Electric Vehicle | మీరు కొత్తగా స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే గుడ్ న్యూస్. ఎందుకంటే మార్కెట్లోకి కొత్త కొత్త స్కూటర్లు (Scooters) అందుబాటులోకి రానున్నాయి. దిగ్గజ బ్రాండ్లు అన్నీ ఎలక్ట్రిక్ స్కూటర్లను (Electric Scooters) మార్కెట్లోకి తీసుకురావడంపై ఫోకస్ చేశాయి. ఇప్పటికే హీరో కంపెనీ తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ విదా (Vida) ఇటీవలనే మార్కెట్లోకి తీసుకువచ్చింది.
హోండా కంపెనీ కూడా త్వరలోనే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకురావడానికి రెడీ అవుతోంది. యాక్టివా బ్రాండ్ కింద వీటి అమ్మకాలు ప్రారంభం కావొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఒక్కసారి చార్జ్ చేస్తే ఈ స్కూటర్ 100 కిలోమీటర్లు వెళ్లొచ్చని తెలుస్తోంది. ఈ స్కూటర్ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 1.15 లక్షలుగా ఉండొచ్చు.
ఎక్కువగా ఉన్న బ్యాంక్ అకౌంట్లను క్లోజ్ చేయాలనుకుంటున్నారా? ఈ 5 విషయాలు మరువొద్దు!
యమహా కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేయడానికి సిద్ధం అవుతోంది. దీని పేరు నియో. ఈ యమహా నియో స్కూటర్ 2023 తొలినాళ్లలో మార్కెట్లోకి రావొచ్చు. దీని రేటు రూ. 1.25 లక్షల నుంచి రూ. 1.3 లక్షల దాకా ఉండొచ్చు. ఇది ఏథర్ 450 ఎక్స్ వంటి మోడళ్లకు పోటీ ఇవ్వనుంది.
సుజుకీ కంపెనీ తన బర్గ్‌మన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇటీవలనే టెస్ట్ చేసింది. త్వరలోనే ఈ ఇస్కూటర్ మార్కెట్లోకి రావొచ్చు. మోస్ట్ అగ్రెసివ్ లుక్‌తో వస్తున్న స్కూటర్ ఇది. ఈ స్కూటర్‌కు సంబంధించి ఇతర విషయాలు ఏమీ తెలీదు. అయితే ఒక్కసారి చార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు వెళ్లే అవకాశం ఉంటుంది.
బ్యాంకులకు ఈ వారంలో 4 రోజులు సెలవులు.. ఏ ఏ ప్రాంతాల్లో ఎప్పుడెప్పుడు పని చేయవంటే?
ఇంకా టీవీఎస్ కూడా మరో ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకురావడంపై ఫోకస్ చేసింది. కంపెనీ ఇప్పటికే ఐక్యూబ్ స్కూటర్ తెచ్చింది. ఐక్యూబ్లోనే కొత్త మోడల్ లాంచ్ చేసే అవకాశం ఉంది. 2023 చివరిలో ఈ స్కూటర్ మార్కెట్లోకి రావొచ్చు. ఈ స్కూటర్ ఒక్కసారి చార్జ్ చేస్తే 140 కిలోమీటర్ల దూరం ప్రయాణించే అవకాశం ఉంది.
ఇక చివరిగా బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా మార్కెట్లోకి రానుంది. కంపెనీ ఇప్పటికే బజాజ్ చేతక్ రూపంలో ఇ- స్కూటర్ తెచ్చింది. అయితే ఇందులో కీలకమైన అప్డేట్తో కొత్త మోడల్ మార్కెట్లోకి రానుంది. కొత్త లుక్, అదిరే ఫీచర్లు, లాంగ్ రేంజ్‌తో కంపెనీ సరి కొత్త స్కూటర్ లాంచ్ కానుంది. అంతేకాకుండా ఈ కంపెనీ ఇంకా అందుబాటు ధరలో తక్కువ బ్యాటరీ కెపాసిటీతో మరికొన్ని మోడళ్లను లాంచ్ చేసే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Electric Scooter, Electric Vehicles, Ev scooters, Ola Electric Scooter