భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు శంషాబాద్‌లోని జీఎంఆర్ వరలక్ష్మి సెంటర్ ఫర్ ఎంపర్మెంట్ అండ్ లైవ్లీహుడ్ను సందర్శించారు. జీఎంఆర్ గ్రూపు ఛైర్మన్ జీ మల్లికార్జునరావు, జీఎంఆర్ గ్రూపు ఛైర్మన్, ఇతర సీనియర్ అధికారులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఈ కేంద్రం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలలకు చెందిన డ్రాపౌట్ యువతకు వొకేషనల్ ట్రైనింగ్‌ను అందించి, వారికి ఉపాధి అవకాశాల కల్పనలో సహాయపడుతోంది. , వెంకయ్యనాయుడు ఎలెక్ట్రీషియన్, హోటల్ మేనెజ్మెంట్, టూవీలర్ టెక్నీషియన్, వెల్డింగ్ టెక్నీషియన్, ఫాల్స్ సీలింగ్, ఏసీ టెక్నీషియన్ శిక్షణ పొందుతున్న పలువురు విద్యార్థులతో మాట్లాడి శిక్షణ వివరాలు తెలుసుకున్నారు. ఎలెక్ట్రికల్ కోర్సును అభ్యసిస్తున్న ట్రెయినీలకు ఆయన కిట్లను అందజేసారు. జనపనార బ్యాగులు తయారు చేయడంలో శిక్షణ పొందుతున్న మహిళలతోనూ ఆయన మాట్లాడారు.
అనంతరం వెంకయ్యనాయుడు శంషాబాద్‌లోని ఎయిర్ పోర్టు క్యాంపస్‌లో ఉన్న జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్, చిన్మయ మిషన్ల సంయుక్త ఆధ్వర్యంలో నడుస్తున్న జీఎంఆర్ చిన్మయ విద్యాలయను కూడా సందర్శించారు. ఎయిర్ పోర్టుకు సమీపంలోని గ్రామాలకు చెందిన పిల్లలకు ఈ విద్యాసంస్థ అతి తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యను అందిస్తోంది. ‘గిఫ్టెడ్ చిల్డ్రన్ స్కీమ్’ అన్న ప్రత్యేక పథకం కింద జీఎంఆర్‌వీఎఫ్ ఈ విద్యాసంస్థలో 100 మంది విద్యార్థుల చదువుకు అయ్యే ఖర్చును కూడా భరిస్తోంది. విద్యాసంస్థ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులతో సంభాషించిన ఉపరాష్ట్రపతి, విద్యార్థులకు అందిస్తున్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు.
జీఎంఆర్-వరలక్ష్మీ ఫౌండేషన్ ఆవరణలో మొక్కను నాటిన అనంతరం అక్కడి నైపుణ్యాభివృద్ధి శిక్షణార్థులతో ఉపరాష్ట్రపతి కాసేపు ముచ్చటించారు. జీఎంఆర్-చిన్మయ విద్యాలయ ఆవరణలో ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడారు. pic.twitter.com/kME9epys4c
— Vice President of India (@VPSecretariat) August 1, 2021
హైదరాబాద్‌లోని జీఎంఆర్-చిన్మయ విద్యాలయ, జీఎంఆర్-వరలక్ష్మి ఫౌండేషన్లను ఆదివారం ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు సందర్శించారు. మహిళాసాధికారత, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలపై నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను పరిశీలించి, జీఎంఆర్ సంస్థ చేస్తున్న సామాజిక సేవను అభినందించారు. pic.twitter.com/t7pwgzCblA
— Vice President of India (@VPSecretariat) August 1, 2021
The Vice President planting a sapling at the campus of GMR Varalakshmi Centre for Empowerment and Livelihoods in Shamshabad today. pic.twitter.com/7I6Yf7zkuw
— Vice President of India (@VPSecretariat) August 1, 2021
జీఎంఆర్ గ్రూపు తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగమైన జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ద్వారా దేశంలోని దాదాపు 20కి పైగా ప్రదేశాలలో స్థానిక ప్రజల అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలు చేపడుతోంది. గత 15 ఏళ్లకు పైగా నైపుణ్యాల శిక్షణలో ఉన్న జీఎంఆర్‌వీఎఫ్ ప్రస్తుతం న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సహా దేశంలోని 15 కేంద్రాలను నిర్వహిస్తోంది.
ఇది చూడండి...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Vice President of India