హోమ్ /వార్తలు /బిజినెస్ /

Upcoming Cars: జూన్‌లో మార్కెట్లోకి రానున్న కొత్త కార్లు.. కార్ లవర్స్‌ను ఆకర్షిస్తున్న మోడల్స్ ఇవే..

Upcoming Cars: జూన్‌లో మార్కెట్లోకి రానున్న కొత్త కార్లు.. కార్ లవర్స్‌ను ఆకర్షిస్తున్న మోడల్స్ ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ ఏడాది ప్రారంభం నుంచి కార్ల తయారీ సంస్థలు వరుసగా ఇండియాలో కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. 2022 జూన్‌లో కూడా కొత్త కార్లు రిలీజ్ కానున్నాయి. వీటిలో సెడాన్‌లు, SUVలు, ఇతర వేరియంట్లు ఉన్నాయి. వచ్చే నెలలో రానున్న కొత్త కార్లు ఏవో చూద్దాం.

ఇంకా చదవండి ...

ఈ ఏడాది ప్రారంభం నుంచి కార్ల తయారీ సంస్థలు వరుసగా ఇండియాలో కొత్త మోడళ్లను మార్కెట్లోకి(Market) విడుదల చేస్తున్నాయి. 2022 జూన్‌లో(June) కూడా కొత్త కార్లు రిలీజ్(New Cars Release) కానున్నాయి. వీటిలో సెడాన్‌లు, SUVలు, ఇతర వేరియంట్లు(Variants) ఉన్నాయి. వచ్చే నెలలో రానున్న కొత్త కార్లు ఏవో చూద్దాం. అందులో మొదటిది Hyundai Venue facelift.. మిడ్-లైఫ్ సైకిల్ రిఫ్రెష్‌లో(Refresh) భాగంగా హ్యుందాయ్ (Hyundai)వెన్యూ ఫేస్‌లిఫ్ట్ ఎడిషన్‌ను జూన్ మధ్యలో రిలీజ్ చేస్తోంది. సరికొత్త ఫ్రంట్ ఎండ్ డిజైన్, ఇంటీరియర్‌ మేక్ఓవర్ వంటి మార్పులతో ఈ కారు రావచ్చు. కొత్త టక్సన్ SUV, ఓవర్సీస్-సేల్డ్ పాలిసేడ్ ద్వారా స్ఫూర్తి పొందిన స్టైలింగ్‌తో వెన్యూ ఫేస్‌లిఫ్ట్ ఎడిషన్‌ను డిజైన్ చేశారు. ఇది 120hp, 1.0-లీటర్ టర్బో-పెట్రోల్‌; 115hp, 1.2-లీటర్ పెట్రోల్; 115hp, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్లతో రావచ్చని భావిస్తున్నారు.

* Volkswagen Virtus

ఈ కారును వోక్స్ వ్యాగన్ మార్చిలో ఆవిష్కరించింది. వర్టస్ మోడల్‌ను కంపెనీ జూన్ 9న విడుదల చేయనుంది. ఈ మోడల్‌కు వోక్స్ వ్యాగన్ డైనమిక్ లైన్, పర్ఫార్మెన్స్ లైన్ అనే రెండు ట్రిమ్‌లలో అందించనుంది. ఈ రేంజ్‌లో వర్టస్ అత్యంత శక్తివంతమైన సెడాన్ అని చెప్పుకోవచ్చు.

* Next-gen Maruti Suzuki Brezza

ఈ కారు జూన్ చివరి వారంలో రిలీజ్ కావచ్చు. మారుతి సుజుకి సరికొత్త బ్రెజ్జా ధరలను జూన్ చివరి నాటికి ప్రకటిస్తుంది. ఈ కాంపాక్ట్ SUV కొత్త, మెరుగైన ఇంటీరియర్ ఫీచర్లతో రానుంది. ఎర్టిగా, XL6 వేరియంట్లలో ఉండే 1.5-లీటర్ K15C DualJet ఇంజిన్‌తో రానుంది. ఇది 100bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా కొత్త 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్‌తో వస్తుంది.

* Lexus LX500d

లెక్సస్ ఫ్లాగ్‌షిప్ LX SUV, LX500dను త్వరలో ఇండియాలో రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. టయోటా ల్యాండ్ క్రూయిజర్ LC300 మోడల్‌ మాదిరిగా TNGA-F బాడీ-ఆన్-ఫ్రేమ్ ఆర్కిటెక్చర్ వంటి ఫీచర్లతో ఈ కారు కనిపిస్తోంది. SUV 3.3-లీటర్ ట్విన్-టర్బో V6 డీజిల్ ఇంజిన్‌తో 10-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో రావచ్చు. ఇది 303bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Axis Bank: కస్టమర్లకు షాక్ ఇచ్చిన యాక్సిస్ బ్యాంక్.. సర్వీస్ ఛార్జీలు భారీగా పెంపు.. కొత్త ఛార్జీల వివరాలు..


* Kia EV6

ఈ ఎలక్ట్రిక్ కారు జూన్ 2న మార్కెట్లోకి రానుంది. ఈ ఫ్లాగ్‌షిప్ క్రాస్‌ఓవర్.. లైట్, విండ్, GT లైన్, GT వంటి నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇది 58kWh బ్యాటరీతో లేదా 77.4kWh బ్యాటరీతో రానుంది. ఇవి 320bhp పవర్, 605 Nm టార్క్ అవుట్‌పుట్‌తో వస్తుంది. కియా EV6 WLTP 500కిమీ డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుంది.

* Mahindra Scorpio-N

ఇటీవల మహీంద్రా కొత్త స్కార్పియో-ఎన్‌ ఫోటోలను అధికారికంగా రిలీజ్ చేసింది. ప్రస్తుత స్కార్పియో కూడా కొత్త మోడల్‌తో పాటు మార్కెట్లో కొనసాగుతుంది. స్కార్పియో N.. థార్, XUV700 వేరియంట్లలో వచ్చిన 2.0-లీటర్ mStallion టర్బో-పెట్రోల్ ఇంజన్, 2.2-లీటర్ mHawk టర్బో-డీజిల్ ఇంజిన్‌లతో వచ్చే అవకాశం ఉంది.

First published:

Tags: Kia cars, Mahindra and mahindra, New cars, Volkswagen

ఉత్తమ కథలు