Home /News /business /

VETERAN INVESTOR RAKESH JHUNJHUNWALA DIES AT 62 HERE DETAILS NS

Rakesh Jhunjhunwala: ప్రముఖ ఇన్వెస్టర్ రాకేశ్ జున్‌జున్‌వాలా కన్నుమూత..

రాకేష్ జున్‌జున్‌వాలా

రాకేష్ జున్‌జున్‌వాలా

ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా (Rakesh Jhunjhunwala) కొద్దిసేపటి క్రితం మృతి చెందారు. రాకేశ్ ను ‘బిగ్ బుల్’, ‘వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తు ఉంటారు. ఆయన వ్యాపార చిట్కాల ద్వారా ఈ పేర్లు అందుకున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Delhi, India
    ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా (Rakesh Jhunjhunwala) మృతి చెందారు. ఆయన వయస్సు ప్రస్తుతం 62 ఏళ్లు. ఈ రోజు ఉదయం 6.45 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆరోగ్య సమస్యలతో కొద్దిరోజుల క్రితం ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. అనంతరం రెండు వారాల తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆదివారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో ఉదయం 6.45 గంటలకు ముంబైలోని (Mumbai) క్యాండీ బ్రీచ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆయన చనిపోయారని వైద్యులు నిర్ధారించారు. ట్రేడర్‌గా చార్టెడ్‌ అకౌంటెంట్‌గా ఆయన ఎంతో పేరుగడించారు. భారత్‌లోని అత్యంత సంపన్నుల్లో రాకేశ్ ఒకరిగా నిలిచారు.

    రాకేశ్ ను ‘బిగ్ బుల్’, ‘వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తు ఉంటారు. ఆయన వ్యాపార చిట్కాల ద్వారా ఈ పేర్లు అందుకున్నారు. రాకేశ్ మృతి పట్ల ప్రధాని మోదీ (PM Modi) సంతాపం వ్యక్తం చేశారు. ఆర్థిక ప్రపంచానికి ఆయన చెరగని సహకారాన్ని అందించారంటూ కొనియాడారు. దేశ పురోగతికి కృషి చేశాడన్నారు. ఆయన మృతి బాధాకరమన్నారు. రాకేశ్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు మోదీ.
    Stock Market: ఈ కంపెనీ షేర్ విలువ రూ.17 నుంచి 2000కు పెరిగింది.. రూ.3వేలు కూడా దాటొచ్చు..!



    1960 జులై 5న బాంబేలోని రాజస్థానీ కుటుంబంలో రాకేశ్ జన్మించారు. ఆయన తండ్రి ఇన్‌కమ్ ట్యాక్స్ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. అయితే.. ఆయన కాలేజీ రోజుల నుంచే రాకేశ్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించడం విశేషం. 1985లో ఆయన 5 వేల రూపాయలు పెట్టుబడి పెట్టారు. 2018 సెప్టెంబర్ నాటికి అది కాస్తా రూ.11 వేల కోట్ల మూలధనంగా మారింది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Mumbai, Pm modi, Rakesh Jhunjhunwala

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు