మీరు కొత్త కారు కొనాలనుకుంటున్నారా..? ఈ ఫెస్టివల్ సీజన్లో(Festival Season) మార్కెట్లోకి వచ్చిన కార్లు ఏవీ నచ్చలేదా..? అయితే మీకు ఒక గుడ్ న్యూస్. నవంబర్ నెలలో టాప్ బ్రాండ్స్(Top Brands) నుంచి సరికొత్త కార్లు మార్కెట్లోకి రానున్నాయి. మీ బడ్జెట్ ప్రకారం వీటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. ఈ నెలలో ఇండియన్ మార్కెట్లో లాంచ్ కానున్న మోడల్స్ ఇవే..
* MG హెక్టర్ ఫేస్‌లిఫ్ట్
ఈ కారు నవంబర్ చివరి నాటికి ఇండియాలో లాంచ్ కానుంది. 14 అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్, ADAS, ఇతర అడ్వాన్స్డ్ ఫీచర్లతో ఈ కారు రానుంది. అయితే మెకానిక్స్ పరంగా చూస్తే, ప్రస్తుతం ఉన్న హెక్టర్, హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ ఎడిషన్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. కొత్త మోడల్ లాంచ్ అయ్యాక, పాత మోడల్ కూడా మార్కెట్లో కొనసాగుతుందని కంపెనీ తెలిపింది. ఇండియాలో దీని ధర రూ.14.49 లక్షల నుంచి రూ. 20.99 లక్షల మధ్య ఉండవచ్చు.
* టయోటా ఇన్నోవా హైక్రాస్
ఈ కారును టయోటా కంపెనీ నవంబర్ చివరి నాటికి రిలీజ్ చేయనుంది. టయోటా నుంచి వస్తున్న ఈ మూడు వరుసల MPV, ఇతర దేశాల్లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. ఇన్నోవా హైక్రాస్ కారు నేచురల్లీ యాస్పైర్డ్ పెట్రోల్, పెట్రోల్ హైబ్రిడ్ యూనిట్‌తో వచ్చే అవకాశం ఉంది. ఇండియాలో ఇన్నోవా హైక్రాస్ (Innova Hycross) ధర రూ.20 లక్షల నుంచి రూ. 25 లక్షల మధ్య ఉండవచ్చు.
* జీప్ గ్రాండ్ చెరోకీ
గ్రాండ్ చెరోకీ కారు నవంబర్ 11న భారత్‌లో లాంచ్ కానుంది. దీని ధర రూ.75 లక్షల నుంచి రూ.1.15 కోట్ల మధ్య ఉంటుంది. జీప్ కంపెనీ నుంచి రానున్న ఈ సరికొత్త ఫ్లాగ్షిప్ SUV.. రాంగ్లర్, కంపాస్, మెరిడియన్ తర్వాత కంపెనీ స్థానికంగా అసెంబుల్ చేసిన నాలుగో మోడల్. కొత్త మోడల్ 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో, 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. ఫోర్ వీల్ డ్రైవ్, టెర్రైన్ మోడ్స్, ఇతర స్పెసిఫికేషన్లతో కస్టమర్లను ఆకట్టుకోనుంది.
* ప్రవైగ్ ఎలక్ట్రిక్ SUV
బెంగళూరుకు చెందిన స్టార్టప్ ప్రవైగ్ (Pravaig), నవంబర్ 25న ఎక్స్‌టింక్షన్ (Extinction) ఎలక్ట్రిక్ సెడాన్‌ను ఆవిష్కరించనుంది. 2020లో మొదటిసారి ప్రదర్శించిన ఈ వెహికల్ ఈ నెలలోనే మార్కెట్లోకి రానుంది. ప్రవైగ్ EV SUV పవర్ట్రైన్ వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే ఇది 500km కంటే ఎక్కువ రేంజ్, 200kph కంటే ఎక్కువ వేగంతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ స్పెసిఫికేషన్లతో రానున్నట్లు కంపెనీ పేర్కొంది.
* BYD Atto 3
చైనీస్ ఆటో మొబైల్ కంపెనీ BYD (బిల్డ్ యువర్ డ్రీమ్స్) ఇటీవల ఇండియాలో అట్టో 3 (Atto 3) మోడల్‌ను ఆవిష్కరించింది. ఈ EV SUV ధరలను కంపెనీ ఈ నెలలో ప్రకటించనుంది. ఇది BYD నుంచి ఇండియాలో రిలీజ్ కానున్న రెండో మోడల్. అట్టో 3 ఎలక్ట్రిక్ ఎస్యూవీ 60.48kWh బ్యాటరీతో వస్తుంది. ఇది ఏకంగా 521km డ్రైవింగ్ రేంజ్ అందిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.