news18-telugu
Updated: February 4, 2019, 5:59 PM IST
ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 జాబితాలో విజయ్ దేవరకొండ, స్మృతి మంధాన, హిమాదాస్
30 ఏళ్ల లోపే తమతమ రంగాల్లో అద్భుత ప్రతిభ కనబర్చినవారి జాబితాను విడుదల చేసింది ఫోర్బ్స్ ఇండియా.
30 అండర్ 30 పేరుతో విడుదల చేసిన జాబితాలో టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, వుమెన్ క్రికెట్ సెన్సేషన్ స్మృతి మంధాన, అథ్లెట్ హిమాదాస్‌లకు చోటు దక్కింది. తమ రంగాల్లో అసాధారణ ప్రతిభ చూపించడమే కాదు, అద్భుతంగా రాణిస్తూ, కెరీర్లో దూసుకెళ్తున్న వారి జాబితా ఇది.
'ఫోర్బ్స్ ఇండియా థర్టీ అండర్ థర్టీ' పేరుతో ఆరో జాబితా విడుదలైంది.

image: Forbes India
విజయ్ దేవరకొండ, స్మృతి మంధాన, హిమాదాస్తో పాటు యూట్యూబ్ పర్సనాలిటీ ప్రజక్త కోలీ, సింగర్ మేఘన మిశ్రా, ఆయుష్ అగర్వాల్ లాంటివారి పేర్లున్నాయి. ఎంటర్టైన్మెంట్, హాస్పిటాలిటీ, టెక్నాలజీ రంగాల్లోని ఆంట్రప్రెన్యూర్స్ పేర్లు కూడా ఉన్నాయి.

వయస్సు 25 అయినా 52 అయినా విజయానికి అసమానతలు ఉండవు. కాకపోతే ముందుగా విజయాన్ని అందుకోవడం కలిసొస్తుంది. అందుకే మా 30 అండర్ 30 జాబితాకు ప్రాముఖ్యత ఉంది. టీమ్ ఫోర్బ్స్ ఇండియాస్ 30 అండర్ 30 జాబితా ద్వారా తక్కువ వయస్సులోనే విజయాలను అందుకున్నవారి ప్రతిభ, ధైర్యాన్ని గుర్తించడమే మా లక్ష్యం.
— బ్రియాన్ కార్వాల్హో, ఎడిటర్, ఫోర్బ్స్ ఇండియా
విజయాలు, కెరీర్లో దూసుకెళ్లే తత్వం, తమ వ్యాపారాన్ని నిర్వహించే సత్తా, దీర్ఘకాలం ప్రతిభను కొనసాగించే సామర్థ్యం... ఇలా మొత్తం 16 కేటగిరీల్లో పరిశీలించి తుది జాబితాను రూపొందించింది ఫోర్బ్స్ ఇండియా. వారి పూర్తి
జాబితాను ఇక్కడ క్లిక్ చేసి చూడొచ్చు.
ఇవి కూడా చదవండి:
#Jobs: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2019 నోటిఫికేషన్ విడుదల... వివరాలివే
Alert: ఫోటో ఎడిటింగ్ యాప్స్‌లో వైరస్... ఈ యాప్స్ మీ దగ్గరున్నాయా?
Published by:
Santhosh Kumar S
First published:
February 4, 2019, 5:35 PM IST