Coffee Day Siddhartha: కాఫీ డే సిద్దార్థ మిస్సింగ్... కుప్పకూలిన కంపెనీ షేర్ ధర

Café Coffee Day Founder VG Siddhartha Missing | మంగళవారం ఉదయం 9.19 గంటలకు కాఫీడే షేర్ ధర ఒక్కసారిగా 20% పడిపోయింది. లోయర్ సర్క్యుట్‌ను తాకి రూ.153.40 దగ్గర కొనసాగుతోంది.

news18-telugu
Updated: July 30, 2019, 11:01 AM IST
Coffee Day Siddhartha: కాఫీ డే సిద్దార్థ మిస్సింగ్... కుప్పకూలిన కంపెనీ షేర్ ధర
Coffee Day Siddhartha: కాఫీ డే సిద్దార్థ మిస్సింగ్... కుప్పకూలిన కంపెనీ షేర్ ధర
news18-telugu
Updated: July 30, 2019, 11:01 AM IST
కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ అదృశ్యం వ్యవహారంతో కాఫీడే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ షేర్లు 20 శాతం పడిపోయాయి. సోమవారం సాయంత్రం వీజీ సిద్దార్థ అదృశ్యమయ్యారని, ఆత్మహత్య చేసుకొని ఉంటారన్న వార్తలు ఉదయం కలకలం రేపడంతో ఇన్వెస్టర్లు కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ షేర్లను అమ్మేస్తున్నారు. దీంతో షేర్ ధర ఒక్కసారిగా లోయర్ సర్క్యుట్‌ను తాకింది. సోమవారం సాయంత్రం రూ.191.75 దగ్గర కాఫీడే షేర్ ధర ముగిసింది. మంగళవారం ఉదయం 9.19 గంటలకు కాఫీడే షేర్ ధర ఒక్కసారిగా 20% పడిపోయింది. లోయర్ సర్క్యుట్‌ను తాకి రూ.153.40 దగ్గర కొనసాగుతోంది. గత ఏడాదిలో కాఫీడే షేర్ ధర 27% తగ్గింది. 2018 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం 2,016 కోట్లకు పైగా ఉండటం విశేషం.

ఏసియాలోనే అతిపెద్ద కాఫీ ఎస్టేట్ అయిన కేఫ్ కాఫీ డే ఫౌండర్ సిద్దార్థ కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం క్రిష్ణ అల్లుడు. ఇటీవల అప్పులు తీర్చేందుకు మైండ్‌ట్రీలోని తన 20.41% వాటాను ఎల్ అండ్ టీకి రూ.3,269 కోట్లకు అమ్మి వార్తల్లోకి వచ్చారు. ఈ డీల్‌తో ఆయనకు రూ.2,858 కోట్ల లాభం వచ్చిందన్న వార్తలొచ్చాయి. కానీ భారీ వాటా సొంతం చేసుకోవడంతో మైండ్‌ట్రీపై ఎల్ అండ్ టీకి కంట్రోల్ దక్కింది. 58 ఏళ్ల ఆంట్రప్రెన్యూర్‌గా కేఫ్ కాఫీ డేను ప్రమోట్ చేస్తున్నారు సిద్దార్థ. దేశవ్యాప్తంగా ఆయన కంపెనీలో 30,000 మందికి పైగా పనిచేస్తున్నారు. సోమవారం సాయంత్రం బెంగళూరుకు 375 కిలోమీటర్ల దూరంలో నేత్రావతి నది దగ్గర బ్రిడ్జి దాటే సమయంలో కారు నుంచి దిగిన సిద్దార్థ గంట సేపైనా తిరిగి రాకపోవడంతో ఆందోళన మొదలైంది. కంగారుపడ్డ డ్రైవర్ సమీప ప్రాంతాల్లో గాలించినా ఎక్కడా సిద్దార్థ ఆచూకీ దొరకలేదు. దీంతో కుటుంబ సభ్యుల్ని అప్రమత్తం చేశారు. వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీజీ సిద్దార్థ ఆచూకీ కోసం దక్షిణ కన్నడ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.

Kia Seltos: మార్కెట్‌లోకి వచ్చేస్తున్న కియా సెల్టోస్... కారు ఎలా ఉందో చూడండి




ఇవి కూడా చదవండి:

SBI: షాక్ ఇచ్చిన ఎస్‌బీఐ... ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్ల తగ్గింపు... కొత్త రేట్లు ఇవే

Smart Consumer: మీరు నకిలీ వస్తువులు కొంటున్నారా? ఈ యాప్‌తో తెలుసుకోండి
Loading...
Credit Card: మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉందా? ఈ తప్పులతో తిప్పలే
First published: July 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...