యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) సర్వర్ మొరాయించడంతో దేశ వ్యాప్తంగా యూపీఐ లావాదేవాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఖాతాదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) సర్వర్ మొరాయించడంతో దేశ వ్యాప్తంగా యూపీఐ లావాదేవాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఖాతాదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. దేశ వ్యాప్తంగా గంటకు పైగా పనిచేయకపోవడంతో దేశవ్యాప్తంగా ఆన్లైన్ చెల్లింపులకు అంతరాయం ఏర్పడింది. దేశంలో అత్యధిక మంది వినియోగదారులు వాడే PhonePe, Google Pay, Paytm ద్వారా మనీ ట్రాన్స్ఫర్లు నిలిచిపోయినట్లు ఖాతాదారులు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. లావాదేవీలు ప్రాసెస్ కావడం లేదని అనేక మంది వినియోగదారులు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. పేమెంట్స్ ప్రాసెసింగ్ చాలా సేపు అవుతుందని తెలిపారు. ప్రాసెసింగ్ తర్వాత చెల్లింపులు ఫెయిల్ అవుతున్నట్లు అనేక మంది సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదులు చేశారు. అయితే.. గంట తర్వాత సేవలను తిరిగి ప్రారంభమవ్వడంతో ఖాతాదారులు ఊపిరి పీల్చుకున్నారు. వివిధ చెల్లింపులకు ఈ రోజు ఆఖరి తేదీ కలిగిన వారు ఒక్క సారిగా యూపీఐ సర్వర్లు డౌన్ కావడంతో తీవ్ర కంగారుకు గురయ్యారు. అయితే సేవలు గంట వ్యవధిలో ప్రారంభం కావడంతో తిరిగి లావాదేవాలను నిర్వహించుకున్నారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.