Home /News /business /

UPI FRAUD ALERT PEOPLE WHO ARE MAKING ONLINE PAYMENTS SHOULD FOLLOW THESE FIVE TIPS TO AVOID TRAPS AK GH

UPI Fraud Alert: ఆన్‌లైన్ పేమెంట్స్ చేసేవారికి అలర్ట్.. ఈ 5 జాగ్రత్తలు తీసుకోకపోతే మోసపోవడం ఖాయం...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆన్‌లైన్ పేమెంట్స్ చేసేవారు మోసగాళ్ల వలలో పడకుండా కొన్ని జాగ్రత్తలు ఫాలో కావాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా యూపీఐ పేమెంట్స్ యూజ్ చేసేటప్పుడు 5 జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

మోస్ట్ పాపులర్ ఆన్‌లైన్ పేమెంట్ మెథడ్స్‌లో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) టాప్ ప్లేస్‌లో ఉంటుందని చెప్పొచ్చు. దీని ద్వారా ఫాస్ట్ అండ్ చీపెస్ట్ వేలో మనీ ట్రాన్స్‌ఫర్ (Money Transfer) చేసుకోవచ్చు. అందుకే ఇది బాగా పాపులర్ అయింది. అలాగే యూపీఐ వాడే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బ్యాంకింగ్ మోసాలు (Banking Frauds) కూడా పెచ్చరిల్లుతున్నాయి. గత కొన్నేళ్లలో యూపీఐ యూజర్లు మోసగాళ్ల బారిన పడిన సంఘటనలు కోకొల్లలు. అయితే మోసగాళ్ల వలలో పడకుండా కొన్ని జాగ్రత్తలు ఫాలో కావాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా యూపీఐ పేమెంట్స్ యూజ్ చేసేటప్పుడు 5 జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

1) మోసగాళ్లు యూపీఐ యూజర్లను చీట్ చేసేందుకు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. వీరు ఏదైనా ప్రభుత్వ సంస్థ లేదా బ్యాంక్ లేదా ఏదైనా తెలిసిన కంపెనీకి చెందిన కస్టమర్ కేర్ సిబ్బందిలా మాట్లాడుతారు. వీరు కాల్ చేసి లేదా మెసేజ్‌ పంపి మీ యూపీఐ, దాని పిన్‌ని సెండ్ చేయాల్సిందిగా కోరుతారు. కానీ మీరు వాటిని ఎప్పుడూ షేర్ చేయకూడదు. వాస్తవానికి మీ బ్యాంకు లేదా ఇతర ఏ ప్రభుత్వ సంస్థలు మీ యూపీఐ పిన్‌ని ఎప్పటికీ అడగరు. ఈ కాల్‌లు చేసే మోసగాళ్లు ఏదో ఒక కారణం చెప్పి మిమ్మల్ని భయపడతారు. మీరు మీ అకౌంట్‌కు యాక్సెస్‌ను కోల్పోతారని లేదా యాప్‌లో ముఖ్యమైన అప్‌డేట్‌ చేసేందుకు మీ డివైజ్‌కు యాక్సెస్ ఇవ్వాలని నమ్మబలుకుతారు. వీరిని నమ్మి డీటెయిల్స్ ఇస్తే నిలువునా మోసపోయినట్లే. ఎవరైనా మీ పిన్‌ వివరాలను అడుగుతుంటే, ఆ కాలర్ మోసగాడు అని గుర్తించి అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది.

2) మీ బ్యాంక్ అకౌంట్‌లో లేదా యాప్‌లో కొన్ని ముఖ్యమైన సెట్టింగ్స్ అప్‌డేట్ చేయాలని లేదా మీ కేవైసీని అప్‌డేట్ చేయాలని కస్టమర్ కేర్ ప్రతినిధుల్లా కేటుగాళ్లు మాట్లాడతారు. వీరికి మీ మొబైల్ లేదా కంప్యూటర్‌కు ఎప్పుడూ యాక్సెస్ ఇవ్వకూడదు.

3) టెస్ట్ ట్రాన్సాక్షన్లు చేయడం ద్వారా రివార్డ్‌లు, క్యాష్‌బ్యాక్ పొందొచ్చని లేదా మనీ క్లెయిమ్ చేసుకోవచ్చని మిమ్మల్ని కొన్ని వెబ్‌సైట్‌లు అడగొచ్చు. కనీసం రూ.1 లావాదేవి జరిపినా ఈ రివార్డ్‌లు పొందవచ్చని ఈ వెబ్‌సైట్‌లు చెబుతాయి. అయితే దీనిలో పెద్ద స్కామ్ ఉంది. ఈ వెబ్‌సైట్‌ ఓనర్లు రూ.1 సెండ్ చేస్తే రూ.2 తిరిగి పంపిస్తారు. ఈ క్రమంలో వారు మీ యూపీఐ పిన్‌ని కలెక్ట్ చేస్తారు. అలా మీ పిన్‌ని యూజ్ చేసి మీ అకౌంట్ నుంచి మనీ మొత్తం విత్‌డ్రా చేస్తారు. అందుకే ఇలాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

Amazon: ఇక అమెజాన్‌లో మ‌రింత ఎంట‌ర్‌టైన్మెంట్‌.. త్వ‌ర‌లో కొత్త సబ్‌స్క్రిప్షన్ సర్వీస్

Kia Sonet: ఇండియ‌న్ మార్కెట్‌లోకి త్వ‌ర‌లో టాప్ క్లాస్ ఫీచ‌ర్స్‌తో.. సీఎన్‌జీ వేరియంట్ కార్‌

4) మోసపోకుండా ఉండాలంటే మీరు ప్రతి నెలా మీ యూపీఐ పిన్‌ని మారుస్తూ ఉండండి. అలా కాకపోతే మున్నేళ్లకోసారి అయినా పిన్‌ని చేంజ్ చేస్తే మీ అకౌంట్ సేఫ్‌గా ఉంటుంది.

5) మీరు యూపీఐ ద్వారా రోజువారీ ట్రాన్సాక్షన్లపై లిమిట్ కూడా సెట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఇతరులు మీ అకౌంట్ నుంచి డబ్బు విత్‌డ్రా చేసే ప్రమాదం తగ్గుతుంది.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: ONLINE CYBER FRAUD

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు