• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • UPCOMING KIA SONET COMPACT SUV PRE BOOKINGS COMMENCES FROM TODAY AUGUST 20 AT RS 25000

Kia Sonet SUV ప్రీ బుకింగ్స్ ప్రారంభం..మార్కెట్‌లోకి ఎప్పుడంటే?

Kia Sonet SUV ప్రీ బుకింగ్స్ ప్రారంభం..మార్కెట్‌లోకి ఎప్పుడంటే?

కియా సొనెట్ ప్రీ బుకింగ్స్ ప్రారంభం

Kia Motors India: కియా మోటార్స్ ఇండియా త్వరలో ఎస్‌యూవీ సొనెట్‌(Kia Sonet)ను మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్స్‌ను ఇవాళ(గురువారం) నుంచి ప్రారంభిస్తున్నట్లు కియా ఓ ప్రకటలో తెలిపింది

  • Share this:
    కియా మోటార్స్ ఇండియా త్వరలో ఎస్‌యూవీ సొనెట్‌ను మార్కెట్‌లోకి తీసుకొస్తుండటం తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్స్‌ను ఇవాళ(గురువారం) నుంచి ప్రారంభిస్తున్నట్లు కియా మోటార్స్ ఇండియా ఓ ప్రకటలో తెలిపింది. దేశ వ్యాప్తంగా ఉన్న కియా డీలర్లు లేదా అధికారిక వెబ్‌సైట్‌లో రూ.25 వేలు చెల్లించి ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చని కియా ఓ ప్రకటనలో తెలిపింది. మారుతీ విటా బ్రెజా, హ్యుందాయ్ వెన్యూ తదితర మోడళ్లకు కియా సెనెట్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ కారును వచ్చే నెలలో అధికారికంగా మార్కెట్‌లోకి విడుదల చేయనున్నారు.ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో వినియోగదారుల అంచనాలను తగ్గ ఫీచర్లతో కియా సెనెట్ ఉంటుందని కియా మోటార్స్ ఇండియా ఎండీ, సీఈవో కూక్యున్ షిమ్ పేర్కొన్నారు.



    భారత్‌లో తయారవుతున్న కియా సెనెట్‌ను మొదటి విడతలో భారత వినియోగదారులకు మాత్రమే విక్రయించనున్నారు. రెండో విడతలో ఆఫ్రియా దేశాలు, లాటిన్ అమెరికా, ఆసియాలోని దాదాపు 70 దేశాలకు దీన్ని ఎగుమతి చేయనున్నారు.
    Published by:Janardhan V
    First published:

    అగ్ర కథనాలు