కరోనా(Corona) కాలంలో పాఠశాలలన్నీ మూతపడటంతో విద్యార్థులు(Students) బైజూస్, అన్అకాడమీ (Unacademy), వేదాంతు (Vedantu) వంటి ఆన్లైన్(Online) బోధన సంస్థలకు ఆకర్షితులయ్యారు. ఇప్పుడు కరోనా(Corona) తగ్గుముఖం పట్టడంతో విద్యార్థులందరూ ఆన్లైన్ ట్యూటరింగ్ క్లాసులకు దూరమవుతున్నారు. దీంతో ఈ సంస్థలకు స్టూడెంట్స్(Students) సంఖ్యతో పాటు ఆదాయం గణనీయంగా తగ్గుతోంది. ఇక ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో మందగమనం వంటి బాహ్య కారణాలు ఈ సంస్థల మూలధనంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎడ్యూటెక్ (Edtech) కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఎడ్యూటెక్ కంపెనీ(Company) వేదాంతు కూడా 424 మంది ఉద్యోగులను అంటే దాదాపు 7 శాతం మంది ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది.
వేదాంతు సహ వ్యవస్థాపకుడు, సీఈఓ వంశీకృష్ణ ప్రకారం, వేదాంతు కంపెనీ రాబోయే త్రైమాసికాల్లో నిధుల కొరతను ఎదుర్కొనే అవకాశం ఉంది. "ప్రస్తుతం, బయట వాతావరణం చాలా ప్రతికూలంగా ఉంది. ఐరోపాలో యుద్ధం, రాబోయే మాంద్యం భయాలు, ఫెడ్ వడ్డీ పెంపుదలలు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లకు దారితీశాయి. ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌లలో భారీ దిద్దుబాటు కనిపిస్తోంది. భారతదేశంలో కూడా స్టాక్‌లలో కరెక్షన్ కనిపిస్తోంది. ఈ వాతావరణం కారణంగా, రాబోయే త్రైమాసికాల్లో వేదాంతు కంపెనీకి మూలధనం కొరత ఏర్పడవచ్చు." అని కృష్ణ ఒక బ్లాగ్‌లో వేదాంత ఉద్యోగులకు తెలిపారు.
IPPB Recruitment 2022: డిగ్రీ అర్హతతో ఇండియా పోస్ట్‌లో 650 జాబ్స్... 3 రోజుల్లో అప్లై చేయండి ఇలా
"కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో, పాఠశాలలు, ఆఫ్‌లైన్ మోడల్‌లు తెరుచుకోవడంతో, గత రెండేళ్లలో కనిపించిన 9 రెట్ల హైపర్-గ్రోత్ ఇప్పుడు తగ్గిపోతుంది. ఈ పరిస్థితులలో వేదాంతు మిషన్ మనుగడ ఎక్కువ కాలం సాగేందుకు మేం కూడా ఉద్యోగులను తొలగించాల్సి వస్తుంది. ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నందుకు చాలా బాధగా అనిపిస్తుంది కానీ తొలగించక తప్పలేదు" అని కృష్ణ వివరించారు. విద్యార్థులకు అందించే క్వాలిటీ ఎడ్యుకేషన్‌పై రాజీ పడకుండా కనీసం 30 నెలల పాటు ప్లాన్స్ రూపొందించాలని కంపెనీ చూస్తోందని, ఆవిష్కరణ, ఆటోమేషన్ ద్వారా కస్టమర్ సంపాదన వ్యయాన్ని తగ్గించడంపై దృష్టి సారిస్తోందని కృష్ణ చెప్పారు.
కొద్దిరోజుల క్రితమే వేదాంతు తన ప్రాజెక్ట్‌లన్నింటిని సమగ్రంగా సమీక్షించి ప్రాధాన్యత ఇవ్వాల్సిన ప్రాజెక్ట్‌లు, టీమ్‌లను గుర్తించింది. వాటిలో కోర్, నాన్-కోర్ ప్రాజెక్ట్‌లుగా మ్యాప్ చేసి అవసరం లేని వాటిని వదిలించుకుంటూ వస్తోంది.
ఇదే క్రమంలో కొన్ని ప్రాజెక్ట్‌లతో పాటు టీమ్స్ మెంబర్స్ ని కూడా తీసేసింది. అయితే ఉద్యోగం కోల్పోని వారు హెచ్ఆర్, వారి లీడర్లతో డిస్కషన్ కోసం ఈ-మెయిల్‌ను రిసీవ్ చేసుకుంటారని కృష్ణ చెప్పారు. వేదాంతు కంపెనీ ఉద్యోగులు, వారి కుటుంబాలకు ఆరోగ్య ప్రయోజనాలు వంటి ప్రయోజనాలను ఆగస్టు 5 వరకు పొడిగిస్తుంది. ఉద్యోగులకు వచ్చే ఏడాది ఏప్రిల్ 29 వరకు ప్రాక్టో ద్వారా 15 వైద్యుల సంప్రదింపులు, పాథాలజీ & ఫార్మసీ సేవలపై డిస్కౌంట్స్ అందించే ప్లాన్ కూడా చేస్తోంది.
ఎడ్యూటెక్ యునికార్న్ (100 కోట్ల డాలర్ల విలువైన కంపెనీ) వేదాంతు 200 మంది ఉద్యోగులను లేదా దాదాపు 3.5% మంది ఉద్యోగులను మేలో తీసేసింది.
అయితే తాజాగా రెండవ రౌండ్ లే ఆఫ్ ప్రక్రియ చేపట్టి ఉద్యోగుల గుండెల్లో గుబులు రేపుతోంది. దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు తగ్గుముఖం పట్టడంతో పాఠశాలలు, ఫిజికల్ ట్యూషన్ తరగతులు తిరిగి పూర్తి స్థాయిలో ఓపెన్ అవుతున్నాయి. ఈ కారణంగా ఇండియాలో ఎడ్యూటెక్ రంగంలో మందగమనం ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే ఉద్యోగులను తొలగించడంలో కంపెనీలైన అన్అకాడమీ, లిడో లెర్నింగ్ వంటి కంపెనీలు ఉద్యోగులను ఇంటికి పంపిచేస్తున్నాయి. చేరింది. అన్అకాడమీ తన వర్క్‌ఫోర్స్‌లో 10% లేదా 600 మంది ఉద్యోగులను తొలగించగా, లిడో లెర్నింగ్ 1,000 మంది ఉద్యోగులను టెర్మినేట్ చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.