Home /News /business /

UPCOMING IPOS THE THREE COMPANIES TO BE LISTED ON THE STOCK MARKET THIS WEEK ARE WORTH RS 2387 CRORE GH VB

Upcoming IPOs: ఈ వారం స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ కానున్న మూడు కంపెనీలు.. వాటి వివరాలిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మరో మూడు కంపెనీలు వచ్చే వారం IPOకి రానున్నాయి. ఈ జాబితాలో పారదీప్ ఫాస్ఫేట్స్ (Paradeep Phosphates), ఎథోస్ (Ethos), ఈముద్ర (eMudhra) కంపెనీలు ఉన్నాయి. ఈ సంస్థలు IPO ద్వారా వచ్చే వారం ప్రైమరీ మార్కెట్‌ను తాకనున్నాయి.

భారత్‌లో ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌ల (IPO) హవా కొనసాగుతోంది. స్టాక్ మార్కెట్(Stock Marketing) లిస్టింగ్‌ కోసం పెద్ద కంపెనీలతో పాటు చిన్న కంపెనీలు(Companies) కూడా వరుస కడుతున్నాయి. ఇప్పటికే LIC IPO ప్రక్రియ పూర్తయింది. రేపు కంపెనీ షేర్ల లిస్టింగ్(Company Shares Listing) పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో మరో మూడు కంపెనీలు వచ్చే వారం IPOకి రానున్నాయి. ఈ జాబితాలో పారదీప్ ఫాస్ఫేట్స్ (Paradeep Phosphates), ఎథోస్ (Ethos), ఈముద్ర (eMudhra) కంపెనీలు ఉన్నాయి. ఈ సంస్థలు IPO ద్వారా వచ్చే వారం ప్రైమరీ మార్కెట్‌ను తాకనున్నాయి.

BSE వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, పారదీప్ ఫాస్ఫేట్స్ IPO కోసం సబ్‌స్క్రిప్షన్ 2022 మే 17న ఓపెన్ అవుతంది. Ethos IPO మే 18న, EMudhra IPO మే 20న ఓపెన్ కానున్నాయి. ఈ మూడు పబ్లిక్ ఇష్యూలు కలిసి దాదాపు రూ.2387 కోట్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. వీటిలో పారదీప్ ఫాస్ఫేట్స్ IPO సైజు రూ.1501 కోట్లు, ఎథోస్ IPO సైజు రూ.472 కోట్లు, ఈముద్ర IPO సైజు రూ.412 కోట్లుగా ఉంది. ఈ మూడు IPOలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు తెలుసుకుందాం.

* పారదీప్ ఫాస్ఫేట్స్ IPO
ఈ కంపెనీ ఒక యూరియాయేతర ఎరువుల తయారీ సంస్థ. రూ.1501 కోట్ల విలువైన కంపెనీ పబ్లిక్ ఇష్యూ 2022 మే 17న ఓపెన్ అవుతుంది. మే 19 వరకు బిడ్డింగ్ కొనసాగుతుంది. పారదీప్ ఫాస్ఫేట్స్ IPO ప్రైజ్ బ్యాండ్‌ రూ.39 నుంచి రూ.42 పర్ ఈక్విటీ షేర్‌గా ఉంది. బిడ్డర్ పబ్లిక్ ఇష్యూ కోసం లాట్లలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక లాట్ పారదీప్ ఫాస్ఫేట్స్ IPOలో 350 కంపెనీ షేర్లు ఉంటాయి. NSE, BSE రెండింటిలోనూ షేర్లు లిస్ట్ కానున్నాయి. IPO అలాట్‌మెంట్ మే 24న, లిస్టింగ్ మే 27న పూర్తి కానున్నాయి.

Career and Course: ఐఐఎంలో డిజిటల్ లీడర్‌షిప్‌పై కొత్త కోర్సు.. ప్రొఫెషనల్స్ కోసం పీజీ సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌

* ఎథోస్ IPO:
ఈ పబ్లిక్ ఇష్యూ మే 18న సబ్‌స్క్రిప్షన్ కోసం ఓపెన్ అవుతుంది. మే 20 వరకు సబ్‌స్క్రిప్షన్ కోసం అప్లై చేసుకోవచ్చు. రూ. 472 కోట్ల విలువైన ఈ పబ్లిక్ ఇష్యూ ప్రైస్ బ్యాండ్‌ను ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.836 నుంచి రూ.878గా నిర్ణయించారు. బిడ్డర్లు పబ్లిక్ ఇష్యూ కోసం లాట్లలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక లాట్‌లో 17 కంపెనీ షేర్లు ఉంటాయి. NSE, BSE రెండింటిలోనూ షేర్లు లిస్ట్ అవ్వడానికి పబ్లిక్ ఆఫర్‌ను ప్రతిపాదించారు. IPO అలాట్‌మెంట్ తేదీ మే 25 కాగా, లిస్టింగ్ తేదీని మే 30గా నిర్ణయించారు.

 eMudhra IPO:
ఈ కంపెనీ పబ్లిక్ ఇష్యూ మే 20న ఓపెన్ అవుతుంది. మే 24 వరకు సబ్‌స్క్రిప్షన్ కోసం అప్లై చేసుకోవచ్చు. రూ. 412 కోట్ల విలువైన ఈ పబ్లిక్ ఇష్యూ ప్రైస్ బ్యాండ్ ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 243 నుంచి రూ.256గా ఉంది. బిడ్డర్లు పబ్లిక్ ఇష్యూ కోసం లాట్లలో దరఖాస్తు చేసుకోవాలి. ఒక లాట్‌లో 58 కంపెనీ షేర్లు ఉంటాయి. NSE, BSE రెండిట్లోనూ లిస్టింగ్ కోసం పబ్లిక్ ఆఫర్ జరగనుంది. IPO అలాట్‌మెంట్ మే 27న, లిస్టింగ్ జూన్ 1న పూర్తి కానున్నాయి.
Published by:Veera Babu
First published:

Tags: IPO, LIC IPO, Stock Market

తదుపరి వార్తలు