హోమ్ /వార్తలు /బిజినెస్ /

UPI Lite Vs UPI 123 Pay: యూపీఐ లైట్, యూపీఐ 123 పే మధ్య తేడాలేంటి..? పనితీరు, బెనిఫిట్స్‌ తెలుసుకోండి..

UPI Lite Vs UPI 123 Pay: యూపీఐ లైట్, యూపీఐ 123 పే మధ్య తేడాలేంటి..? పనితీరు, బెనిఫిట్స్‌ తెలుసుకోండి..

UPI Lite Vs UPI 123 Pay: యూపీఐ లైట్, యూపీఐ 123 పే మధ్య తేడాలేంటి..? పనితీరు, బెనిఫిట్స్‌ తెలుసుకోండి..

UPI Lite Vs UPI 123 Pay: యూపీఐ లైట్, యూపీఐ 123 పే మధ్య తేడాలేంటి..? పనితీరు, బెనిఫిట్స్‌ తెలుసుకోండి..

UPI Lite Vs UPI 123 Pay: నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) ఇటీవల UPIకి చెందిన రెండు కొత్త వెర్షన్లను లాంచ్ చేసింది. అవే UPI లైట్, UPI 123Pay. రెండు వెర్షన్‌ల మధ్య తేడా ఏంటి? ఎలా పని చేస్తాయనే వివరాలు చూద్దాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఈ రోజుల్లో దాదాపు అన్ని ఫైనాన్షియల్‌ ట్రాన్సాక్షన్లు (Financial Transactions) ఆన్‌లైన్‌లో జరిగిపోతున్నాయి. ఇప్పుడు కొన్ని అవసరాలకు తప్ప బ్యాంకు బ్రాంచ్‌లకు వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం డిజిటల్‌ పేమెంట్స్‌ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) అత్యంత విస్తృతంగా ఉపయోగించే డిజిటల్ పేమెంట్‌ సిస్టమ్‌గా మారింది. సులువుగా, వేగంగా, సెక్యూర్‌గా ట్రాన్సాక్షన్లు పూర్తి చేసే సదుపాయాలను యూపీఐ అందిస్తుండటంతో ఎక్కువ మంది ప్రజలు ఈ పేమెంట్ మోడ్‌ను వినియోగిస్తున్నారు. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) ఇటీవల UPIకి చెందిన రెండు కొత్త వెర్షన్లను లాంచ్ చేసింది. అవే UPI లైట్, UPI 123Pay. రెండు వెర్షన్‌ల మధ్య తేడా ఏంటి? ఎలా పని చేస్తాయనే వివరాలు చూద్దాం.

* UPI 123 పే అంటే ఏంటి?

UPI 123 పే అనేది ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం తీసుకొచ్చిన ఇన్‌స్టంట్ పేమెంట్‌ సిస్టమ్‌. UPI 123 పే ద్వారా ఫీచర్ ఫోన్ వినియోగదారులు నాలుగు మార్గాలలో ట్రాన్సాక్షన్లను నిర్వహించవచ్చు. IVR (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్) నంబర్‌కు కాల్ చేయడం, ఫీచర్ ఫోన్‌లలో యాప్ యాక్టివిటీ, మిస్డ్ కాల్-బేస్డ్‌ అప్రోచ్‌, ప్రాక్సిమిటీ సౌండ్ బేస్డ్‌ పేమెంట్స్‌ ద్వారా పేమెంట్ పూర్తి చేయవచ్చు.

వినియోగదారులు IVR నంబర్ 6366 200 200కి కాల్ చేసి, 'పే టు మర్చంట్' ఆప్షన్‌ను ఎంచుకొని పేమెంట్స్‌ చేయవచ్చు. ఇక్కడ సౌండ్‌ వేవ్స్‌ ద్వారా పేమెంట్‌ జరుగుతుంది. లేదంటే కస్టమర్లు మర్చంట్ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు. వారు 08071 800 800 నంబర్ నుంచి తిరిగి కాల్ స్వీకరిస్తారు. ఇప్పుడు వారు UPI పిన్‌ను నమోదు చేయడం ద్వారా లావాదేవీని అథెంటికేట్‌ చేయవచ్చు, పేమెంట్‌ పూర్తి అవుతుంది.

మరో విధానంలో కస్టమర్లు ఏదైనా 080 4516 3666, 6366 200 200, 080 4516 3581 నంబర్లలో ఒక నంబర్‌కు కాల్ చేయవచ్చు. UPIని ఎనేబుల్ చేయడానికి సంబంధించిన ఫార్మాలిటీలను పూర్తి చేయవచ్చు. ఈ UPI యాప్‌లోని డిజిటల్ సొల్యూషన్‌ను ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌తో కలిసి గుప్‌షప్ అభివృద్ధి చేసింది. సి లాంగ్వేజ్‌లో రూపొందించిన పేమెంట్‌ యాప్‌ను ఎనేబుల్ చేయడానికి సొల్యూషన్ ప్రొవైడర్ OEM లేదా ఫీచర్ ఫోన్ మొబైల్ తయారీదారులతో భాగస్వామి అవుతుంది.

* UPI లైట్ అంటే ఏంటి?

UPI లైట్ అనేది ‘ఆన్-డివైస్ వాలెట్.’ దీన్ని ఉపయోగించడం కోసం, వినియోగదారులు ముందుగా తమ బ్యాంక్ ఖాతాల నుంచి యాప్ వాలెట్‌కు డబ్బును యాడ్‌ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్నెట్ లేకుండా కూడా రియల్‌టైమ్‌ పేమెంట్స్‌ చేయవచ్చు. UPI లైట్ ఫీచర్ ద్వారా UPI నెట్‌వర్క్‌లను వినియోగదారులు యాక్సెస్ చేయవచ్చు. అదే విధంగా ఫోన్‌ల ద్వారా బ్యాంక్ అకౌంట్స్ నుంచి నేరుగా డిజిటల్ పేమెంట్స్‌ చేసే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి : సామాన్యులకు భారీ ఊరట.. రూ.90కే వంట నూనె.. ధరలు ఇంకా తగ్గుతాయా?

కస్టమర్లు ముందుగా తమ బ్యాంక్ అకౌంట్స్ నుంచి యాప్‌కి (ఇంటర్నెట్ కనెక్టివిటీని ఉపయోగించి) అథెంటికేషన్‌(AFA) లేదా UPI ఆటోపే ద్వారా మనీ యాడ్‌ చేసుకోవాలి. దీనికి AFAని ఉపయోగించి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. యాప్‌లోని UPI లైట్ బ్యాలెన్స్ అనేది వర్చువల్ ‘ఆన్-డివైస్’ బ్యాలెన్స్ మాత్రమే. వినియోగదారులు యాడ్‌ చేసిన UPI లైట్ బ్యాలెన్స్‌ను చూపుతుంది.

మనీ యాడ్‌ చేసిన తర్వాత, UPI లైట్‌ని యాక్సెస్ చేయవచ్చు, ట్రాన్సాక్షన్లు నిర్వహించవచ్చు. ఈ ట్రాన్సాక్షన్లను నిర్వహించడానికి ప్రత్యేక ఆథరైజేషన్‌ లేదా UPI పిన్ అవసరం లేదు. ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా అవసరం లేదు. UPI లైట్ పేమెంట్‌ ద్వారా గరిష్టంగా రూ.200 పే చేయవచ్చు. ఆన్-డివైజ్ వాలెట్‌కు UPI లైట్ ద్వారా యాడ్‌ చేసే బ్యాలెన్స్ రూ.2,000కి మించకూడదు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Personal Finance, Transactions, UPI, Upi payments

ఉత్తమ కథలు