TikTok Ban: అమెరికాలో టిక్ టాక్ బంద్...నెగ్గిన ట్రంప్ పంతం..చిక్కుల్లో చైనా...

చైనాకు చెందిన వీ చాట్, టిక్ టాక్ యాప్స్ ను నిషేధించనున్నట్లు అమెరికా వాణిజ్య విభాగం ప్రకటించింది. ఆదివారం నుంచి ఈ నిషేధం అమలులోకి రానున్నట్లు పేర్కొంది.

news18-telugu
Updated: September 18, 2020, 10:03 PM IST
TikTok Ban: అమెరికాలో టిక్ టాక్ బంద్...నెగ్గిన ట్రంప్ పంతం..చిక్కుల్లో చైనా...
టిక్‌టాక్(TikTok)
  • Share this:
చైనాకు దెబ్బ మీద దెబ్బ తగిలినట్లయింది. ఇప్పటికే భారత ప్రభుత్వం చైనాకు చెందిన యాప్స్ ను నిషేధించగా.. తాజాగా అమెరికా కూడా ఈ జాబితాలో చేరింది. చైనాకు చెందిన వీ చాట్, టిక్ టాక్ యాప్స్ ను నిషేధించనున్నట్లు అమెరికా వాణిజ్య విభాగం ప్రకటించింది. ఆదివారం నుంచి ఈ నిషేధం అమలులోకి రానున్నట్లు పేర్కొంది. వెంటనే వాటిని తమ స్టోర్ల నుంచి తొలగించాలని యాపిల్, గూగుల్ సంస్థలను అభ్యర్థించింది. ఇప్పటికే ఈ యాప్స్ ను డౌన్ లౌడ్ చేసుకున్న వారు వీటిని వాడుకోవచ్చు. అయితే అప్డేట్ వర్షన్ లను డౌన్ లోడ్ చేసుకోలేరు. ఎప్పటివరకు ఈ నిషేధం అమలులో ఉంటుందో చెప్పలేదు.

నిషేధానికి కారణమిదే...

అమెరికా పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని చైనా సేకరిస్తోందని ఆ దేశ వాణిజ్య విభాగం కార్యదర్శి విల్ బర్ రోస్ తెలిపారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షులు ట్రంప్ తన శక్తి మేరకు ఏ చర్యైనా చేయగలరని మరోసారి రుజువు చేశారని రోస్ అన్నారు. జాతీయ విలువలు, ప్రజాస్వామ్య ఆధారిత నిబంధనలు దృష్టిలో ఉంచుకుని యూఎస్ చట్టాలను కఠినంగా అమలు చేస్తామని అన్నారు. మిగతా ఆంక్షలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.

స్పందించని సంస్థలు...
వీ చాట్ ను లక్ష్యంగా చేసుకుని ఆంక్షలు విస్తృతం చేసింది అమెరికా. ఆదివారం నుంచి వీ చాట్ తో సంబంధమున్న ఇంటర్మెట్ ట్రాఫిక్ ను యాక్సిస్ చేయడం లేదా బదిలీ చేయడం చట్టవిరుద్ధమని ఓ ప్రకటించింది. టిక్ టాక్ విషయంలోనూ ఇదే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ నిషేధంపై టిక్ టాక్, వీ చాట్ పేరెంట్ సంస్థ టెన్సెంట్ ఇంకా ఎలాంటి స్పందనను వెల్లడించలేదు. చైనాపై చర్యలు తప్పవంటూ ఇప్పటికే హెచ్చరిస్తున్న అమెరికా అన్నంత పనిచేసింది. ఇటీవలే ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టిక్ టాక్ ను యూఎస్ లో నిషేధించే విషయాన్ని తమ పాలనా విభాగం పరిశీలిస్తోందంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.

వినియోగదారులు టార్గెట్ కాదు..
టిక్ టాక్, వీ చాట్ పై ఉంచిన ఆంక్షల.. వినియోగదారులపైన లేదా టిక్ టాక్ ఉద్యోగులపై లేవు. ఉద్యోగులు ఇప్పటికీ వారి జీతాలను, బెనిఫిట్లు పొందవచ్చు. అంతేకాకుండా వారి రోజువారీ పనిపై ఎలాంటి ప్రభావం పడదు. వీ చాట్ తో తమ కమ్యూనికేషన్ బలహీనపడవచ్చు అని ఈ నెల 15న యూఎస్ ప్రభుత్వం హెచ్చరించింది. అయితే వినియోగదారులను లక్ష్యంగా చేసుకోలేదని, జరిమానా విధించమని వ్యాఖ్యానించింది.
Published by: Krishna Adithya
First published: September 18, 2020, 10:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading