Home /News /business /

UPI PAYMENTS SENSATIONAL DECISION NOW LINKING TO CREDIT CARDS THESE ARE THE BANKS UMG GH

UPI: క్రెడిట్ కార్డుకు యూపీఐ లింక్.. ఇక మొత్తం ఆ బ్యాంకుల పరిధిలోనే.. తప్పకుండా తెలుసుకోవాలి..!

 యూపీఐ పేమెంట్స్ సంచలన నిర్ణయం .. ఇక ఆ క్రెడిట్ కార్డులకు అనుసంధానం.. ఆ బ్యాంకులు ఇవే !

యూపీఐ పేమెంట్స్ సంచలన నిర్ణయం .. ఇక ఆ క్రెడిట్ కార్డులకు అనుసంధానం.. ఆ బ్యాంకులు ఇవే !

రూపే క్రెడిట్ కార్డ్‌లను యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) నెట్‌వర్క్‌కు అనుసంధానం చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన వివరాలను అధికార వర్గాలు తాజాగా వెల్లడించాయి.

రూపే(RuPay) క్రెడిట్ కార్డ్‌లను యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) నెట్‌వర్క్‌కు అనుసంధానం చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన వివరాలను అధికార వర్గాలు తాజాగా వెల్లడించాయి. దేశంలో రిటైల్ పేమెంట్స్‌ను పర్యవేక్షించే అధికారిక సంస్థ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI).. రూపే క్రెడిట్ కార్డ్‌లను యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) నెట్‌వర్క్‌కు అనుసంధానం చేయడాన్ని రెండు నెలల్లో ప్రారంభించాలని భావిస్తున్నట్లు చీఫ్ ఎగ్జిక్యూటివ్ దిలీప్ అస్బే శుక్రవారం తెలిపారు.

ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. ‘కార్డుల అనుసంధానం కోసం మేము బ్యాంక్ ఆఫ్ బరోడా(BOI), SBI, యాక్సిస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతున్నాం. మా ప్రతిపాదనను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)కు పది రోజుల్లో సమర్పించగలం. ఆర్బీఐ ఆమోదం పొందిన తర్వాత రెండు నెలల్లో ఈ ప్రిక్రియను ప్రారంభించగలం’ అని తెలిపారు. బ్యాంక్ ఆఫ్ బరోడా నిర్వహించిన ఒక ఈవెంట్‌లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయంపై స్పందించారు..

ఇదీ చదవండి: china-India tension: మిసైల్ పరీక్ష తో మరో కుట్రకు తెరలేపిన డ్రాగన్.. రాఫెల్ తో భారత్ దిమ్మతిరిగే సమాధానం..



ఈ ఏడాది జూన్‌లో క్రెడిట్ కార్డ్‌(Credit card)లను UPI సిస్టమ్‌కు లింక్ చేయడానికి RBI అనుమతించింది. దీనివల్ల స్వదేశీ పేమెంట్ నెట్‌వర్క్ జీరో మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ప్రయోజనాన్ని పొందవచ్చని నిపుణులు చెప్పారు. UPI పేమెంట్స్‌లో అసాధారణ వృద్ధికి జీరో-MDR విధానానికి సహాయపడిందని, వ్యాపారులు కార్డులకు బదులుగా UPI ద్వారా చెల్లింపులను ఇష్టపడటానికి కారణం ఇదేనని నిపుణులు తేల్చారు. MDR అనేది ఆఫ్‌లైన్ ట్రాన్సాక్షన్స్ కోసం మర్చంట్.. బ్యాంక్, కార్డ్ నెట్‌వర్క్, పాయింట్ ఆఫ్ సేల్ ప్రొవైడర్‌కు చెల్లించే ఛార్జీ, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ కోసం పేమెంట్ గేట్‌వేలకు చెల్లించే ఛార్జీ. క్రెడిట్ కార్డ్‌లపై MDR ప్రతి ట్రాన్సాక్షన్ విలువలో 2 నుంచి 3 శాతం మధ్య ఉంటుంది. ‘ప్రస్తుతం చిన్న వ్యాపారులను జాగ్రత్తగా చూసుకోవాలి. MDR నుంచి వారిని రక్షించాల్సి ఉంటుంది. అయితే ఎగ్జిస్టింగ్ క్రెడిట్ కార్డ్ సర్వీసింగ్ మర్చంట్స్ పేమెంట్స్‌ను కొనసాగించవచ్చు’ అని అస్బే చెప్పారు.



UPI, క్రెడిట్ కార్డ్‌ల ధరలలో తేడాల గురించి, ఈ రెండూ ఎలా సింక్ అవుతాయి అనే దాని గురించి గతంలో మాట్లాడారు RBI డిప్యూటీ గవర్నర్ T. రబీ శంకర్. జూన్‌లో ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. ధరల నిర్మాణాన్ని పరిశీలిస్తే తేడాలు తెలుస్తున్నాయని, RBI వీటి ధరలను పర్యవేక్షిస్తుందని తెలిపారు.
2020 జనవరి నుంచి UPI ట్రాన్సాక్షన్స్, అలాగే స్వదేశీ కార్డ్ నెట్‌వర్క్ రూపే ద్వారా జరిగే ట్రాన్సాక్షన్స్‌పై MDR ఛార్జీలను రద్దు చేశారు. అయితే ఈ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని పేమెంట్స్ ఇండస్ట్రీ ప్రభుత్వాన్ని కోరుతోంది.
Published by:Mahesh
First published:

Tags: BHIM UPI, Credit cards, RuPay, Upi payments

తదుపరి వార్తలు