హోమ్ /వార్తలు /బిజినెస్ /

Upcoming Cars: మార్కెట్‌లోకి రాబోతున్న 6 కొత్త కార్లు ఇవే.. 35 కిలోమీటర్ల మైలేజ్‌, అదిరే ఫీచర్లు!

Upcoming Cars: మార్కెట్‌లోకి రాబోతున్న 6 కొత్త కార్లు ఇవే.. 35 కిలోమీటర్ల మైలేజ్‌, అదిరే ఫీచర్లు!

Upcoming Cars: మార్కెట్‌లోకి రాబోతున్న 6 కొత్త  కార్లు ఇవే.. 35 కిలోమీటర్ల మైలేజ్‌, అదిరే ఫీచర్లు!

Upcoming Cars: మార్కెట్‌లోకి రాబోతున్న 6 కొత్త కార్లు ఇవే.. 35 కిలోమీటర్ల మైలేజ్‌, అదిరే ఫీచర్లు!

New Cars | కొత్త కారు కొనేందుకు సిద్ధం అవుతున్నారా? అయితే ఇంకొంత కాలం వేచి చూడటం ఉత్తమం. అదిరే ఫీచర్లతో కొత్త కార్లు మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Cars | కొత్త కారు కొనాలనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీరు కొంత కాలం ఆగడం ఉత్తమం. ఎందుకంటే వచ్చే ఏడాదిలో అదిరిపోయే కార్లు (Cars) మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. అందువల్ల మీరు మీరు కొత్త కారు కొనాలని భావిస్తూ ఉంటే మాత్రం కొంత కాలం ఆగడం మంచిది. అదిరే ఫీచర్లతో మార్కెట్‌లోకి రాబోతున్న ఆరు కార్లు ఏంటివో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. వీటిల్లో మిడ్ సైజ్ ప్రీమియం ఎస్‌యూవీలు (SUV), ఎలక్ట్రిక్ కార్లు, హైబ్రిడ్ కార్లు, ఎంపీవీ వంటివి ఉన్నాయి.

ఎంజీ ఎయిర్ ఈవీ కారు 2023 తొలినాళ్లలో మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. తక్కువ ధరలో ఈ కారు మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వొచ్చు. ధర రూ. 8 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా ఉండొచ్చు. టాటా టియాగో ఈవీకి పోటీ ఇవ్వొచ్చు. మారుతీ సుజుకీ స్విఫ్ట్ కొత్త జనరేషన్ కారు కూడా మార్కెట్‌లోకి రానుంది. ఇది వచ్చే ఏడాది చివరిలో మార్కెట్‌లోకి రావొచ్చు. ఇందులో 1.2 లీటర్ హైబ్రిడ్ ఇంజిన్ ఉండనుంది. లీటరుకు 35 కిలోమీటర్ల మేర మైలేజ్ ఇవ్వొచ్చు.

డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. సామాన్యులకు గుడ్ న్యూస్? వారిపై ఎఫెక్ట్!

అలాగే హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కొత్త వెర్షన్ కారు కూడా మార్కెట్‌లోకి రానుంది. మారుతీ సుజుకీ స్విఫ్ట్‌కు ఇది మరింత పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. అప్‌డేటెడ్ ఫీచర్లతో వచ్చే ఏడాది ఈ కారు మార్కెట్‌లోకి రావొచ్చు. ఇంకా సిట్రోయెన్ సీ3 ఎలక్ట్రిక్ కారు మార్కెట్‌లోకి రానుంది. ఈ కారుతో కంపెనీ ఈవీ విభాగంలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ కారు రేంజ్ 300 కిలోమీటర్ల వరకు ఉండొచ్చు. 2023లో ఈ కారు రోడ్లపై పరుగులు పెట్టనుంది.

ఏటీఎం కార్డు ఉంటే ఉచితంగా రూ.10 లక్షల వరకు బెనిఫిట్.. వివరాలు ఇలా!

ఎలక్ట్రిక్ కారు విభాగంలో టాటా మోటార్స్ ఆధిపత్యం కొనసాగుతోంది. దీన్ని మరింత పదిలం చేసుకోవడానికి కంపెనీ అల్ట్రోజ్ ఈవీ వేరియంట్‌ను మార్కెట్‌లోకి తీసుకురాబోతోంది. 2023 మధ్య భాగంలో ఈ కారా మార్కెట్‌లోకి రావొచ్చు. ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్‌తో మార్కెట్‌లోకి రానున్న తొలి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు ఇదే కానుంది. ఇంకా టాటా టియాగో కారులో కొత్త వెర్షన్ మార్కెట్‌లోకి రానుంది. హ్యాచ్‌బ్యాక్ విభాగంలో ఇప్పటికే ఇది బెస్ట్ సెల్లింగ్ కారుగా కొనసాగుతోంది. వచ్చే ఏడాది చివరిలో ఈ కారులో అప్‌డేటెడ్ కొత్త వెర్షన్ మార్కెట్లోకి రానుంది. అందువల్ల మీరు కొత్తగా కారు కొనుగోలు చేయాలని భావిస్తే.. ఇంకొంత కాలం వేచి చూడటం ఉత్తమం. లేదంటే నచ్చిన కారును ఎప్పుడైనా కొనుగోలు చేయొచ్చు.

First published:

Tags: Cars, Hyundai, Maruti cars, Tata Motors

ఉత్తమ కథలు