హోమ్ /వార్తలు /బిజినెస్ /

Bank Account: ఆ బ్యాంకులో అకౌంట్ ఉన్నవారికి బంపరాఫర్... సేవింగ్స్ అకౌంట్‌లోని డబ్బులకు భారీగా వడ్డీ

Bank Account: ఆ బ్యాంకులో అకౌంట్ ఉన్నవారికి బంపరాఫర్... సేవింగ్స్ అకౌంట్‌లోని డబ్బులకు భారీగా వడ్డీ

Bank Account: ఆ బ్యాంకులో అకౌంట్ ఉన్నవారికి బంపరాఫర్... సేవింగ్స్ అకౌంట్‌లోని డబ్బులకు భారీగా వడ్డీ
(ప్రతీకాత్మక చిత్రం)

Bank Account: ఆ బ్యాంకులో అకౌంట్ ఉన్నవారికి బంపరాఫర్... సేవింగ్స్ అకౌంట్‌లోని డబ్బులకు భారీగా వడ్డీ (ప్రతీకాత్మక చిత్రం)

Bank Account | సాధారణంగా సేవింగ్స్ అకౌంట్ (Savings Account) వడ్డీరేట్లు 3-4 శాతం మాత్రమే ఉంటాయి. కానీ ఓ బ్యాంకు సేవింగ్స్ అకౌంట్‌లోని డబ్బులకు ఏకంగా 7.5 శాతం వడ్డీ ఇస్తోంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

ఇటీవల చాలా బ్యాంకులు వడ్డీ రేట్లు సవరించాయి. కొన్ని బ్యాంకులు MCLRను పెంచడం ద్వారా కస్టమర్లపై లోన్‌ ఈఎంఐ భారం మోపాయి. మరికొన్ని బ్యాంకులు ఎఫ్‌డీలపై అధిక రేట్లను అందిస్తున్నాయి. అయితే తాజాగా సేవింగ్స్‌ అకౌంట్‌ వినియోగదారులకు ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (USFB) గుడ్‌న్యూస్‌ అందజేసింది. సేవింగ్స్‌ అకౌంట్‌పై వడ్డీ రేట్లను (Interest Rates) పెంచింది. కొత్త రేట్లు 2022 డిసెంబర్ 1 నుంచి అమలవుతాయని బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ పేర్కొంది. తాజాగా తీసుకొచ్చిన మార్పులతో ఇప్పుడు బ్యాంక్‌ వినియోగదారులు సేవింగ్స్ అకౌంట్‌పై గరిష్టంగా 7.50 శాతం వడ్డీ రేటును పొందవచ్చు. భారతదేశంలో నివసించే లేదా హిందూ అన్‌డివైడెడ్‌ ఫ్యామిలీకి చెందిన ఎవరైనా ఉత్కర్ష్ స్టాండర్డ్ సేవింగ్స్ అకౌంట్‌ ఓపెన్‌ చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అధిక వడ్డీ రేటును అందుకొనే అవకాశం పొందవచ్చు.

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేట్లు

రూ.1 లక్ష వరకు ఉన్న సేవింగ్స్‌ అకౌంట్‌ బ్యాలెన్స్‌లపై ఉత్కర్ష్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్ సంవత్సరానికి 4.25 శాతం వడ్డీ అందిస్తోంది. అయితే రూ.1 లక్ష నుంచి రూ.25 లక్షల వరకు ఉండే ఇంక్రిమెంటల్‌ బ్యాలెన్స్‌పై సంవత్సరానికి 6.50 శాతం వడ్డీని చెల్లిస్తోంది. రూ.25 లక్షల నుంచి రూ.10 కోట్లు వరకు బ్యాలెన్స్‌ ఉండే సేవింగ్స్‌ అకౌంట్‌లకు ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సంవత్సరానికి 7.25 శాతం వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తోంది.

LIC WhatsApp Services: తొలిసారి వాట్సప్ సేవల్ని ప్రారంభించిన ఎల్ఐసీ ... ఇక ఈ సేవలన్నీ మీ ఫోన్‌లోనే

రూ.10 కోట్లు దాటిన సేవింగ్స్‌ అకౌంట్‌ ఇంక్రిమెంటల్ బ్యాలెన్స్‌లపై సంవత్సరానికి గరిష్టంగా 7.50 శాతం వడ్డీ రేటుకు బ్యాంక్ హామీ ఇస్తుంది. డైలీ ప్రొడక్ట్‌ బేస్‌లో వడ్డీని లెక్కించి త్రైమాసికానికి జమ చేస్తామని బ్యాంక్‌ పేర్కొంది. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనుమతించిన యావరేజ్‌ వీక్లీ అమౌంట్‌ మెట్రో, అర్బన్ బ్రాంచ్‌లకు రూ.5,000కాగా, సెమీ అర్బన్, రూరల్ బ్రాంచ్‌లకు రూ.2,500గా ఉంది.

యావరేజ్‌ క్వార్టర్లీ బ్యాలెన్స్‌ ఉంటే చాలు

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల మేరకు.. తమ బ్యాంక్‌ వినియోగదారులు చాలా ప్రత్యేకమైన ప్రయోజనాలను అందిస్తున్నట్లు పేర్కొంది. కస్టమర్‌లు నెలవారీ బ్యాలెన్స్‌కు బదులుగా తమ అకౌంట్‌లో యావరేజ్‌ క్వార్టర్లీ బ్యాలెన్స్‌(AQB) ఉండేలా చూసుకుంటే చాలని తెలిపింది. మెట్రో/అర్బన్ కస్టమర్‌లు కేవలం రూ.5,000 యావరేజ్‌ క్వార్టర్లీ బ్యాలెన్స్‌ ఉంచుకోవడం ద్వారా బ్యాంకింగ్ సేవలను పొందవచ్చని పేర్కొంది.

Pension Rules: రిటైర్మెంట్ తర్వాత ప్రైవేట్ ఉద్యోగులకు కూడా పెన్షన్ ... నిబంధనలివే

సెమీ-అర్బన్/రూరల్ కస్టమర్‌లకు అయితే యావరేజ్‌ క్వార్టర్లీ బ్యాలెన్స్‌ రూ.2,500 అని చెప్పింది. స్టాండర్డ్‌ కస్టమర్‌ల కోసం, డైలీ ATM విత్‌డ్రా లిమిట్‌ రూ.40,000 అందిస్తున్నట్లు ఉత్కర్ష్‌ స్మాల్‌ ఫైనాన్షింగ్‌ పేర్కొంది. రోజువారీ ఖర్చు గరిష్టంగా రూ.1 లక్ష(POS) చేయవచ్చు. బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ల కస్టమర్‌లు.. అధిక ATM విత్‌డ్రా లిమిట్‌, కొనుగోలు పరిమితులు, కనిష్ట AQB, ఇతర విస్తృత శ్రేణి సేవలు, ఉచిత NEFT/RTGS, అధిక వడ్డీ రేట్లు వంటి సేవలను అందుకోవచ్చని స్పష్టం చేసింది.

First published:

Tags: Bank account, Personal Finance, Saving account

ఉత్తమ కథలు