Home /News /business /

VEHICLE SCRAPPAGE GET PROFITS TO GET YOUR VEHICLE SCRAPPED KNOW DETAILS GH EVK

Vehicle Scrappage: తుక్కు నుంచి లాభాలు పొందండి.. పాత వాహ‌నాన్నితుక్కుగా ఎలా మార్చాలో తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చాలా రాష్ట్రాలు ఫిట్ నెస్ పరీక్షల తరువాత కార్లకు 15 సంవత్సరాలు వచ్చే వరకు తిప్పుకునేందుకు అనుమతిస్తున్నాయి. అయితే కొత్త పాలసీ ప్రకారం 15 సంవత్సరాలు దాటిన ప్రతి వాహనానికి తప్పనిసరిగా ఫిట్ నెస్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది.

దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో వాయు కాలుష్యం రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. వాయు కాలుష్యం తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు చర్యలకు ఉపక్రమించాయి. ఇందులో భాగంగా 15 సంవత్సరాలు దాటిన పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ వాహనాలు నడపడానికి వీల్లేదని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్  రీజియన్‌ (Delhi Capital Region)లో 10 సంవత్సరాలు దాటిన వాహనాలు తిప్ప వద్దని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. చాలా రాష్ట్రాలు ఫిట్ నెస్ పరీక్షల తరువాత కార్లకు 15 సంవత్సరాలు వచ్చే వరకు తిప్పుకునేందుకు అనుమతిస్తున్నాయి. అయితే కొత్త పాలసీ ప్రకారం 15 సంవత్సరాలు దాటిన ప్రతి వాహనానికి తప్పనిసరిగా ఫిట్ నెస్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది.

ఇలా గరిష్ఠంగా మరో 5 సంవత్సరాలు నడుపుకోవచ్చు. పాతకార్లు తిప్పాలంటే ఎక్కువ పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి తోడు రిజిస్ట్రేషన్ (Registration) చేసే ఛార్జీలను కూడా పెంచారు. కాలుష్యం ఎక్కువగా వెదజల్లే పాత కార్లను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం స్క్రాప్ పాలసీ (Scrape Policy) ప్రవేశ పెట్టింది. దీని ద్వారా కార్లు స్క్రాప్ చేసే వారికి అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నారు.

Apple ID: యాపిల్ యూజర్లకు బంపరాఫర్​.. యాపిల్​ ఐడీ వాడండి.. 20 శాతం బోనస్ పొందండి


పాత వాహనాలను తుక్కుగా (స్క్రాప్) మార్చితే వచ్చే ప్రయోజనాలు
పాత వాహనం స్క్రాప్ చేసి సర్టిఫికెట్ పొందితే యజమానులు కొత్త కారు కొనేప్పుడు 4 నుంచి 6 శాతం తగ్గింపు పొందవచ్చు. రహదారి పన్నుకూడా తగ్గుతుంది. ఈ విధానం వల్ల వాయు కాలుష్యం తగ్గడమే కాదు, తుక్కును ప్రాసెస్ (Process) చేయడం ద్వారా కొత్త కార్ల తయారీకి అనేక విడి భాగాలు తయారు చేయవచ్చు. కొత్త కార్ల అమ్మకాలు పెరిగి ఆర్థిక వ్యవస్థ కూడా పుంజుకుంటుంది. 15 సంవత్సరాలు దాటిన కార్లు నడుపుకోవాలంటే ప్రతి ఐదు సంవత్సరాలకు రోడ్డు టాక్స్ కు అదనంగా గ్రీన్ టాక్స్ కూడా చెల్లించాలి.

ఎవరి వద్ద స్క్రాప్ చేయాలి..
కేంద్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన ఆథరైజ్డ్ వెహికల్ స్క్రాపింగ్ (Vehicle Scraping) ఫెసిలిటీ కేంద్రంలోనే వాహనాలకు స్క్రాప్ చేసి సర్టిఫికెట్ పొందాలి. స్క్రాప్ చేయించే ముందు వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ( ఒక ఫోటోతో ), ఫిట్ నెస్ సర్టిఫికెట్ (Fitness Certificate) కూడా సమర్పించాల్సి ఉంటుంది. వీటికి తోడు పాన్ కార్డు, ఆధార్ లేదా ఏదైనా గుర్తింపు కార్డు కాపీ అంటే విద్యుత్ బిల్లు, నీటి బిల్లులాంటివి కూడా జతచేయాల్సి ఉంటుంది.

SBI Mega e-auction: ఇ-వేలం నిర్వహిస్తున్న ఎస్‌బీఐ... ఆ ఆస్తులను ఎలా కొనాలం


వీటన్నింటిని ఫామ్ 2కు జతచేయాలి. స్క్రాప్ చేసే వాహనం చాసిస్ నెంబరు తీసివేసినట్టు ఫోటో ను సంబంధిత ఆర్టీవోకు సమర్పించాలి.

స్క్రాపింగ్ (Scraping) పూర్తయ్యాక వాహనంపై రుణాలు, బీమా, కోర్టు కేసులు ఏమీ పెండింగ్ లో లేవని ఓ అఫిడవిట్ ను ఆర్టీవోకు సమర్పించాలి. ట్రాఫిక్ పోలీసులు, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇవన్నీ పరిశీలించిన తరవాత అభ్యంతరాలు లేకుంటే క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇస్తాయి. ఇవన్నీ పరిశీలించిన తరువాత సమీప ఆర్టీవో పరిశీలించి వాహనాల స్క్రాపింగ్ పక్రియను పూర్తి చేస్తారు.
Published by:Sharath Chandra
First published:

Tags: Cars, Delhi capital, New Delhi, Vehicles

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు