కేఫ్ కాఫీ డే సీఎండీ సిద్ధార్థ్ ఆత్మహత్య...మృతదేహం లభ్యం

G Siddhartha Live Updates | కేఫ్ కాఫీ డే సీఎండీ జీ సిద్ధార్థ అదృశ్యం విషాదాంతమయ్యింది. ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. బెంగుళూరు శివారులో నేత్రావతి నదిలో ఆయన మృతదేహాన్ని వెలికితీశారు.

news18-telugu
Updated: July 31, 2019, 10:07 AM IST
కేఫ్ కాఫీ డే సీఎండీ సిద్ధార్థ్ ఆత్మహత్య...మృతదేహం లభ్యం
వీజీ సిద్దార్థ ఫైల్ ఫోటో
  • Share this:
కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు,  కేఫ్‌ కాఫీడే సీఎండీ వి.జి సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్నారు.  బెంగళూరు శివారులోని నేత్రావతి నదిలో ఆయన మృతదేహం లభ్యమయ్యింది. రెండు రోజుల క్రితం ఆయన అదృశ్యమయ్యారు.  కంపెనీల నష్టాల నేపథ్యంలో తీవ్ర ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నట్లు ఆయన ఓ లేఖలో వెల్లడించారు. సోమవారం సాయంత్రం నేత్రావతి నదిలో' ఎవరో దూకడాన్ని చూసినట్లు ఓ ప్రత్యక్ష సాక్షి వెల్లడించడంతో మంగళవారం ఉదయం నుంచి నేత్రావతి నదిలో ముమ్మర గాలింపు చేపట్టారు.

వీజి సిద్ధార్థ చివరగా ఇక్కడే కనిపించకుండా పోవడంతో ఆయనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని మంగళవారం ఉదయం నుంచి యుద్ధ ప్రాతిపదికన గాలింపు చేపట్టారు.  36 గంటల గాలింపు తర్వాత ఈరోజు ఉదయం సిద్ధార్థ మృతదేహం నదిలో లభ్యమైంది. స్థానిక జాలర్లు సిద్ధార్థ మృతదేహాన్ని గుర్తించి వెలుపలికి తీసుకొచ్చారు.

కాఫీ కింగ్‌గా గుర్తింపు సాధించిన వీజీ సిద్ధార్థ మరణంతో కర్ణాటకలో విషాదఛాయలు అలుముకున్నాయి.  దేశ వ్యాప్తంగా ఉన్న కాఫీ డే సిబ్బంది శోఖసంద్రంలో మునిగిపోయారు.
First published: July 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు