VI HAS OFFICIALLY ANNOUNCED BUSINESS PLUS POSTPAID PLANS FROM RS 299 FOR BUSINESSES AND WORKING PROFESSIONALS NS GH
Vi Business Plus: బిజినెస్ ప్లస్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను ప్రకటించిన Vi.. ప్రయోజనాలివే..
ప్రతీకాత్మక చిత్రం
రూ.299 నుంచి ప్రారంభమయ్యే ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు కనెక్ట్, కమ్యూనికేట్, సపోర్ట్ వంటి సేవలను సులభతరం చేస్తున్నట్లు Vi పేర్కొంది. Vi బిజినెస్ ప్లాన్స్ మొబైల్ సెక్యూరిటీ, లొకేషన్ ట్రాకింగ్, వాయిస్, డేటా సేవలతో పాటు డేటా పూలింగ్, ఎంటర్టైన్మెంట్ ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా వినియోగదారుల సంఖ్యను పెంచుకునే ప్రయత్నంలో బంపర్ ఆఫర్లను ప్రకటిస్తోంది. ఒకవైపు సాధారణ కస్టమర్లకు ప్రీపెయిడ్ ఆఫర్లను ప్రకటిస్తూనే.. మరోవైపు పోస్ట్‌పెయిడ్ ఆఫర్లపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా గురువారం వి బిజినెస్ తమ వ్యాపార అభివృద్ధి కోసం కీలక సమావేశం నిర్వహిచింది. ఈ సమావేశంలో వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ప్రత్యేకంగా విస్తృత శ్రేణి పోస్ట్ పెయిడ్ ప్లాన్లను ప్రకటించింది. రూ.299 నుంచి ప్రారంభమయ్యే ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు కనెక్ట్, కమ్యూనికేట్, సపోర్ట్ వంటి సేవలను సులభతరం చేస్తున్నట్లు Vi పేర్కొంది. Vi బిజినెస్ ప్లాన్స్ మొబైల్ సెక్యూరిటీ, లొకేషన్ ట్రాకింగ్, వాయిస్, డేటా సేవలతో పాటు డేటా పూలింగ్, ఎంటర్టైన్మెంట్ ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అంతేకాక, పోగొట్టుకున్న మొబైల్స్‌లో డేటా సెక్యూరిటీ కల్పించడం, వైరస్, స్పైవేర్, ప్రమాదకరమైన వెబ్సైట్లు, నకిలీ వెబ్సైట్లు, హానికరమైన యాప్స్‌ను కట్టడి చేయడం వంటి అదనపు ప్రయోజనాలను కూడా పొందవచ్చని పేర్కొంది.
చిన్న వ్యాపారులు, వారి ఉద్యోగులు ఎక్కడ నుండి పనిచేస్తున్నా సరే వారితో సురక్షితంగా కనెక్ట్ అవ్వడానికి అవకాశాన్ని కల్పించాలనే లక్ష్యంతో వొడాఫోన్ ఐడియా ఈ బిజినెస్ ప్లస్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్ ముఖ్యంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, స్టార్టప్‌లకు అనేక ప్రయోజనాలను కల్పించనుంది. సౌకర్యవంతమైన, సురక్షితమైన నెట్వర్క్ కనెక్టివిటీ కోసం వెతుకుతున్న బిజినెస్ పర్సన్స్‌కు ఈ Vi పెస్ట్పెయిడ్ ప్లాన్ సరిగ్గా సరిపోతుంది.
వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ప్రత్యేకంగా..
తాజా ప్లాన్‌పై వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ చీఫ్ ఎంటర్ప్రైజ్ బిజినెస్ ఆఫీసర్ అభిజిత్ కిషోర్ మాట్లాడుతూ “ఎంటర్ప్రైజెస్, ఎస్ఎంఈలు, స్టార్టప్‌ల డిజిటల్ అవసరాలను తీర్చడంపై వొడాఫోన్ ఐడియా బిజినెస్ దృష్టి పెట్టింది. సంస్థల అభివృద్ధికి సౌకర్యవంతమైన, సురక్షితమైన, అనుకూలమైన మొబిలిటీ సొల్యూషన్స్ అందించడం చాలా అవసరం. అందువల్లే, మేం బిజినెస్‌తో పాటు డేటా సెక్యూరిటీ ప్లాన్‌ను ప్రవేశపెడుతున్నాం. ఇది వ్యాపారులకు వారి సమస్యలను పరిష్కరించుకోవడంలో ఉపయోగపడుతుంది.” అని అన్నారు.
సాధారణ వినియోగదారుల కోసం Vi కేవలం రూ. 30 నుంచి ప్రారంభమయ్యే కొన్ని పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో చేరిన వారు అమెరికా, కెనడాకు నిమిషానికి 50 పైసలు, చైనా, హాంకాంగ్‌లకు నిమిషానికి రూ.2లకు, బంగ్లాదేశ్, బ్రిటన్లకు నిమిషానికి రూ. 3లతో అంతర్జాతీయ కాలింగ్ ప్రయోజనాలను పొందవచ్చు. ఆస్ట్రేలియా, భూటాన్, జర్మనీ, కువైట్, మలేషియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, సింగపూర్, థాయ్‌లాండ్‌లకు నిమిషానికి 5 ఛార్జ్‌తో కాల్స్ చేసుకోవచ్చు.
వీటితో పాటు వొడాఫోన్ రూ .100, రూ. 200 లతో మరో రెండు పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను కూడా అందిస్తుంది. అయితే, ఈ ప్లాన్ల కింద డేటా మాత్రమే లభిస్తుంది. ఇవి వరుసగా 20 జీబీ, 50 జీబీ డేటాను 30 రోజుల పాటు అందిస్తాయి. వొడాఫోన్ రూ .399, రూ .499, రూ .699, రూ .1099 విలువ చేసే ఇతర పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను కూడా కస్టమర్లకు అందిస్తోంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.