Sensex Crash : భారత స్టాక్ మార్కెట్లలో ఇదివరకూ ఎప్పుడూలేని భారీ పతనాన్ని ఇన్వెస్టర్లు ఇప్పుడు చూస్తున్నారు. సెన్సెక్స్ ఏకంగా 2000 పాయింట్లకు పైగా పతనమై... సూచీ 35 వేల దగ్గర కదలాడుతుంటే... నిఫ్టీ కూడా 600 పాయింట్లకు పైగా నష్టపోయి... 10వేల దగ్గర కదలాడుతోంది. ఫలితంగా ఇవాళ ఒక్క రోజే... దాదాపు రూ.10 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైందన్నది కొంతమంది స్టాక్ మార్కెట్ల విశ్లేషకుల మాట. ఇందుకు కారణాలేంటన్నదానిపై పెద్ద లోతుగా విశ్లేషించాల్సిన పనిలేదు. సింపుల్గా కరోనా అనుకోవచ్చు. ఓవైపు ప్రపంచవ్యాప్తంగా 102 దేశాలు కరోనా బారిన పడటం, అదే సమయంలో... అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోవడం... అలాగే ఇండియాలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతుండటం, యెస్ బ్యాంక్ సంక్షోభం వంటి అంశాలు... ఇన్వెస్టర్లు షేర్ల అమ్మకాలకు మొగ్గు చూపేలా చేస్తున్నాయి.
అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లన్నీ ఏడినట్లు తయారయ్యాయి. ఒకదానికొకటి పోటీ పడి మరీ భారీ నష్టాల్ని తెచ్చుకున్నాయి. ఎక్కడ చూసినా రెడ్ కలర్ సూచీలే కనిపిస్తున్నాయి. ఇవాళ్టి మార్కెట్లో క్రూడ్ ఆయిల్ షేర్లు, బ్యాంకింగ్, ఫార్మా, హౌసింగ్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఇన్వెస్టర్లు లబోదిబోమంటున్నారు. దీర్ఘకాలికంగా మార్కెట్లలో పెట్టుబడులు పెట్టి... ఆదాయం వస్తుందనుకున్న ఎంతో మంది... ఇటీవల వరుసగా మార్కెట్లు పతనం అవుతుండటంతో... ఇక తమ సొమ్ము పోయినట్లే అనే ఆందోళనలో ఉన్నారు. ఇలాంటి సమయంలో చిన్న, మధ్యతరగతి ఇన్వెస్టర్లు టెన్షన్ పడొద్దనీ, ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nifty, Sensex, Stock Market