హోమ్ /వార్తలు /బిజినెస్ /

Upcoming Cars: హోండా సిటీ హైబ్రిడ్ నుంచి జీప్ మెరిడియన్ వరకు.. మే నెలలో విడుదల కానున్న కార్లు ఇవే..

Upcoming Cars: హోండా సిటీ హైబ్రిడ్ నుంచి జీప్ మెరిడియన్ వరకు.. మే నెలలో విడుదల కానున్న కార్లు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ గ్రాఫ్ గత కొన్ని నెలలుగా పెరుగుతోంది. గత కొన్ని నెలలుగా వివిధ విభాగాల్లో కొన్ని ముఖ్యమైన కార్లు లాంచ్‌ అవుతున్నాయి. ఈ లిస్ట్‌లో కొన్ని టాప్ బ్రాండ్ల నుంచి బెస్ట్ మోడల్స్ ఉన్నాయి. రానున్న మే నెలలో కూడా మరికొన్ని కంపెనీల నుంచి కార్లు రిలీజ్ కానున్నాయి. అవేంటో చూద్దాం.

ఇంకా చదవండి ...

ఇండియన్ ఆటోమొబైల్(Indian Auto Mobile) ఇండస్ట్రీ గ్రాఫ్ గత కొన్ని నెలలుగా పెరుగుతోంది. గత కొన్ని నెలలుగా వివిధ విభాగాల్లో కొన్ని ముఖ్యమైన కార్లు లాంచ్‌ అవుతున్నాయి. ఈ లిస్ట్‌లో కొన్ని టాప్ బ్రాండ్ల(Top Brands) నుంచి బెస్ట్ మోడల్స్(Best Models) ఉన్నాయి. రానున్న మే నెలలో కూడా మరికొన్ని కంపెనీల నుంచి కార్లు రిలీజ్ కానున్నాయి. అవేంటో చూద్దాం.

మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్ (Mercedes-Benz C-Class)

మెర్సిడెస్ బెంజ్ కొత్త C-క్లాస్ వేరియంట్‌ను మే 10న లాంచ్ చేయనుంది. ఇప్పటికే సరికొత్త C-క్లాస్ కోసం బుకింగ్స్ ప్రారంభించింది. ఈ కారు C200, C220d, C300d అనే మూడు వేరియంట్లలో రానుంది. ఇండియాలో కొత్త బెంజ్ C-క్లాస్ 3 ఇంజన్ ఆప్షన్స్‌లో రానుంది. స్టాండర్డ్‌గా అన్ని పవర్‌ట్రెయిన్‌లలో 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉంటుంది. దీని ధర రూ. 53 లక్షల నుంచి ప్రారంభం కావచ్చు.

హోండా సిటీ హైబ్రిడ్ (Honda City Hybrid)

ఈ కారును 2022 ఏప్రిల్ 14న ఆవిష్కరించారు. ఇది మే నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. హోండా సిటీ ఇ: HEV (Honda City e: HEV) పేరుతో రానున్న ఈ ఇండియన్ మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్‌ సెల్ప్-ఛార్జింగ్ హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తుంది. హోండా సిటీ హైబ్రిడ్ 1.5-లీటర్ DOHC i-VTEC పెట్రోల్ ఇంజన్‌తో రానుంది. ఇది డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్ల ద్వారా శక్తిని పొందుతుంది. నేచురల్లీ యాస్పైర్డ్ 4-సిలిండర్ల అట్కిన్సన్ ఇంజన్ 98 bhp పవర్‌ను, 127 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. డ్యుయల్-ఎలక్ట్రిక్ మోటార్లతో కలిపి ఈ కారు 126 bhp పవర్‌ను, 253 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హైబ్రిడ్ సెటప్ eCVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. సిటీ హైబ్రిడ్ వేరియంట్ సగటున 26.5 kmpl ఫ్యూయెల్ కెపాసిటీని అందిస్తుందని హోండా పేర్కొంది.

అయ్యయ్యో శుభమా అని శుభకార్యానికి వస్తే.. వీడెక్కడ దాపురించాడమ్మా నీకు.. ఎంత ఘోరం తప్పింది.

* జీప్ మెరిడియన్ (Jeep Meridian)

జీప్ ఇండియా ఇటీవలే ఇండియన్ మార్కెట్లో సెవెన్-సీటర్ మెరిడియన్ SUVని ఆవిష్కరించింది. దీని ప్రీ-బుకింగ్స్ మే 3న ప్రారంభమవుతాయి. జీప్ మెరిడియన్ SUV.. జీప్ కంపాస్‌కు అప్‌డేటెడ్ వెర్షన్. ఇది 4x2, 4x4 డ్రైవింగ్ కాన్ఫిగరేషన్‌లతో రానుంది. ఈ SUV కంపాస్ మాదిరిగానే ఇంటిగ్రేటెడ్ DRLలతో కూడిన LED హెడ్‌ల్యాంప్‌లు, సెవెన్-స్లాట్ గ్రిల్, పెద్ద ఎయిర్ ఇన్‌టేక్‌తో కూడిన మస్కులర్ ఫ్రంట్ బంపర్, LED ఫాగ్ ల్యాంప్స్, ఇండికేటర్‌లతో కూడిన సైడ్ క్లాడింగ్‌తో వస్తుంది. జీప్ మెరిడియన్ 2.0-లీటర్ 4-సిలిండర్ టర్బో డీజిల్ ఇంజన్‌తో 172 bhp పవర్‌ను, 350 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. జీప్ మెరిడియన్ ధర రూ.19 లక్షల నుంచి రూ.33 లక్షల వరకు ఉండవచ్చని అంచనా.

* హ్యుందాయ్ టక్సన్ (Hyundai Tucson)

హ్యుందాయ్ కంపెనీ కొత్త హ్యుందాయ్ టక్సన్‌ను 2022లో భారత మార్కెట్‌లో విడుదల చేసే అవకాశం ఉంది. కొత్త టక్సన్ 2.0-లీటర్ డీజిల్ ఇంజన్, 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్.. 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్‌తో రానున్నాయి. టక్సన్ LED DRLలతో కూడిన కొత్త గ్రిల్, 19-అంగుళాల అల్లాయ్ వీల్స్, కొత్త హెడ్‌ల్యాంప్‌లు వంటి స్పెసిఫికేషన్లతో రానుంది. ఈ కారులో లెవెల్ 1 అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీ అంతర్జాతీయ మార్కెట్‌లలో అందుబాటులో ఉంది.

Important Dates: ఈ ఆర్థిక సంవత్సరంలో మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన తేదీలు ఇవే

కియా EV6 (Kia EV6)

ఆల్-ఎలక్ట్రిక్ కియా EV6 కారును గత ఏడాది మార్చిలోనే ఆవిష్కరించారు. అయితే ఈ ఏడాది మే నెలలో కియా దీన్ని లాంచ్ చేయనుంది. ఫస్ట్ కియా ఎలక్ట్రిక్ కారును మే 26, 2022న కంపెనీ రిలీజ్ చేస్తోంది. E-GMP EV ప్లాట్‌ఫారమ్‌పై డిజైన్ చేసిన EV6.. CBU యూనిట్‌గా ఇండియాను రానుంది. ఈ వేరియంట్‌ను 100 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. ఇండియాలో కియా EV6 ధర రూ. 62 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్) ప్రారంభం కావచ్చు.

First published:

Tags: Honda, Jeep, Mercedes-Benz, New cars

ఉత్తమ కథలు