Cash Withdrawal: చనిపోయినవారి ఏటీఎం కార్డుతో డబ్బులు డ్రా చేయొచ్చా? నిబంధనలు ఏం చెబుతున్నాయంటే

Cash Withdrawal: చనిపోయినవారి ఏటీఎం కార్డుతో డబ్బులు డ్రా చేయొచ్చా? నిబంధనలు ఏం చెబుతున్నాయంటే (ప్రతీకాత్మక చిత్రం)

ATM Cash Withdrawal | చనిపోయిన వ్యక్తి ఏటీఎం కార్డు ఉపయోగించి డబ్బులు డ్రా (Cash Withdrawal) చేయొచ్చా? ఈ సందేహం అందరికీ వచ్చే ఉంటుంది. కానీ మరణించిన వ్యక్తి అకౌంట్‌కు సంబంధించిన లావాదేవీలపై నియమనిబంధనలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.

  • Share this:
ఈ రోజుల్లో బ్యాంక్ అకౌంట్ (Bank Account) ఉన్న ప్రతి ఒక్కరూ ఏటీఎం కార్డు తీసుకుంటున్నారు. అకౌంట్‌లో ఉన్న డబ్బు తీసుకోవడానికి (Cash Withdrawal) బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా... ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏటీఎంల నుంచి క్యాష్ విత్‌డ్రా చేసుకుంటున్నారు. అయితే అకౌంట్ హోల్డర్ చనిపోతే వారి ఏటీఎం కార్డుతో ఎవరైనా డబ్బు విత్‌డ్రా చేయవచ్చా? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తున్నారు బ్యాంకింగ్ రంగ నిపుణులు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

చనిపోయిన తల్లిదండ్రుల ఏటీఎం కార్డు ద్వారా వారి బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బు విత్‌డ్రా చేయవచ్చా? తల్లిదండ్రుల మరణం తర్వాత బ్యాంకుకు సమాచారం ఇవ్వకుండా డబ్బు విత్‌డ్రా చేసి... ఆ తరువాత వారి మరణం గురించి బ్యాంకుకు తెలియజేయడం నేరం కిందకు వస్తుందా? ఈ విషయంలో చట్టపరమైన వారసులకు సంబంధించి ఏదైనా వివాదం లేదా దావా ఎదుర్కోవాల్సి వస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం.

Washing Machine Offers: వాషింగ్ మెషీన్ కొనాలా? అమెజాన్ సేల్‌లో రూ.5,000 మాత్రమే

చనిపోయిన వారి అకౌంట్ నుంచి డబ్బు విత్‌డ్రా చేయడం అనేది బ్యాంకును, ఇతర చట్టపరమైన వారసులను మోసం చేయడం కిందకు వస్తుంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. అనంతరం చట్ట ప్రకారం పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంటుంది.

ఒకవేళ మరణించిన వారి అకౌంట్ నుంచి ఎవరైనా పెద్ద మొత్తంలో డబ్బు విత్‌డ్రా చేస్తే.. చనిపోయిన వారి ఎస్టేట్‌కు సంబంధించిన ప్రొబేట్ (Probate) లేదా లెటర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ప్రొబేట్ అనేది చనిపోయిన వ్యక్తి ఎస్టేట్ నిర్వహణకు సంబంధించిన మొత్తం ప్రక్రియ. ఇందులో వారి డబ్బు, ఆస్తుల నిర్వహణ, వాటిని వారసత్వంగా పంపిణీ చేయడం వంటివన్నీ ఉంటాయి. మరణించిన వ్యక్తి వీలునామా రాస్తే.. వారి ఎస్టేట్ నిర్వహణకు ఎంచుకున్న వ్యక్తుల పేరును అది తెలియజేస్తుంది. ఈ విషయంలో చట్టపరమైన వారసుల మధ్య వివాదం తలెత్తితే.. దీన్ని దావాగా మార్చుకోవచ్చు.

LPG Subsidy: మీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రాకపోతే కంప్లైంట్ చేయండి ఇలా

ఈ పత్రాలతో పాటు బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్, సీసీటీవీ ఫుటేజ్, ఖాతాదారుడి మరణ ధ్రువీకరణ పత్రం, డబ్బు విత్‌డ్రా చేసినప్పుడు ATM కార్డు ఎవరి వద్ద ఉంది.. వంటి అన్ని వివరాలతో క్రిమినల్ కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆరోపణలు, దర్యాప్తు, రుజువులను బట్టి క్రిమినల్ పనిష్‌మెంట్ వర్తిస్తుంది.
Published by:Santhosh Kumar S
First published: