హోమ్ /వార్తలు /బిజినెస్ /

కొత్త బైక్ కొంటున్నారా...అయితే బెస్ట్ మోడల్స్ ఇవే...ఓ లుక్కేయండి...

కొత్త బైక్ కొంటున్నారా...అయితే బెస్ట్ మోడల్స్ ఇవే...ఓ లుక్కేయండి...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఏప్రిల్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో ఈ నెలలో సరికొత్త మోటార్ సైకిళ్లు లాంఛ్ కానున్నాయి. వాటిలో అత్యధిక పవర్ ను అందించే డుకాటీ, ట్రైంఫ్ సంస్థ నుంచి అతి చౌకైన ధరకు రానున్న బైక్ తో పాటు టీవీఎస్ నుంచి అపాచీ ఆర్ఆర్310 అప్డేట్ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి.

ఇంకా చదవండి ...

మార్కెట్లో కొత్త మోటార్ సైకిళ్లు వస్తున్నాయంటే వాహన ప్రియుల మనసంతా వాటిపైనే ఉంటుంది. అత్యాధునిక ఫీచర్లు, ఇంజిన్ తో పాటు అందుబాటులో ధర ఉండే ద్విచక్రవాహనాల కోసం ఎదురుచూస్తుంటారు. గత నెలలో సరికొత్త మోటార్ సైకిళ్లు లాంఛ్ అయ్యాయి. వాటిలో అత్యధిక పవర్ ను అందించే డుకాటీ, ట్రైంఫ్ సంస్థ నుంచి అతి చౌకైన ధరకు రానున్న బైక్ తో పాటు టీవీఎస్ నుంచి అపాచీ ఆర్ఆర్310 అప్డేట్ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. అపాచీ ఆర్ఆర్ 310 సహా పలు  మోటార్ సైకిళ్ల ఫీచర్లేంటో చూద్దాం.

2021 టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310..

అత్యాధునిక ఫీచర్లతో అందుబాటులోకి రానున్న ఈ సరికొత్త 2021 అపాచీ ఆర్ఆర్ 310 కోసం బైక్ ప్రియులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సింగిల్ సిలిండర్ కలిగి ఉన్న దీని ధర వచ్చేసి రూ.2.5 లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. 313 సీసీ ఇంజిన్ ను కలిగి ఉండి 34 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 27.3 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా స్లిప్ క్లచ్, రైడ్ బై వైర్ లాంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. మూడు రైడింగ్ మోడ్ లలో ఇది లభ్యమవుతుంది. ట్రాక్, రెయిన్, అర్బన్ అండ్ స్పోర్ట్ డ్రైవింగ్ మోడ్స్ లో సొంతం చేసుకోవచ్చు. ఈ అప్డేట్ వర్షన్ భారత మార్కెట్లో ఏప్రిల్ 7న విడుదల అయ్యింది.

ట్రైంఫ్ ట్రైడెంట్..

భారత్ లో ట్రైంఫ్ మోటార్ సైకిళ్లు డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ఇందులో ట్రైంఫ్ ట్రైడెంట్ మోటార్ సైకిల్ కోసం గతేడాది నవంబరు నుంచే రూ.50000ల టోకెన్ అమౌంట్ తో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ సంస్థ నుంచి రాబోతున్న అతి చౌకైన బైక్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ మోటార్ సైకిల్ కూడా ఈ నెలలోనే భారత విపణిలోకి తీసుకు రానుందీ సంస్థ. ఇది 660 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ను కలిగి ఉండి 80 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 64 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 6-స్పీడ్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది. ఎక్స్ షోరూంలో దీని ధర వచ్చేసి రూ.7.45 లక్షలుగా సంస్థ నిర్దేశించింది. ఈ బైక్ ఏప్రిల్ 6న భారత మార్కెట్లో లాంఛ్ అయ్యింది.

2021 కేటీఎం ఆర్సీ 390..

ఈ సరికొత్త కేటీఎం ఆర్సీ 390 మోటార్ సైకిల్ కు చెందిన ఫొటోలు ఇప్పడికే విడుదలయ్యాయి. వీటి ఆధారంగా ఇందులో సరికొత్త అప్డేట్లు రానున్నాయని తెలుస్తోంది. అప్డేటెడ్ హెడ్ ల్యాంపు, విండ్ ప్రొటెక్షన్ లాంటి ప్రత్యేకతలతో రానుంది. ఈ ఆర్సీ 390 మోటార్ సైకిల్ 373 సీసీ సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ను కలిగి ఉండి 44 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 35 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 6-స్పీడ్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తుంది. అచ్చం పాత మోడల్ వలే కనిపిస్తోన్న ఈ బైక్ ఆకట్టుకుంటోంది.


డుకాటీ డేవియల్, ఎక్స్ డేవియల్..

2021 మొదటి త్రైమాసికంలో డుకాటీ డేవియల్, ఎక్స్ డేవియల్ మోటార్ సైకిళ్లను విడుదల చేస్తామని డుకాటీ ఇండియా గతంలోనే ప్రకటించింది. అత్యధిక పవర్ క్రూజర్ గా డుకాటీ ఎక్స్ డేవియల్, స్పోర్టీ వర్షన్ గా డుకాటీ డేవియల్ గుర్తింపుతెచ్చుకుంది. డుకాటీ ఎక్స్ డేవియల్ ధర వచ్చేసి రూ.19 లక్షలు కాగా.. డేవియల్ మోడల్ వచ్చేసి రూ.18 లక్షలుగా సంస్థ తెలిపింది. డేవియల్ మోటార్ సైకిల్ 159 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్ తో అందుబాటులోకి వచ్చింది.

First published:

Tags: Bikes

ఉత్తమ కథలు