కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ల సర్వీసులను ఇప్పటి వరకు ఐదు మార్గాల్లో ప్రారంభించింది. మూడో రైలు సేవలు గాంధీనగర్- ముంబై మధ్య రెండు నెలల క్రితం అందుబాటులోకి వచ్చాయి. అయితే తాజాగా ఈ వందే భారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ గుజరాత్‌లోని ఉద్వాడ, వాపి స్టేషన్ల మధ్య పశువులను ఢీకొట్టంది. ఈ దుర్ఘటన గురువారం సాయంత్రం జరిగినట్లు ఓ రైల్వే అధికారి తెలిపారు. ప్రమాదంలో రైలు ముందు ప్యానెల్‌కు చిన్నపాటి డెంట్ ఏర్పడిందని తెలిపారు. ఇండియాలోనే తయారు చేసిన ఈ సెమీ-హై స్పీడ్ రైలు పశువులను ఢీకొట్టిన నాలుగో ఘటన కావడం గమనార్హం.
రెండు నెలల్లో నాలుగు ప్రమాదాలు
పశ్చిమ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సుమిత్ ఠాకూర్ మాట్లాడుతూ.. ఉద్వాడ, వాపి మధ్య లెవల్ క్రాసింగ్ గేట్ నంబర్ 87 సమీపంలో సాయంత్రం 6.23 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ముందు భాగంలో ఇంజిన్‌కు ఎలాంటి సమస్యలు ఎదురవ్వలేదని, చిన్న డెంట్ పడిందని తెలిపారు. కొద్దిసేపు ఆగిన రైలు.. తిరిగి 6.35 గంటలకు బయలుదేరింది. అక్టోబరు 6న, వత్వా, మణినగర్ రైల్వే స్టేషన్ల మధ్య నాలుగు గేదెల మందను రైలు ఢీకొట్టడంతో ముందు ప్యానెల్ దెబ్బతింది. ఆ తర్వాత అక్టోబర్ 7న ఆనంద్ సమీపంలో రైలు ఆవును ఢీకొట్టింది. మరో ఘటన గుజరాత్‌లోని అతుల్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో రైలు ఎద్దును ఢీకొట్టింది.
రైలులో అధునాత ఫీచర్లు
ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లో ముంబై- అహ్మదాబాద్ ప్రయాణానికి ఛార్జీ రూ.2,505 కాగా, చైర్ కార్కు రూ.1,385 చెల్లించాలి. ముంబై- అహ్మదాబాద్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు అనుగుణంగా రైల్వే రీషెడ్యూల్ చేసింది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను 16 కోచ్‌లతో ఇండియాలోనే తయారు చేశారు. ఈ రైలు కేవలం 140 సెకన్లలో 160 kmph వేగాన్ని చేరుకుంటుంది. ఇది 3.5 (రైడింగ్ ఇండెక్స్)తో ప్రయాణీకులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. GSM/GPRS ద్వారా సెంటర్/మెయింటెనెన్స్ సిబ్బంది పర్యవేక్షణ, ఎయిర్ కండిషనింగ్, కమ్యూనికేషన్ కంట్రోల్ చేయడానికి, ఫీడ్‌బ్యాక్‌ను పొందడానికి రైలులో కోచ్ కంట్రోల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది. ఇది ప్రతి కోచ్‌లో ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఏర్పాటు ఉంటుందని అధికారి తెలిపారు.
అత్యాధునిక సెక్యూరిటీ సిస్టమ్
స్లైడింగ్ ఫుట్స్టెప్లతో కూడిన ఆటోమేటిక్ ప్లగ్ డోర్లు, కోచ్‌ల లోపల టచ్-ఫ్రీ స్లైడింగ్ డోర్లు ఉంటాయని వివరించారు. ఎగ్జిక్యూటివ్ క్లాస్ లోపల రివాల్వింగ్ సీట్లు ఉంటాయని తెలిపారు. టచ్- ఫ్రీ సౌకర్యాలతో కూడిన ఏరోప్లేన్-వంటి బయో-వాక్యూమ్ టాయిలెట్లను ఈ రైలులో మొదటిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక లావెటరీని కూడా ఉన్నట్లు తెలిపారు. అంధుల కోసం సీట్ల హ్యాండిల్స్‌లో బ్రెయిలీ అక్షరాలతో సీట్ నంబర్లు ఉంటాయన్నారు. రైలులో కవాచ్ (ట్రైన్ కొల్యూజన్ అవాయిడ్ సిస్టమ్) భద్రతా వ్యవస్థను అమర్చారు. కోచ్‌లలో ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ యూనిట్లు ఉన్నాయి. 650 మి.మీ ఎత్తు వరకు వరదలను తట్టుకునే వ్యవస్థ కూడా ఉందని వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Vande Bharat Train