హోమ్ /వార్తలు /బిజినెస్ /

Helicopter Services: రండి బాబూ రండి.. బెంగళూరులో హెలికాప్టర్ బుకింగ్ సేవలు.. టికెట్ కాస్ట్ ఎంతంటే..

Helicopter Services: రండి బాబూ రండి.. బెంగళూరులో హెలికాప్టర్ బుకింగ్ సేవలు.. టికెట్ కాస్ట్ ఎంతంటే..

Helicopter Services: రండి బాబూ రండి.. బెంగళూరులో హెలికాప్టర్ బుకింగ్ సేవలు.. టికెట్ కాస్ట్ ఎంతంటే..

Helicopter Services: రండి బాబూ రండి.. బెంగళూరులో హెలికాప్టర్ బుకింగ్ సేవలు.. టికెట్ కాస్ట్ ఎంతంటే..

Helicopter Services: బెంగళూరు సిటీలో సూపర్‌ఫాస్ట్‌గా ట్రావెల్ చేసేందుకు హెలికాప్టర్ సర్వీసులను పరిచయం చేయాలని నిర్ణయించింది ఒక ఎయిర్ మొబిలిటీ కంపెనీ. కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎయిర్‌పోర్ట్‌ మధ్య హెలికాప్టర్‌ సర్వీసులు లాంచ్ చేస్తోంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఇండియాలోని ప్రముఖ నగరాల్లో రోడ్ ట్రాఫిక్ ఎంత అధికంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా బెంగళూరు (Bengaluru) నగరంలో బంపర్-టు-బంపర్ ట్రాఫిక్ నిత్యం ఉంటూనే ఉంటుంది. ఇలాంటి ట్రాఫిక్‌లో ప్రయాణాలు చాలా ఆలస్యంతో కూడుకున్నవి. అయితే ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు ఒక ఎయిర్ మొబిలిటీ ప్రొవైడర్ సిద్ధమైంది. బెంగళూరు సిటీలో సూపర్‌ఫాస్ట్‌గా ట్రావెల్ చేసేందుకు హెలికాప్టర్ (Helicopter) సర్వీసులను పరిచయం చేయాలని నిర్ణయించింది. ఈ కంపెనీ అక్టోబర్ 10 నుంచి కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (Kempegowda International Airport) నుంచి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) ఎయిర్‌పోర్ట్‌ మధ్య హెలికాప్టర్‌ సర్వీసులు లాంచ్ చేస్తోంది.

వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని ఫ్లై బ్లేడ్ (Fly BLADE) అనే అర్బన్ ఎయిర్ మొబిలిటీ కంపెనీ కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి HAL ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లే రూట్‌లో మొదటగా హెలికాప్టర్ సేవలను పరిచయం చేయనుంది. ఈ సర్వీసుతో ప్రయాణికులు ట్రాఫిక్‌లో 120 నిమిషాల ప్రయాణానికి బదులుగా కేవలం 15 నిమిషాల్లో హెలికాప్టర్ ద్వారా తమ గమ్యస్థానానికి చేరుకోవచ్చు. కెంపేగౌడ విమానాశ్రయం, HAL విమానాశ్రయం మధ్య 43 కి.మీ దూరం ఉంటుంది. ఈ రూట్‌లో సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9 గంటలకు ఒకటి, సాయంత్రం 4.15 గంటలకు ఇంకొకటి.. మొత్తంగా రెండు ట్రిప్స్ ఉంటాయి. ఈ ట్రిప్స్ పెరిగే అవకాశం ఉంది.

* ఛార్జీలు ఎంత?

హెలికాఫ్టర్ జర్నీ కోసం ఒక్కో ప్యాసింజర్‌కి వన్-వే టికెట్ ధర రూ.3,250గా కంపెనీ నిర్ణయించింది. ఈ టికెట్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఈ సర్వీస్ విండో సమయంలో ఎయిర్‌పోర్ట్ వద్దకు చేరుకోలేని వారు తమ బుకింగ్ క్యాన్సిల్ చేసుకోవచ్చు.

ఫ్లై బ్లేడ్ హెలికాప్టర్ సేవలు బెంగళూరులోని వైట్‌ఫీల్డ్, ఎలక్ట్రానిక్ సిటీలకు కూడా త్వరలోనే విస్తరించనున్నాయి. ఫ్లై బ్లేడ్ ఇండియా అక్టోబర్ లేదా నవంబర్‌లో ఎయిర్‌బస్ నుంచి H125 హెలికాప్టర్లను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తోంది. ఫ్లై బ్లేడ్ రెండు హెలికాప్టర్ల కోసం ఆర్డర్లు చేసిందని.. ఈ హెలికాప్టర్లలో ఐదుగురు నుంచి ఆరుగురు కూర్చునే సామర్థ్యం ఉంటుందని అమిత్ దత్తా మేనేజింగ్ డైరెక్టర్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : సికింద్రాబాద్ నుంచి తిరుపతి , నరసాపురానికి దసరా స్పెషల్ ట్రైన్లు.. బెంగళూరుకు కూడా.. పూర్తి వివరాలివే

* కంపెనీ గురించి..

ఫ్లైబ్లేడ్ ఇండియా అనేది హంచ్ వెంచర్స్, బ్లేడ్ ఎయిర్ మొబిలిటీ & ఈవ్ ఎయిర్ మొబిలిటీ మధ్య ఏర్పాటైన ఒక జాయింట్ వెంచర్. ఈ కంపెనీ మిగతా వాటితో కలిసి మంగళవారం నాడు స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ ప్రకటించింది. అలాగే 200 వరకు ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ వెహికల్స్, సర్వీస్, సపోర్ట్, ఈవ్స్ అర్బన్ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ (UATM) సాఫ్ట్‌వేర్ సొల్యూషన్‌ల నాన్-బైండింగ్ ఆర్డర్‌ను సైతం ప్రకటించింది. నిజానికి అంతర్జాతీయ విమానాశ్రయానికి హెలికాప్టర్ సేవలు గతంలోనే అందుబాటులోకి వచ్చాయి కానీ ఫైనాన్స్ చేసే వారు లేక ఆ సేవలు ఎంతో కాలం కొనసాగలేదు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Bengaluru, Helicopter, National News

ఉత్తమ కథలు