Vehicle Insurance: మీ బండికి ఏ ఇన్స్యూరెన్స్ ఉంది? ఏ బీమా తీసుకుంటే ఏం లాభమో తెలుసా?

Vehicle Insurance | మీ బండికి ఇన్స్యూరెన్స్ ఉందా? ఏ ఇన్స్యూరెన్స్ తీసుకున్నారు? ఏ బీమా తీసుకుంటే ఎక్కువ లాభం. తెలుసుకోండి.

news18-telugu
Updated: September 10, 2020, 1:57 PM IST
Vehicle Insurance: మీ బండికి ఏ ఇన్స్యూరెన్స్ ఉంది? ఏ బీమా తీసుకుంటే ఏం లాభమో తెలుసా?
Vehicle Insurance: మీ బండికి ఏ ఇన్స్యూరెన్స్ ఉంది? ఏ బీమా తీసుకుంటే ఏం లాభమో తెలుసా? (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
రోడ్ల‌పై ఎలాంటి వాహనాలు తిర‌గాల‌న్నా చ‌ట్ట ప్ర‌కారం వాటికి బీమా ఉండాల్సిందే. కారు కొన్న‌వారు త‌ప్ప‌నిస‌రిగా బీమా చేయించుకోవాలి. కారు బీమా పాలసీ కొనడం కొంచెం కష్టమైన పని. ఒక వ్యక్తి సొంత వాహనం రకం, డ్రైవింగ్ పరిస్థితుల ఆధారంగా పాలసీని ఎన్నుకోవాలి. బీమా కవరేజి ఎక్కువ ఉండాలనుకుంటే ప్రీమియం కూడా పెరుగుతుంది. కారుకు బీమా చేయించాల‌నుకున్న‌ప్పుడు మ‌నం కొన్ని విష‌యాల‌పై అవగాహన పెంచుకోవాలి. పాలసీ వ్య‌వ‌ధి, ఎన్సీబీ, ఐడీవీ వంటి నిబంధ‌న‌లు తెలుసుకోవాలి.

పాలసీ వ్య‌వ‌ధి: పాలసీ వ్య‌వ‌ధి బీమా గ‌డువును సూచిస్తుంది. అంటే ఎప్ప‌టి నుంచి ఎప్ప‌టి వ‌ర‌కు కారుకు బీమా వ‌ర్తిస్తుందో.. అదే పాల‌సీ వ్య‌వ‌ధి. సాధారణంగా బీమా పాలసీ ఒక‌ సంవత్సరం వ‌ర‌కే చెల్లుతుంది. కానీ ఇప్పుడు చాలా కంపెనీలు కస్టమర్లను ఆకర్షించడానికి 3-5 సంవత్సరాల వ‌ర‌కు, త‌క్కువ రుసుముతో బీమా అందిస్తున్నాయి.

Loan EMI: లోన్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? ఈ ఛాన్స్ మీకోసమే

SBI ATM: అకౌంట్‌లో డెబిట్ అయినా ఏటీఎంలో డబ్బులు రాలేదా? ఇలా కంప్లైంట్ చేయండి

car insurance, insurance, insurance policy, Motor insurance, types of car insurance, vehicle insurance, కార్ ఇన్స్యూరెన్స్, వెహికిల్ ఇన్స్యూరెన్స్, కార్ బీమా, ఇన్స్యూరెన్స్ పాలసీ, మోటార్ ఇన్స్యూరెన్స్
ప్రతీకాత్మక చిత్రం


ఐడీవీ- ఇన్సూరెన్స్ డిక్లేర్ వ్యాల్యూ: దొంగతనం లేదా ప్రమాదం జరిగినప్పుడు బీమా సంస్థ నిర్ణయించిన కారు గరిష్ట విలువ తెలిపేదే ఐడీవీ. ఒకవేళ మీ వాహనం మరమ్మతుకు ఐడీవీ విలువ‌కు మించి ఖ‌ర్చ‌యినా, కారును ఎవ‌రైనా దొంగిలించినా బీమా సంస్థ ఐడీవీ విలువను మాత్రమే చెల్లిస్తుంది. పాలసీని కొనుగోలు చేసేటప్పుడు దీని విలువను మార్చవచ్చు. కానీ అందుక తగ్గ‌ట్టే పాలసీ ప్రీమియం కూడా పెరుగుతుంది.

ఎన్‌సీబీ: ఎన్‌సీబీ లేదా నో క్లెయిమ్ బోనస్ అనేది కొనుగోలుదారులను ఆకర్షించడానికి బీమా సంస్థలు ఉపయోగించే నిబంధన. నిర్ణీత వ్య‌వ‌ధిలో పాల‌సీ క్లెయిమ్ చేసుకునే అవ‌స‌రం రాని వినియోగ‌దారుడు, బీమాను రెన్యువ‌ల్ చేయించేట‌ప్పుడు కొంత‌మేర‌ తగ్గింపు పొందొచ్చు. ఈ బోన‌స్ విలువ 50శాతం వ‌ర‌కే ప‌రిమితం.

Top 5 Electric bike: టాప్ 5 ఎలక్ట్రిక్ టూవీలర్స్ ఇవే... ధర ఎంతో తెలుసా

Post Office Account: అకౌంట్‌లో ఈ మార్పులు చేస్తేనే ప్రభుత్వం నుంచి సబ్సిడీ వస్తుంది

car insurance, insurance, insurance policy, Motor insurance, types of car insurance, vehicle insurance, కార్ ఇన్స్యూరెన్స్, వెహికిల్ ఇన్స్యూరెన్స్, కార్ బీమా, ఇన్స్యూరెన్స్ పాలసీ, మోటార్ ఇన్స్యూరెన్స్
ప్రతీకాత్మక చిత్రం


ప్ర‌స్తుతం మార్కెట్లో ఐదు రకాల కార్ల బీమా కవరేజ్ అందుబాటులో ఉన్నాయి.

1. ల‌య‌బిలిటీ కవరేజ్: ఒక వాహనదారుడికి యాక్సిడెంట్ జ‌రిగిన‌ప్పుడు, ఆ ప్ర‌మాదం డ్రైవర్ కారణంగా జరిగిన‌ప్పుడే ఇది చెల్లుతుంది. ప్ర‌మాదంలో దెబ్బ‌తిన్న‌ వాహన మ‌ర‌మ్మ‌తుల‌కు అయ్యే ఖ‌ర్చు, ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ వ్య‌క్తుల‌ వైద్య చికిత్సకు అయ్యే ఖ‌ర్చు, థ‌ర్డ్ పార్టీ డ్యామేజీ.. వంటి వాటిని ఈ క‌వ‌రేజీలో పొందే అవ‌కాశం ఉంది.

2. కొల్లీజ‌న్‌ కవరేజ్: ఈ కవరేజీలో ఉండే వాహనానికి ఒక‌వేళ యాక్సిడెంట్ అయితే.. కారు మరమ్మతు ఖర్చులను బీమా సంస్థ భరిస్తుంది. మరమ్మతుల ఖర్చు వాహనం ప్రస్తుత మార్కెట్ విలువను మించి ఉంటే... బీమా సంస్థ ప్రస్తుత మార్కెట్ విలువను మాత్ర‌మే చెల్లిస్తుంది. జీరో తరుగుదల బీమా ఈ కవరేజీలో భాగం.

3. వ్యక్తిగత గాయం కవరేజ్: ఏదైనా యాక్సిడెంట్‌లో గాయ‌ప‌డ్డ ప్ర‌జ‌లు ఎవ‌రైనా దీని కింద ప్ర‌యోజ‌నాలు పొంద‌డానికి అర్హులు. ప్రమాదానికి సంబంధించిన అన్ని ఖర్చులను ఇది కవర్ చేస్తుంది. డ్రైవర్, ఇతర ప్రయాణీకుల వైద్య బిల్లులను బీమా సంస్థ చెల్లిస్తుంది.

4. అన్ ఇన్యూర్డ్ మోటారిస్ట్ ప్రొటెక్ష‌న్‌: ఒక వాహనాన్ని.. బీమా పాలసీ పరిధిలోకి రాని మరో వాహనం ఢీకొడితే... ప్ర‌మాద ఖ‌ర్చుల‌ను సొంతంగా భ‌రించాల్సి ఉంటుంది. అందుకే అన్ని సందర్భాల్లోనూ థ‌ర్డ్‌ పార్టీ బీమా కవరేజ్ సరిపోదు. అలాంట‌ప్పుడు అన్ ఇన్యూర్డ్ మోటారిస్ట్ ప్రొటెక్ష‌న్ క‌వ‌రేజీ ఉప‌యోగ‌ప‌డుతుంది. దీని కింద‌ సందరు బీమా సంస్థ అదనపు లేదా మొత్తం డబ్బును చెల్లిస్తుంది. తద్వారా నష్టాన్ని సులువుగా అధిగమించవచ్చు.

5. సమగ్ర కవరేజ్: ఇందులో వాహనం, డ్రైవర్, ప్రయాణీకులు, థ‌ర్డ్‌ పార్టీ వాహనం, థ‌ర్డ్‌ పార్టీ డ్రైవర్‌తో సంబంధం ఉన్న అన్ని రకాల ప్రమాదాల నుంచి క‌వ‌రేజ్ పొందే అవ‌కాశం ఉంది. వాతావరణ మార్పులు, వరదలు, అగ్నిప్ర‌మాదాలు, దొంగతనం వంటి ప్రమాద కారకాలకు కూడా బీమా కంపెనీ పరిహరం చెల్లిస్తుంది.
Published by: Santhosh Kumar S
First published: September 10, 2020, 1:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading