కాఫీ డే సిద్ధార్థ పరిస్థితే నాది కూడా..విజయ్ మాల్యా వ్యాఖ్యలు

ప్రభుత్వ ఏజెన్సీలు, బ్యాంకులు ఎవరినైనా నిరాశలోకి నెట్టగలవంటూ కాఫీ డే యజమాని సిద్ధార్థ లేఖను ప్రస్తావిస్తూ విజయ్ మాల్యా ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.

news18-telugu
Updated: July 31, 2019, 10:45 AM IST
కాఫీ డే సిద్ధార్థ పరిస్థితే నాది కూడా..విజయ్ మాల్యా వ్యాఖ్యలు
విజయ్ మాల్యా(ఫైల్ ఫోటో)
  • Share this:
కేఫ్ కాఫీ డే యజమాని వీసీ సిద్ధార్థతో లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా తనను పోల్చుకున్నారు. ఆర్థిక ఇక్కట్లలో కూరుకుపోయిన తనను ఐటీ శాఖ వేధిస్తోందని వీసీ సిద్ధార్థ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఓ లేఖ రాయడం తెలిసిందే. ఈ లేఖ తనను తీవ్ర నిరాశకు గురిచేసినట్లు విజయ్ మాల్యా పేర్కొన్నారు. ప్రభుత్వ ఏజెన్సీలు, బ్యాంకులు ఎవరినైనా నిరాశలోకి నెట్టగలవంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. బకాయిలన్నీ తిరిగి చెల్లిస్తానని చెబుతున్నప్పటికీ..తన విషయంలో ప్రభుత్వ సంస్థలు వ్యవహరిస్తున్న తీరు ఎలా ఉందో చూడండి అంటూ విస్మయం వ్యక్తంచేశారు.


అదే పాశ్చాత్య దేశాల్లో అయితే.. అప్పులను తిరిగి చెల్లించేందుకు సహాయం చేయన్నారు. కానీ తన విషయంలో మాత్రం అప్పులు తిరిగి చెల్లించడానికి ఉన్న అన్ని ప్రత్యామ్నాయాలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వ బ్యాంకులకు రూ.9000 కోట్లు ఎగ్గొట్టి దేశం విడిచి లండన్‌కి పారిపోవడం తెలిసిందే.First published: July 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు