హోమ్ /వార్తలు /బిజినెస్ /

New Bikes: పండుగ సీజన్ పైనే బైక్ కంపెనీల ఆశలు...కొత్త మోడల్స్ తో సిద్ధం...

New Bikes: పండుగ సీజన్ పైనే బైక్ కంపెనీల ఆశలు...కొత్త మోడల్స్ తో సిద్ధం...

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

అక్టోబరు, నవంబరు నెలలో అమ్మకాలు గతేడాదితో పోలిస్తే రెట్టింపు అయ్యే అవకాశాలున్నట్టు కంపెనీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై గత వారం జరిగిన ఆటో కంపోనెంట్ మార్కెట్ వార్షిక సమావేశంలో హీరో మోటార్స్ సీఎండీ పవన్ ముంజల్ మాట్లాడారు.

ఇంకా చదవండి ...

పండుగ సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో మోటర్ బైక్ కంపెనీలు కొత్త మోడళ్లతో మార్కెట్లోకి రానున్నాయి. దసరా, దీపావళి సీజన్లో బైక్ల అమ్మకాలు ఎనిమిది నుంచి 25శాతం వరకు పెరగొచ్చని కంపెనీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్స్, రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలు టార్గెట్ బయ్యర్లపై దృష్టి పెట్టాయి. గ్రామీణ, ద్వితీయ శ్రేణి పట్టణాల నుంచి ఎక్కువ ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంటడంతో ఇందుకు తగ్గ ప్రణాళికలతో కంపెనీలు పండుగ సీజన్లో పోటీ పడనున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే అమ్మకాలు మెరుగ్గా ఉండే అవకాశం ఉంది.

కరోనాకు ముందు నుంచే ఆటోమొబైల్ ఇండస్ట్రీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. దీనికి తోడు కరోనా ప్రభావంతో కొనుగోళ్లు కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఏడాది ప్రథమార్ధంలో కొత్త బైక్లు కొనాలనుకునేవారు లాక్డౌన్ కారణంగా వాయిదా వేసుకున్నారు. వినియోగదారులు అక్టోబరు, నవంబరులో పండగ డిస్కౌంట్లకోసం వేచిచూసే ధోరణిలో ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న బజాజ్, టీవీఎస్, ఎన్ ఫీల్డ్ కంపెనీలు కలిసి రానున్న మూడు నెలల్లో వరుసగా 1.62, 2, 1.6 మిలియన్ల యూనిట్లను మార్కెట్లోకి తీసుకురానున్నాయి.

అక్టోబరు, నవంబరు నెలలో అమ్మకాలు గతేడాదితో పోలిస్తే రెట్టింపు అయ్యే అవకాశాలున్నట్టు కంపెనీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై గత వారం జరిగిన ఆటో కంపోనెంట్ మార్కెట్ వార్షిక సమావేశంలో హీరో మోటార్స్ సీఎండీ పవన్ ముంజల్ మాట్లాడారు. సప్లై చైన్ సమస్యలపై అన్ని కంపెనీలు దృష్టి సారించాయని, డిమాండ్కు తగ్గట్టు మార్కెట్లోకి అన్ని కంపెనీలు ఉత్పత్తులను తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నాయని ఆయన వివరించారు. టూవీలర్ల అమ్మకాలు గత నెలతో పోలిస్తే సెప్టెంబరులో ఎనిమిది నుంచి 21శాతానికి చేరుకున్నట్లు మరో అధికారి తెలిపారు.

కొత్త ప్రణాళిక ప్రకారం హీరో గ్రూపు 7,20,000 నుంచి 7,30,000, టీవీఎస్ 2,80,000 నుంచి 3,00,000, రాయల్ ఎన్ఫీల్డ్ 60,000 నుంచి 65000 యూనిట్లు ఈ నెలలో తయారుచేయనున్నాయి. అక్టోబరు నాటికి హీరో 4,000,000 టీవీఎస్ 8,00,000 యూనిట్లను తయారు చేయనుంది. బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేశ్ శర్మ మాట్లాడుతూ... వచ్చే నెలలో తమ కంపెనీ ఉత్పత్తుల తయారీని 20నుంచి 25శాతం వరకు పెంచనున్నట్టు చెప్పారు. ప్రజలందరూ కరోనాకు అలవాటు పడ్డారని, ఇన్నిరోజులూ వేచిచూసిన వినియోగదారులు రానున్న నెలల్లో కొనుగోళ్లు చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అందుకు తగ్గట్టు తయారీ, డిమాండ్, సప్లై చెయిన్పై దృష్టిపెట్టామని వివరించారు.

First published:

Tags: Automobiles, Business, Cars

ఉత్తమ కథలు