పాతకార్లు కొనేందుకే యువత మోజు...ఓఎల్ఎక్స్ అధ్యయనంలో వెల్లడి..

ప్రీ ఓన్డ్ కార్ల సేల్స్ 2019 సంవత్సరంలో ఏకంగా 10 శాతం పెరిగే అవకాశం ఉందని ప్రముఖ సంస్థ ఓఎల్ఎక్స్ పేర్కొంది. ఈ ఏడాది చివరినాటికి పాత కార్ల సేల్స్ దాదాపు 44 లక్షలను తాకే వీలుందని సదరు సంస్థ అంచనా వేసింది.

news18-telugu
Updated: September 11, 2019, 6:47 PM IST
పాతకార్లు కొనేందుకే యువత మోజు...ఓఎల్ఎక్స్ అధ్యయనంలో వెల్లడి..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: September 11, 2019, 6:47 PM IST
ఒక వైపు కొత్త కార్లు సేల్స్ ఢమాల్ అంటుంటే...పాత కార్ల సేల్స్ మాత్రం పుంజుకునే వీలుందని ఒక సర్వేలో తేలింది. అయితే ప్రీ ఓన్డ్ కార్ల సేల్స్ 2019 సంవత్సరంలో ఏకంగా 10 శాతం పెరిగే అవకాశం ఉందని ప్రముఖ సంస్థ ఓఎల్ఎక్స్ పేర్కొంది. ఈ ఏడాది చివరినాటికి పాత కార్ల సేల్స్ దాదాపు 44 లక్షలను తాకే వీలుందని సదరు సంస్థ అంచనా వేసింది. అయితే 2018లోనే ప్రీఓన్డ్ కార్ల సేల్స్ 40 లక్షలు నమోదు కాగా, అది ఈ సంవత్సరం పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. అంతే కాదు 2020 నాటికి ప్రీఓన్డ్ కార్ సేల్స్ 50 లక్షల మార్కు టచ్ చేసే వీలుండగా, 2023లో ఏకంగా 66 లక్షల ప్రీ ఓన్డ్ కార్ సేల్స్ నమోదు చేసే వీలుందని అధ్యయనంలో తేలింది. ప్రస్తుతం ప్రీ ఓన్డ్ కార్ల మార్కెట్ దాదాపు 14 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే ఈ పరిశ్రమ 2023 నాటికి 25 బిలియన్ డాలర్ల సంస్థగా రూపుదాల్చే అవకాశం ఉంది.

ముఖ్యంగా యువత ఎక్కువగా ప్రీ ఓన్డ్ కార్లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారని, ఆర్థిక మాంద్యం సమయంలో కొత్త కార్ల కన్నా పాత కార్లు తక్కువ ధరలకే రావడంతో పాటు, వీటిపై లోన్ సౌకర్యం కూడా కల్పిస్తుండటంతో చాలామంది ఆసక్తి చూపుతున్నారు.

First published: September 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...