హోమ్ /వార్తలు /బిజినెస్ /

Vande Bharat: వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో మారిన ఫుడ్ మెనూ.. ఇక, చాక్లెట్ బార్స్ ఉండవు.. వాటి స్థానంలో..

Vande Bharat: వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో మారిన ఫుడ్ మెనూ.. ఇక, చాక్లెట్ బార్స్ ఉండవు.. వాటి స్థానంలో..

Vande Bharat: వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో మారిన ఫుడ్ మెనూ.. ఇక, చాక్లెట్ బార్స్ ఉండవు.. వాటి స్థానంలో..

Vande Bharat: వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో మారిన ఫుడ్ మెనూ.. ఇక, చాక్లెట్ బార్స్ ఉండవు.. వాటి స్థానంలో..

Vande Bharat: కొత్తగా ప్రారంభించిన ట్రైన్‌లో రైల్వేశాఖ చాలా అప్‌గ్రేడ్స్‌ చేసింది. ఆరోగ్యకరమైన, తక్కువ కేలరీలు కలిగిన ఆహార పదార్థాలతో మెనూ (Food Menu)ను తీసుకొచ్చింది. ఆహార పదార్థాల్లో మార్పులు, కొత్త అప్‌గ్రేడ్స్‌ ఏంటో చూద్దాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) శుక్రవారం కొత్త వందే భారత్ ట్రైన్‌ (Vande Bharat Train) సర్వీస్‌ను ప్రారంభించారు. గుజరాత్‌ (Gujarat)లోని గాంధీనగర్ నుంచి మహారాష్ట్రలోని ముంబై వరకు ఈ ట్రైన్ సర్వీస్ నడుతస్తుంది. ట్రైన్ ప్రారంభం సందర్భంగా గాంధీనగర్ నుంచి కలుపూర్ వరకు దాదాపు అరగంట పాటు మోదీ ఈ ట్రైన్‌లో ప్రయాణించారు. 2019లో ఢిల్లీలో తొలిసారిగా వందే భారత్‌ ట్రైన్‌ను ఆయన ప్రారంభించారు. కొత్తగా ప్రారంభించిన ట్రైన్‌లో రైల్వేశాఖ చాలా అప్‌గ్రేడ్స్‌ చేసింది. ఆరోగ్యకరమైన, తక్కువ కేలరీలు కలిగిన ఆహార పదార్థాలతో మెనూ (Food Menu)ను తీసుకొచ్చింది. ఆహార పదార్థాల్లో మార్పులు, కొత్త అప్‌గ్రేడ్స్‌ ఏంటో చూద్దాం.

* వందే భారత్ 2.0

పేరు ఒకటే అయినా వందే భారత్ సిరీస్‌లో అందుబాటులోకి తీసుకొచ్చిన మూడో ట్రైన్‌కు 'వందే భారత్ 2.0' అని పేరు పెట్టారు. ఇప్పటికే న్యూఢిల్లీ- వారణాసి, న్యూఢిల్లీ- వైష్ణో దేవి కత్రా మధ్య రెండు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. అయితే గతంలో తీసుకొచ్చిన ట్రైన్స్‌ కంటే కొత్త రైలులో కొత్త అప్‌గ్రేడ్స్‌ ఉన్నాయి.

జనాదరణ పొందిన స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగానే, వందే భారత్ కూడా ప్రతి సిరీస్‌కు కొత్త అప్‌గ్రేడ్‌లతో వస్తుందని, పేరు అలాగే ఉంటుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. కొత్త రైలు ధర దాదాపు రూ.115 కోట్లు. గత వెర్షన్ కంటే రూ.15 కోట్లు ఎక్కువ. మూడు సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న వందే భారత్‌ ట్రైన్స్‌పై ప్రయాణికుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ను తీసుకొని, దానికి అనుగుణంగా అప్‌గ్రేడ్‌ చేసినట్లు చెప్పారు.

* ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు

వందే భారత్ ట్రైన్‌లో రైల్వే కేటరింగ్ విభాగం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ కొత్తరకం వంటకాలను ప్రయాణికులకు అందించనుంది. రాగులు, భాగర్, తృణధాన్యాలు, ఓట్స్, ముయెస్లీ మొదలైన వాటితో తయారు చేసిన ఆరోగ్యకరమైన, తక్కువ కేలరీల ఆహార పదార్థాలను అందించనుంది.

ఇది కూడా చదవండి : వింటర్‌లో ఊటీ వెళ్తారా? ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలివే

ముందు ప్రీమియం రైలులో పిల్లల కోసం మాల్ట్ పానీయాలు తీసుకొచ్చారు. బి వోకల్, గో లోకల్ ఐడియాలజీలో స్థానిక రైతుల నుంచి సేకరించిన వేరుశెనగతో సాధారణ ఛాక్లెట్ బార్ స్థానంలో పీనట్‌ చిక్కి(Peanut Chikki) అందించనున్నట్లు రైల్వే తెలిపింది. ఇంటర్నేషనల్‌ ఇయర్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌ 2023 థీమ్‌కు అనుగుణంగా ఆహార పదార్థాల మెనూ సిద్ధం చేసినట్లు రైల్వేశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

* మేజర్‌ అప్‌గ్రేడ్స్‌ ఇవే

ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ కొత్త ట్రైన్‌ 129 సెకన్లలో గంటకు 160 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ముందు వెర్షన్‌ ట్రైన్స్‌ కంటే దాదాపు 16 సెకన్లు వేగంగా ఈ టార్గెట్‌ చేరుకుంటుంది. కొత్త ట్రైన్‌ దాదాపు 392 టన్నుల బరువు ఉంటుంది. ముందు వచ్చిన ట్రైన్స్‌ కంటే 38 టన్నుల వరకు బరువు తక్కువ.

Published by:Sridhar Reddy
First published:

Tags: IRCTC, PM Narendra Modi, Vande Bharat Train

ఉత్తమ కథలు