భారతీయులకు ట్రంప్ షాక్...ఇకపై వారికి హెచ్1బీ వీసాలు నో...

హెచ్1బీ వీసాలను తొలగించిన కంపెనీల జాబితాలో అజిమెట్రీ ఇన్‌కార్పొరేషన్‌, బుల్‌మెన్‌ కన్సల్టెంట్‌ గ్రూప్‌ ఇన్‌కార్పొరేషన్‌, బిజినెస్‌ రిపోర్టింగ్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ ఇన్‌కార్పొరేషన్‌, నెటేజ్‌, కెవిన్‌ ఛాంబర్స్‌, ఇ-యాప్పైర్‌ ఐటీ ఎల్‌ఎల్‌సీ లాంటి తదితర కంపెనీలు ఉన్నట్లు సమాచారం.

news18-telugu
Updated: November 12, 2019, 3:57 PM IST
భారతీయులకు ట్రంప్ షాక్...ఇకపై వారికి హెచ్1బీ వీసాలు నో...
డొనాల్డ్ ట్రంప్
  • Share this:
ఓ వైపు భారత్-అమెరికా మధ్య సత్సంబంధాల కోసం మన దేశం పాటు పడుతుంటే, అటు ట్రంప్ సర్కారు మాత్రం ఇవేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. తాజాగా పలు భారతీయ ఐటీ కంపెనీలు హెచ్1బీ వీసాల ద్వారా పనిచేయించుకునే వెసులు బాటును తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో సదరు కంపెనీల్లో ఇకపై భారత్ నుంచి వచ్చి పనిచేసే ఉద్యోగులకు తలుపులు మూతపడ్డాయి. దీంతో ఆ కంపెనీలు కచ్చితంగా అమెరికన్లను మాత్రమే ఉద్యోగాల్లో తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హెచ్1బీ వీసాలను తొలగించిన కంపెనీల జాబితాలో అజిమెట్రీ ఇన్‌కార్పొరేషన్‌, బుల్‌మెన్‌ కన్సల్టెంట్‌ గ్రూప్‌ ఇన్‌కార్పొరేషన్‌, బిజినెస్‌ రిపోర్టింగ్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ ఇన్‌కార్పొరేషన్‌, నెటేజ్‌, కెవిన్‌ ఛాంబర్స్‌, ఇ-యాప్పైర్‌ ఐటీ ఎల్‌ఎల్‌సీ లాంటి తదితర కంపెనీలు ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే 2015 సంవత్సరంతో పోలిస్తే 2019లో తిరస్కరణకు గురైన హెచ్1బీ దరఖాస్తులు మూడురెట్లు పెరిగాయి. హెచ్‌-1బీ వీసా కలిగి ఉన్న వారి సంఖ్యలో దాదాపు 70 శాతం భారతీయులే ఉంటుండటం గమనార్హం.

First published: November 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>