Home /News /business /

URBAN INDIANS CONSIDERING TO SAVE MONEY FOR UNEXPECTED DIFFICULTIES REVEALS YOUGOV STUDY SS GH

Savings: పొదుపు విషయంలో పట్టణ ప్రజల అభిప్రాయం ఏంటంటే... సర్వేలో తేలింది ఇదే

Savings: పొదుపు విషయంలో పట్టణ ప్రజల అభిప్రాయం ఏంటంటే... సర్వేలో తేలింది ఇదే
(ప్రతీకాత్మక చిత్రం)

Savings: పొదుపు విషయంలో పట్టణ ప్రజల అభిప్రాయం ఏంటంటే... సర్వేలో తేలింది ఇదే (ప్రతీకాత్మక చిత్రం)

పట్టణాల్లో, నగరాల్లో నివసిస్తున్న ఏ ఐదుగురిని కదిలించినా వారిలో కనీసం ఇద్దరు అంటే 40శాతం మంది అనుకోని ఖర్చులు వస్తే కష్టం అన్న భయంతో పొదుపు మంత్రం జపిస్తున్నారు.

గ్రామాలతో పోల్చితే పట్టణాల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ. కానీ పట్టణాల్లో నివసించే చాలామంది కనీస అవసరాలతో సమానంగా కంఫర్టులపై అత్యధికంగా ఖర్చు చేస్తారు. అర్బన్ పాపులేషన్ లగ్జరీలపై వెచ్చించే మొత్తం చాలా ఎక్కువనే చెప్పాలి. కానీ ఇప్పుడిదంతా మారిపోయింది. కరోనా ధాటికి ప్రపంచవ్యాప్తంగా ప్రజల మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా మనదేశంలోని పట్టణ జనాభా ప్రతిపైసా ఆచితూచి ఖర్చుచేస్తోంది. దీంతో మారిన ఖర్చు అలవాట్ల కారణంగా కుటుంబం, పొదుపు చేయటాన్ని భారతీయులు అత్యంత ముఖ్యమైన అంశంగా ఎంచుకున్నట్టు తేలింది. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రజలు అంగీకరిస్తుండగా తాజాగా ఓ ఇంటర్నేషనల్ రిపోర్ట్ కూడా దీన్నే నిగ్గుతేల్చింది. 2021లో అర్బన్ ఇండియన్స్ ఏకైక లక్ష్యం ఫ్యామిలీలు బాగుండాలి, ఇందుకు అవసరమైన నిధులు జమచేసుకోవాలి.. అంతేనట. పట్టణాల్లో, నగరాల్లో నివసిస్తున్న ఏ ఐదుగురిని కదిలించినా వారిలో కనీసం ఇద్దరు అంటే 40శాతం మంది అనుకోని ఖర్చులు వస్తే కష్టం అన్న భయంతో పొదుపు మంత్రం జపిస్తున్నారు. గ్లోబల్ రీసర్చ్ ఫర్మ్ "యూగవ్" (YouGov) చేసిన రీసెర్చ్‌లో ఈ ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో పొదుపు పథకాలు, పెట్టుబడులపై వీరు తెగ రీసెర్చ్ చేస్తున్నారు కూడా.

ముందుచూపుతోనే


ఇక 35శాతం మంది అత్యవసర పరిస్థితుల్లో చిక్కుకుంటే బయటపడలేమన్న ముందుచూపుతో తమను, తమ కుటుంబాన్ని కాపాడుకునేందుకు పొదుపుతో రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆర్థిక భద్రతావలయంలో ఉంటేనే సురక్షితంగా మనగలమనే భావనలో ఉన్న భారతీయ పట్టణ జనాభా ఇందుకు పకడ్బందీ ప్రణాళికలు రచిస్తూ, వాటిని అమలుచేస్తోంది కూడా. 27శాతం మంది తమ ఆర్థిక కమిట్మెంట్లకు కట్టుబడి ఉండేలా కఠినంగా, ఆర్థిక క్రమశిక్షణతో జీవితాన్ని గడుపుతున్నారు. "ఆన్ ద మనీ: యూగవ్స్ గ్లోబల్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రిపోర్ట్ 2021”ను ఆన్ లైన్ సర్వే ద్వారా చేపట్టారు. నవంబర్ 2020 రెండో వారంలో 17 గ్లోబల్ మార్కెట్లలో ఈ సర్వే చేపడితే ఇందులో మొత్తం 19,000 మంది పాల్గొన్నారు. వీరిలో కనీసం వెయ్యి మంది భారతీయులు ఉన్నారు. ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అప్పులు తీర్చటం, రిటైర్మెంట్ ప్లాన్స్ ఈ ప్రాధాన్యతా క్రమంలో చిట్టచివరన ఉండటం.

డబ్బులు లేవా? అయినా Honda Activa 6G ఇంటికి తీసుకెళ్లండి... ఈ ఆఫర్ ఇంకొన్ని రోజులే

SBI ATM: అలర్ట్... ఏటీఎం కార్డు లేకుండా డబ్బులు డ్రా చేస్తున్నారా? ఈ విషయాలు తెలుసా?

స్మార్ట్ చాయిస్ గా ఇన్వెస్ట్మెంట్స్


కేవలం 22 శాతం మంది భారతీయులు మాత్రమే ఈ దిశగా ఆలోచిస్తున్నారు. ఆసియా దేశాల్లోని నగరాల్లో నివసిస్తున్న జనాభా అంతా పెట్టుబడులనే లక్ష్యంగా పెట్టుకొని ఎక్కడ పెట్టుబడులు పెట్టడం స్మార్ట్ చాయిస్ అని శోధించేస్తున్నారు. 2021లో మంచిగా పెట్టుబడులు పెట్టి మంచి రాబడులు పొందాలని కుస్తీపడుతున్న భారతీయ నగర జనాభా సంఖ్య 25శాతం పైమాటే. అయితే సొంతిల్లును వీరు పెద్దగా పట్టించుకోవటం లేదు పైపెచ్చు ప్రతి ఏడుగురిలో ఒకరు మాత్రమే అంటే అక్షరాలా 14శాతం మంది మాత్రమే ఈ ఏడాది ఎలాగైనా సొంతిల్లు కొనాలనే టార్గెట్ తో ఉన్నారు. దీంతోపాటు కారు, ఫర్నీచర్ కొనాలనే సరదా మనవారిలో ఎక్కువగా ఉందని సర్వే తేల్చటం హైలైట్. మిగతా దేశాలతో పోల్చితే మనవారికి ఇలాంటి లగ్జరీలపై కాస్త ఆసక్తి ఎక్కువే. మహమ్మారి రాకముందు ఎలా డబ్బును ఖర్చుపెట్టారో అలాగే భవిష్యత్తులో జరగాలని యూరోపియన్ దేశాల్లోని ప్రజలు ఆశపడుతుంటే భారతీయులు మాత్రం కేవలం 10శాతం కంటే తక్కువ మంది మాత్రమే ఇలా ఆలోచిస్తున్నారు. మిగతా వారంతా ఈ ఏడాది సేవింగ్సే ఏకైక లక్ష్యంగా దూసుకెళ్తున్నారు.

Gold Loan: గోల్డ్ లోన్‌కు అప్లై చేస్తున్నారా? ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి

Savings Accounts: ఈ బ్యాంకుల్లో మీకు సేవింగ్స్ అకౌంట్ ఉందా? మీకు లభించే వడ్డీ రేట్లను తెలుసుకోండి

అనవసర ఖర్చులకు కత్తెర


గత ఆరు నెలల్లో అనవసరం అనుకున్న ప్రతి ఖర్చును తగ్గించుకోవటంపై దృష్టి నిలిపినట్టు 49 శాతానికి పైగా భారతీయ పట్టణ ప్రజానికం వెల్లడించింది. అంతేకాదు ఏకంగా 32శాతం మంది ప్రజలు తాము గతంలోకంటే ఎక్కువ పొదుపు చేసినట్టు వివరించారు. దీంతో కొత్తగా అప్పులు తీసుకునేవారి సంఖ్య గతంతో పోల్చితే బాగా తగ్గింది. మొత్తానికి 77శాతం అర్బన్ పాపులేషన్ అనవసర ఖర్చులకు చెక్ పెడుతూ ఆ మొత్తాలను పొదుపుగా మార్చుకుంటున్నారు. భవిష్యత్తులోనూ ఇదే విధానాన్ని పాటించేలా వీరు మానసికంగా సన్నద్ధమయ్యారు కూడా. ఆసియా-పసిఫిక్ దేశాల్లో మూడింట రెండు వంతుల మంది ఇలా ఖర్చులు తగ్గించుకుని పొదుపు బాట పడుతున్నారు.

కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ లో టాప్


పేమెంట్ విధానానికి వస్తే భారతదేశంలోని నగర జనాభాలో కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ వైపు మొగ్గుచూపుతున్న వారు 73శాతం కంటే ఎక్కువ మందే ఉన్నారు. కానీ ప్రతి ఐదుగురిలో ఇద్దరు అంటే 39శాతం మంది మాత్రం నగదు చెల్లింపులపైనే ఇంకా ఆధారపడేందుకు ఇష్టపడుతున్నారు. యూరోపియన్ దేశాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తుండగా జర్మన్లు మాత్రం నగదు చెల్లింపులపైనే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. మెక్సికోలో అయితే 52 శాతం మంది నగదు మాత్రమే చెల్లిస్తున్నారు.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Investment Plans, Personal Finance, Save Money

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు