ఒకప్పుడు ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్‌కు డబ్బులు పంపడం అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. బ్యాంకుకు వెళ్లి, ఫామ్ ఫిల్ చేసి, క్యూలో నిలబడి డబ్బులు జమ చేస్తే కొన్ని గంటల తర్వాతో లేదా మరుసటి రోజు అవతలివారి అకౌంట్లోకి డబ్బులు వెళ్లేవి. కానీ ఇప్పుడు లక్షల రూపాయల లావాదేవీలు కూడా క్షణాల్లో జరిగిపోతున్నాయి. మనీ ట్రాన్స్ఫర్ విధానం పూర్తిగా మారిపోయింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్-UPI వచ్చిన తర్వాత మనీ ట్రాన్స్ఫర్ చాలా సులువైంది. అవతలివారికి యూపీఐ అకౌంట్ ఉంటే చాలు. క్షణాల్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-NPCI యూపీఐ విధానాన్ని రూపొందించింది. గూగుల్ పే, అమెజాన్ పే, ఫోన్ పే లాంటి ప్లాట్‌ఫామ్స్ అన్నీ యూపీఐ పేమెంట్స్ విధానాన్ని అందిస్తున్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
యూపీఐ పేమెంట్స్ సిస్టమ్‌లో అనేక ఫీచర్స్ ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి యూపీఐ ఆటోపే ఫీచర్. ఇటీవల ఎన్పీసీఐ యూపీఐ ఆటోపే ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. రికరింగ్ ఆన్లైన్ పేమెంట్స్‌ని సులభతరం చేసేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. అంటే మీరు ప్రతీ నెల ఏదైనా పేమెంట్ చేయాల్సి ఉంటే ఆటోపే ఫీచర్ ఎంచుకోవచ్చు. కస్టమర్లు ఇ-మ్యాండేట్ ద్వారా రూ.2,000 వరకు యూపీఐ ఆటో పే ఉపయోగించుకోవచ్చు. ఈ పేమెంట్స్‌కు యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ రూ.2,000 కన్నా ఎక్కువ చెల్లింపులకు ఆటో పే ఫీచర్ ఎంచుకుంటే మాత్రం కస్టమర్లు యూపీఐ పిన్ ఎంటర్ చేయల్సి ఉంటుంది.
Gold: భగ్గుమంటున్న బంగారం ధర... అయినా రూ.4,000 తక్కువకే కొనొచ్చు ఇలా
EPF Claim: ఈపీఎఫ్ అమౌంట్ క్లెయిమ్ చేసుకోలేదా? మీ డబ్బులు ఏమవుతాయంటే

ప్రతీకాత్మక చిత్రం
యూపీఐ ఆటో పే ఫెసిలిటీ ద్వారా కస్టమర్లు ఎలక్ట్రిసిటీ బిల్స్, ఫోన్ బిల్స్ చెల్లించొచ్చు. అంతే కాదు... అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్ లాంటి ఓటీటీ సబ్స్క్రిప్షన్స్, మెట్రో పేమెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్స్యూరెన్స్, ఈఎంఐ పేమెంట్స్ లాంటివాటికోసం కూడా యూపీఐ ఆటో పే ఫీచర్ వాడుకోవచ్చు. ప్రతీ నెల, మూడు నెలలకోసారి, ఆరు నెలలకోసారి, ఏడాదికోసారి జరిపే చెల్లింపులకు కస్టమర్లు రిమైండర్లు సెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఫెసిలిటీ వాడుకోవడానికి కస్టమర్లు యూపీఐ ఐడీ, క్యూఆర్ స్కాన్ ద్వారా ఇ-మ్యాండేట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఇ-మ్యాండేట్ క్రియేట్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేయొచ్చు. మాడిఫై చేయొచ్చు.
Personal Loan: లోన్ ఈజీగా రావాలంటే ఈ టిప్స్ ఫాలో అవండి
PF withdrawal: పీఎఫ్ విత్‌డ్రా చేయాలంటే ఈ 3 తప్పనిసరి

ప్రతీకాత్మక చిత్రం
ఇప్పటికే యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్ఎస్బీసీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, పేటీఎం లాంటి బ్యాంకులు, వ్యాలెట్ సంస్థలు యూపీఐ ఆటో పే ఫెసిలిటీని అందిస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యెస్ బ్యాంక్, జియో పేమెంట్స్ బ్యాంకు త్వరలో ఈ ఫీచర్ అందించనున్నాయి. యూపీఐ ఆటోపే ఫీచర్ ఎంచుకునే విషయంలో కస్టమర్లు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. సైబర్ మోసగాళ్లు నకిలీ యాప్స్, లింక్స్‌ను ఎస్ఎంఎస్, ఇమెయిల్స్ ద్వారా పంపి యూపీఐ ఆటోపే ఫీచర్ యాక్టివేట్ చేయిస్తున్న మోసాలు అనేకం బయటపడుతున్నాయి.