US H1B Visa : 2 లక్షలు దాటిన హెచ్1బీ వీసా అప్లికేషన్లు...లాటరీలో అదృష్టం వరించేది ఎవరికో...?

ఈ సంవత్సరం మొత్తం 2.01 లక్షల హెచ్ వన్ బీ వీసా అప్లికేషన్లు వచ్చాయి. గత సంవత్సరం కన్నా ఈసారి పది వేల అప్లికేషన్లు అధికంగా రావడం విశేషం. లాటరీ పద్ధతిలో మొత్తం 85 వేల హెచ్ 1 బీ వీసాలను జారీ చేయనున్నారు.

news18-telugu
Updated: April 12, 2019, 6:34 PM IST
US H1B Visa : 2 లక్షలు దాటిన హెచ్1బీ వీసా అప్లికేషన్లు...లాటరీలో అదృష్టం వరించేది ఎవరికో...?
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 12, 2019, 6:34 PM IST
యూఎస్ హెచ్ 1 బీ వీసాలపై నిర్వహించనున్న లాటరీ సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. గత సంవత్సరం కన్నా అధికంగా ఈ సంవత్సరం మొత్తం 2.01 లక్షల హెచ్ 1 బీ వీసా అప్లికేషన్లు వచ్చాయి. ఏప్రిల్ 1న చివరి తేదీగా ప్రకటించి స్వీకరించిన అప్లికేషన్లకు లాటరీ నిర్వహించనున్నట్లు అమెరికన్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, గత సంవత్సరం కన్నా ఈ సారి పది వేల అప్లికేషన్లు అధికంగా రావడం విశేషం. అమెరికాలోని వివిధ రంగాల్లో పనిచేసే ప్రొఫెషనల్స్ కోసం విదేశీయులకు ఇచ్చే వీసానే హెచ్ 1 బీ వీసాగా పరిగణిస్తారు. గతంలో హెచ్1బీ వీసాలను ధారళంగా ఇచ్చినప్పటికీ, ప్రస్తుతం మాత్రం ఈ తరహా వీసాలపై పరిమితి విధించడంతో విపరీతమైన కాంపిటీషన్ కు దారితీస్తోంది. ముఖ్యంగా ఈ వీసాపై భారతీయులే ఎక్కువగా హోప్స్ పెట్టుకున్నారు. ముఖ్యంగా అమెరికాలో మన దేశానికి చెందిన ఐటీ కంపెనీలు, స్థానిక అమెరికన్ల కన్నా మన దేశస్థులతోనే హెచ్ వన్ బీ వీసా కింద పనిచేయించుకునేందుకు ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో హెచ్ వన్ బీ వీసాలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఇదిలా ఉంటే గడిచిన రెండేళ్లలో హెచ్ వన్ బీ వీసా అప్లికేషన్ల సంఖ్య బాగా తగ్గినప్పటికీ, ఈ సంవత్సరం మాత్రం భారీగా అప్లికేషన్లు రావడం విశేషం.

ఇదిలా ఉంటే, ప్రతీ ఏడాది కేవలం 85 వేల హెచ్ వన్ బీ వీసాలను మాత్రమే అమెరికన్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ జారీ చేస్తోంది. ఇందులోనూ జనరల్ కోటా కింద 65 వేల హెచ్ వన్ బీ వీసాలను జారీచేస్తారు. అయితే మరో 20 వేల హెచ్ వన్ బీ వీసాలను మాస్టర్ క్యాప్ కింద పరిగణిస్తుంటారు. ఈ కేటగిరీలో అమెరికన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారికి ప్రత్యేక కేటాయింపు ఇస్తుంటారు. కాగా ఈ సంవత్సరం మాత్రం భారీగా అప్లికేషన్లు రావడంతో హెచ్ వన్ బీ వీసా అదృష్టం ఎవరిని వరించనుందో తేలాల్సి ఉంది.

First published: April 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...