చైనాకు భారీ షాక్ ఇచ్చిన అమెరికా...స్టాక్ ఎక్స్ చేంజీల నుంచి చైనీస్ కంపెనీలు ఔట్...

చైనా కంపెనీలను అమెరికా స్టాక్ ఎక్చేంజీల నుంచి తొలగించే తీర్మానానికి సెనేట్ ఆమోద ముద్రవేసింది. దీన్ని ట్రంప్‌ ఘనవిజయంగా భావిస్తున్నారు. అంతేకాదు చైనా విద్యార్థులు అమెరికాలో చదువుకునే, పరిశోధన చేసే అవకాశాలను తగ్గించడానికి ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

news18-telugu
Updated: May 23, 2020, 7:17 AM IST
చైనాకు భారీ షాక్ ఇచ్చిన అమెరికా...స్టాక్ ఎక్స్ చేంజీల నుంచి చైనీస్ కంపెనీలు ఔట్...
(File)
  • Share this:
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలోని చైనా కంపెనీలకు చెక్ పెట్టే దిశగా పావులు కదుపుతున్నారు. చైనా కంపెనీలను అమెరికా స్టాక్ ఎక్చేంజీల నుంచి తొలగించే తీర్మానానికి సెనేట్ ఆమోద ముద్రవేసింది. దీన్ని ట్రంప్‌ ఘనవిజయంగా భావిస్తున్నారు. అంతేకాదు చైనా విద్యార్థులు అమెరికాలో చదువుకునే, పరిశోధన చేసే అవకాశాలను తగ్గించడానికి ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థలుగా పరిగణించే అలీబాబా, బైదూ ఇంక్‌ లాంటి చైనా కంపెనీలను అమెరికన్ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ల నుంచి తొలగించేందుకు ఓ తీర్మానాన్ని అమెరికన్‌ సెనేట్‌ ఆమోదించింది. చైనా కంపెనీల డీలిస్టింగ్‌తో పాటు విదేశీ కంపెనీల ప్రాధాన్యతను తగ్గించేలా బిల్లును రూపొందించారు. అలాగే చైనా కంపెనీల్లో అమెరికన్ల నిధుల ప్రవాహానికి అడ్డుకట్ట వేసేలా ఈ కీలక బిల్లును ఆమోదించారు.

రిపబ్లికన్‌, డెమొక్రాట్‌ సెనేటర్లు జాన్‌ కెన్నెడీ, క్రిస్‌ వాన్‌ హాలెన్‌ ప్రతిపాదించిన బిల్లును యూఎస్‌ సెనేట్‌ ఏకగ్రీవంగా ఆమోదించింది. చైనా దిగ్గజ కంపెనీల్లో కోట్లాది డాలర్లను పెట్టుబడుల రూపంలో ప్రవహించడాన్ని చట్టసభ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పెన్షన్‌ ఫండ్‌లు, విద్యా సంస్ధల నిధులు సైతం ఆకర్షణీయ రాబడుల కోసం చైనా కంపెనీల్లో మదుపు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చైనా కంపెనీలను టార్గెట్‌ చేసుకొని ఈ బిల్లులో అనేక అంశాలను పొందుపరిచారు. విదేశీ కంపెనీలు వరుసగా మూడేళ్లు కంపెనీ ఆడిటింగ్‌ను పబ్లిక్‌ కంపెనీ అకౌంటింగ్‌ పర్యవేక్షక బోర్డు ఆడిట్‌ చేయకపోతే, ఆయా కంపెనీల షేర్లను ఎక్స్ఛేంజ్‌ల నుంచి నిషేధించేలా ఈ బిల్లును రూపొందించారు. స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ల్లో లిస్టయిన కంపెనీలన్నీ ఒకే ప్రమాణాలను కలిగిఉండాలని, ఈ బిల్లు ఆ ప్రమాణాలను తీసుకురావడంతో పాటు ఇన్వెస్టర్లు మెరుగైన నిర్ణయాలు తీసుకునేలా పారదర్శకత అందిస్తుందని మరో సెనేటర్‌ వాన్‌ హోలెన్‌ అన్నారు.

చైనా కంపెనీలపై కొరడా ఝళిపించే బిల్లును తీసుకురావడంతో జాక్‌మాకు చెందిన యాంట్‌ ఫైనాన్షియల్‌ నుంచి సాఫ్ట్‌బ్యాంక్‌కు చెందిన బైట్‌డ్యాన్స్‌ లిమిటెడ్‌ వంటి పలు చైనా కంపెనీల లిస్టింగ్‌ ప్రణాళికలకు విఘాతం కలిగింది. ఈ బిల్లుతో రానున్న రోజుల్లో అమెరికన్‌ స్టాక్‌ఎక్స్ఛేంజ్‌ల్లో లిస్టయిన చైనా కంపెనీలన్నింటికీ ఇబ్బందులు తప్పవని బీజింగ్‌కు చెందిన స్టాక్‌మార్కెట్‌ నిపుణులు, పోర్ట్‌ఫోలియో మేనేజర్లు అంచనా వేస్తున్నారు.
First published: May 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading