కరోనా దెబ్బకు అమెరికా మార్కెట్లు కుదేలయ్యాయి. S&P500 సూచీ 7 శాతం, నాస్డాక్ కంపోజిట్ 7.1 శాతం కుప్పకూలాయి. బెంచ్ మార్క్ డౌజోన్స్ ఇండస్ట్రీయిల్ యావరేజ్ 2000 పాయింట్లు కోల్పోయి 7.8శాతం నష్టపోయింది. చరిత్రలోనే భారీ నష్టాల నేపథ్యంలో న్యూయార్క్ మార్కెట్ ట్రేడింగ్‌ను నిలిపివేశారు. 2008 ఆర్థిక సంక్షోభం తరువాత ప్రపంచ వ్యాప్తంగా ఇదే అదిపెద్ద పతనంగా ఇదేనని నిపుణులు తెలిపారు. 15 నిమిషాలు పాటు ట్రేడింగ్ నిలిపివేశారు. ఆ తరువాత ట్రేడింగ్ తిరిగి ప్రారంభమైనా భారీ నష్టాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అమెరికాలో కరోనా కేసులు నమోదు కావడంతోపాటు, ట్రంప్ ను కలుసుకున్న ఇద్దరు సందర్శకులకు కరోనా పాజిటివ్ రావడంతో అమెరికన్ స్టాక్ మార్కెట్ సూచీలు కుదేలయ్యాయి. అలాగే చమురు ధరలు రికార్డు కనిష్టానికి చేరడంతో పాటు ఆసియా మార్కెట్లలోని భారీ పతనం కూడా ఈ పతనానికి కారణమైంది. మరోవైపు ఇంట్రాడేలో 2450 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ చివరికి 1942 నష్టంతో ముగిసింది. జపాన్ నిక్కీ 225 సూచీ 5శాతం, క్షీణించగా, ఆస్ట్రేలియా మార్కెట్లు 7.3 శాతం కుప్పకూలాయి. చైనాలో, షాంఘై కాంపోజిట్ బెంచ్ మార్క్ 3శాతం, పడిపోగా, హాంగ్ సెంగ్ ఇండెక్స్ 4.2 శాతం క్షీణించింది. విశ్లేషకులు అభివర్ణించారు. వైరస్ భయాలకు తోడు సౌదీ అరేబియా, రష్యా ట్రేడ్ వార్ కారణంగా చమురు ధర సోమవారం దాదాపు 30 శాతం క్షీణించి 31.14 డాలర్లకు చేరుకుంది. ఇది 1991లో గల్ఫ్ యుద్ధం ప్రారంభం తరువాత ఇదే అతిపెద్ద సింగిల్-డే పతనం.
Saudi Arabia and Russia are arguing over the price and flow of oil. That, and the Fake News, is the reason for the market drop!
— Donald J. Trump (@realDonaldTrump) March 9, 2020
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business, Stock Market