అప్పగింత ప్రక్రియ సాధ్యం కాదని తెలిపారు.
Vijay Mallya: మోదీ ప్రభుత్వం దెబ్బకు అవినీతి పరులకు చెమటలు పడుతున్నాయి. ముఖ్యంగా విదేశాలకు పారిపోయి తలదాల్చుకుంటున్న అవినీతిపరులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ప్రధానంగా మద్యం వ్యాపారి విజయ్ మాల్యా విషయంలో కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి అతడిని ఎలాగైనా స్వదేశానికి రప్పించేలా వల పన్నుతోంది. అందులో భాగంగానే. విజయ్ మాల్యా విదేశీ ఆస్తులను ఈడీ జప్తు చేసి అతడికి పెద్ద షాక్ ఇచ్చింది. విజయ్ మాల్యాకు చెందిన ఫ్రాన్స్‌లోని రూ.14 కోట్ల విలువైన ఆస్తులను మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద సీజ్ చేసినట్లు ఇప్పటికే ఈడీ ఇక సమాచారంలో వెల్లడించింది. ఈడీ విజ్ఞప్తితో ఫ్రాన్స్ అధికారులు ఆయన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ప్రధానంగా ఫ్రాన్స్‌లోని 32 ఎవెన్యూ ఎఫ్వోసీహెచ్ వద్దనున్న విజయ్ మాల్యాకు చెందిన ఆస్తిని జప్తు చేసినట్లు ఓ ప్రకటనలో ఈడీ అధికారులు తెలిపారు. దీని విలువ సుమారు రూ.14 కోట్లుగా పేర్కొన్నారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్ బ్యాంక్ ఖాతా నుంచి విదేశాలకు పెద్ద ఎత్తున నగదు మళ్లింపు జరిగినట్లు దర్యాప్తులో తేలిందని ఈడీ వెల్లడించింది. ఇదిలా ఉంటే ఇప్పటికే మాల్యాను దివాలాదారుడిగా ప్రకటించాలంటూ భారత బ్యాంకుల కన్సార్షియం దాఖలు చేసిన పిటిషన్‌ను లండన్ కోర్టు కొట్టేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని భారత ప్రభుత్వ రంగ బ్యాంకుల కన్సార్టియం పిటిషన్‌పై విచారణను కోర్టు వాయిదా వేసింది. విజయ్ మాల్యా 9 వేల కోట్ల రుణాలు ఎగవేశాడని... బకాయిలను వసూలు నిమిత్తం మాల్యాను దివాలా కోరుగా ప్రకటించాలని ఎస్బీఐ సారధ్యంలోని భారత బ్యాంకుల కన్సార్షియం లండన్ కోర్టును కోరింది.
మాల్యా భారత్ రావాలంటే...
విజయ్ మాల్యాను అప్పగించాలంటే మరికొన్ని లీగల్ సమస్యలున్నాయని బ్రిటిష్ హైకమిషన్ తెలిపింది. బ్రిటన్ చట్టాల ప్రకారం.. పలు సమస్యలు పరిష్కారమయ్యేవరకు మాల్యా అప్పగింత ప్రక్రియ సాధ్యం కాదని తెలిపారు. అయితే త్వరలోనే ఆయన పిటిషన్ పై బ్రిటన్ న్యాయస్థానం నిర్ణయం తీసుకోనంది. సాధ్యమైనంత త్వరగా వీటి పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్టు పేర్కొన్నారు.బ్రిటన్ చట్టాల మేరకు అక్కడి హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన 28 రోజుల్లోగా ఒక వ్యక్తిని మరో దేశానికి అప్పగించాల్సి ఉంటుంది.
కానీ ఆవ్యక్తి శరణార్థిగా ఆశ్రయం కోరితే మాత్రం ఆ దేశంలోనే ఉంటానని అప్పీలు చేస్తే.. ఆ క్లెయిమ్ పరిష్కారమయ్యేవరకు అప్పగింత సాధ్యం కాదు. అయితే మాల్యా బ్రిటన్ శరణార్థిగా పిటిషన్ పెట్టుకున్నారా లేదా అనేది ఇంకా తేలాల్సి ఉంది. అయితే మాల్యా తరఫు లాయర్ ఆనంద్ దూబే మాత్రం ఈ విషయంపై నోరు మెదపట్లేదు. ఇండియాలోని బ్యాంకులకు తొమ్మిది వేల కోట్ల రూపాయల మేర కుచ్ఛుటోపీ పెట్టి లండన్ వెళ్ళిపోయిన మాల్యాకు తిరిగి రుణం చెల్లించాలన్న ఉద్దేశం లేదని సీబీఐ వర్గాలు అంటున్నాయి. కానీ మాల్యా మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. తాను బకాయిలు చెల్లించడానికి రెడీగా ఉన్నానని ఆయన గతంలో చెప్పడం విశేషం.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.